Sports - Fitnes
-
కండలుంటే గెలిచినట్టు కాదు
-
5కే,10కే రన్ చేసేటప్పుడు దయచేసి ఇలాంటి తప్పులు చేయొద్దు
-
జిమ్ డ్రెస్‌లో .. స్టార్స్ మనసు కొల్లగొడుతున్న సచిన్ తనయ
ఇండియన్ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కి తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయ సారా టెండూల్కర్ సైతం ఫ్యాషన్‌తో అభిమానుల మనసులు కొల్లగొడుతోంది. ఆమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తుంటుంది. కాగా ఇటీవల సారా ఓ ఫోటో అప్లోడ్ చేయగా, అది వైరల్ అయ్యింది. అందులో ఆమె జిమ్ డ్రెస్ వేసుకోగా, వెనుక డంబుల్స్ ఉన్నాయి. ఫ్రెండ్ కొత్తగా రూపొందించిన స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఈ పిక్‌ని అప్లోడ్ చేసింది. ఈ పిక్కి.. ‘నా స్నేహితురాలు డాల్జీ ఈ క్రీడ దుస్తులను క్రియేట్ చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఇవీ ఎంతో సౌకర్యంగా ఉన్నాయ’ని క్యాప్షన్‌ని జోడించింది. సారా ఎంతో స్టైలిష్‌గా ఉన్న ఈ పోస్ట్‌కి లక్షల్లో లైక్స్ వచ్చాయి. కాగా ఈ పోస్ట్‌ని బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, కార్తిక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణా ష్రాఫ్ కూడా లైక్ చేశారు. దీంతో ఈ పిక్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, భారత క్రికెటర్ శుభమన్ గిల్‌తో 23 ఏళ్ల ఈ బ్యూటీ డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్న విషయం విదితమే. కానీ ఇప్పటి వరకు ఎవరూ దీనిపై స్పందించలేదు. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) -
అమ్మకానికి రీబాక్.... ఆడిడాస్ సంచలన నిర్ణయం
స్పోర్ట్స్‌వేర్ ఉత్పత్తుల సంస్థ రీబాక్ అమ్మకానికి వచ్చింది. దాదాపు వందేళ్లకు పైబడి కొనసాగుతున్న ఈ ప్రముఖ బ్రాండ్ యాజమాన్యం మరోసారి మారనుంది. ఇందుకు సంబంధించిన చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. రీబాక్ బ్రాండ్ తెలియని యూత్, స్పోర్ట్స్ పర్సన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. దాదాపు నూట ఇరవై ఆరేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పాదరక్షలు, స్పోర్ట్స్ వేర్, ఫిట్నెస్ కేర్‌లో రీబాక్ బ్రాండ్ ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికా బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్బీఏతో రీబాక్కి ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రస్తుతం ఈ బ్రాండ్‌ని 2.5 బిలియన్ డాలర్లకు అథెంటిక్ బ్రాండ్స్ గ్రూప్ (ఏబీజీ) సొంతం చేసుకోనుంది. రీబాక్ బ్రాండ్‌ని మరో ప్రముఖ స్పోర్ట్స్ వేర్ సంస్థ అడిడాస్ 2006లో 3.8 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. నైక్‌కి పోటీగా రీబాక్‌ను తీర్చిదిద్దేంకు ప్రయత్నించింది. అయితే ఆడిడాస్ చేతిలోకి వెళ్లిన తర్వాత రీబాక్ వ్యాపారం బాగా దెబ్బతింది. దీంతో ఆడిడాస్లోని ఇన్వెస్టర్లు రీబాక్‌ను అమ్మాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో రీబాక్ బ్రాండ్‌ను వదిలించుకునేందుకు అడిడాస్ సిద్ధమైంది. -
పరుగెత్తడమూ విద్యే..
