నిఖత్‌కు చేయూత
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్‌లో సత్తా చాటుతున్న తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్‌కు చేయూతనందించేందుకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ గ్రూప్ సంస్థ ముందుకొచ్చింది. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా దేశంలోని వివిధ క్రీడలకు చెందిన 28 మంది అథ్లెట్లకు జేఎస్‌డబ్ల్యూ సహకారమందిస్తోంది.
వీరిలో నిఖత్ కూడా చేరింది. జేఎస్‌డబ్ల్యూ సహకారం అందుకుంటున్న 12 మంది అథ్లెట్లు త్వరలో గ్లాస్గోలో ప్రారంభం కానున్న కామన్వెల్త్ క్రీడల్లోనూ పాల్గొననున్నారు. కాగా, నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖత్.. రెండేళ్లుగా పలు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తోంది. గత ఏడాది సెర్బియాలో జరిగిన నేషన్స్‌కప్‌లో విజేతగా నిలిచిన నిఖత్.. ఇటీవల సెర్బియాలోనే జరిగిన ‘గోల్డెన్ గ్లవ్ ఆఫ్ వోజ్వోదినా’ అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడం ద్వారా మరోసారి సత్తా చాటింది.