వరంగల్ స్పోర్ట్స్ : ‘విద్య అంటే చదవడం, రాయడం.. ర్యాంకుల కోసం వెంపర్లాడడం కాదు.. ఉదయం, సాయంత్రం మైదానాల్లో పరుగెత్తడం.. ఇష్టమైన ఆటల్లో శిక్షణ పొందడమూ విద్యే’ అని బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, భారత జట్టు కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు. ఆదివారం హన్మకొండ అశోకా కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పించాలి తల్లిదండ్రులు వారి ఆలోచనలను పిల్లలపై బలవంతంగా రుద్దుతూ తరగతి గదులకే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు మైదానాలను పరిచ యం చేసి వారికి ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పించాలి. అలా చేయడం వల్ల క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం అలవడుతుంది. విద్యార్థులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. ప్రతిభకు కొదువలేదు.. తెలంగాణలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదువలేదు. పట్టణ, గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అసోసియేషన్ పాటుపడుతోంది. క్రీడలు, క్రీడాకారుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. ప్రతిభ ఉండి ఆర్థికంగా, ఇతర కారణాలతో వెనుకబడిన క్రీడాకారుల వివరాలను మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా వారికి మెరుగైన శిక్షణ అందజేస్తాం. ఫిట్నెస్ పెంపునకు ఒప్పందం టోర్నమెంట్ల సమయంలో క్రీడాకారులకు తెలియకుండా చిన్న చిన్న ఒత్తిళ్లు వారి మెదడులోకి చొచ్చుకుపోతుం టాయి. తద్వారా క్రీడలపై దృష్టి పెట్టలేక చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరచలేని పరిస్థితులు ఉన్నాయి. క్రీడాకారుల్లో సైకాలజికల్‌గా ఫిట్నెస్ పెంపొందించేందుకు ఖరగ్‌పూర్ ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మెరికల్లాంటి కోచ్‌లను తయారు చేస్తాం.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కోచ్‌ల కొరత ఉంది. కోచ్‌లు ఉన్న కొన్ని చోట్ల నైపుణ్యం కలిగిన వారు తక్కువగా ఉన్నట్లు గుర్తించాం. అందుకే రానున్న రోజుల్లో క్రీడాకారులనే కాదు మెరికల్లాంటి కోచ్‌లను తయారు చేయాలని సిద్ధమవుతున్నాం. అందుకోసం జూలై 1 నుంచి ప్రత్యేక శిక్షణ తరగుతులు నిర్వహించనున్నాం. ఇప్పడికే కోచ్‌లుగా కొనసాగుతున్న వారితోపాటు కొత్త వారికి ప్రత్యేక శిక్షణ అందించడమే తమ లక్ష్యం. వరంగల్‌లో త్వరలో బ్యాడ్మింటన్ అకాడమీ.. హైదరాబాద్‌లో మాదిరిగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను క్రీడాకారులు మా ముందుకు తీసుకొస్తున్నారు. అయితే అకాడమీ ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. సాంకేతిక ఇతర కారణాలు అనేకం అడ్డొస్తుంటాయి. వరంగల్ కేంద్రంగా త్వరలోనే అకాడమీ ఏర్పాటు చేసేందుకు పలువురి సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. వీలైనంత త్వరలోనే ఏర్పాటుకు కృషి చేస్తున్నాను. -
ఇలా అయితే.. ఆటలు సాగేదెలా..
సాక్షి, పెగడపల్లి: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆట స్థలాలు, వ్యాయామ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. మండలంలోని మెజార్టీ పాఠశాలల్లో ఈ రెండు సౌకర్యాలు లేక విద్యార్థులు వికాసానికి దూరమవుతున్నారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. బాల్యంలోనే దాన్ని వెలికితీస్తే వారిలో నైపుణ్యాలు మెరుగయ్యే అవకాశాలుంటాయి. కానీ ఆప్రతిభను తీసి ప్రోత్సహించే వారులేరు. విద్యార్థుల్లో దాగి ఉన్నా ప్రతిభను గుర్తించి వారిని ఆయా క్రీడల్లో సుశిక్షితులుగా చేయాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉంటుంది. అందుకు అనుగుణంగా ఆట స్థలాలు కూడా ఉండలి. కానీ చాలా పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు, మైదానం లేక పోవడంతో వారికున్న ప్రతిభ మరుగున పడిపోవడమే కాకుండా చిన్నారులు ఆటలకు దూరమవుతున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి ఎక్కువ ఉంటుంది. వారిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది. వారికి తగిన శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దే వారులేరు. వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి తగిన శిక్షణ ఇస్తే మేము కూడా ఆటల్లో రాణిస్తామని విద్యార్థులు పేర్కొంటున్నారు. పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. మండలంలో ఒకే ఒక్కరు మండలంలో 6 యూపీఎస్, 6 హైస్కూల్లున్నాయి. మండలంలోని నంచర్ల పాఠశాలలో మినహా మరెక్కడ వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. బతికపల్లి, పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులున్నా భర్తీ కావడం లేదు. గతంలో ఈపాఠశాలల్లో పని చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లి ఏళ్లు గడుస్తున్న వారి స్థానంలో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచన కూడా చేయడం లేదు. మిగితా పాఠశాలల్లో అసలు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల మంజూరు లేదు. పీఈటీల సమస్య ఇలా ఉంటే విద్యార్థులకు తెలిసిస ఆటలు ఆడుకుందామని ఉన్న అందుకు సరిపడు ఆటస్థలం కరువైంది. అన్ని పాఠశాలల్లో ఆట స్థలాలు ఏర్పాటు చేసి విద్యార్థులు క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మండలంలోని బతికపల్లి, నంచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్న వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రతి ఏటా సంబంధిత అధికారులను ఈవిషయమై కోరుతున్నా ఎవ్వరు పట్టించుకోవడం లేదని ఆయా పాఠశాలల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతులు కల్పించాలి ఆటలు ఆడాలని ఉన్నా స్థలంతో పాటు సరైన శిక్షణ లేక క్రీడల్లో రాణించ లేక పోతున్నాం. సరైన శిక్షణ ఉంటే జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణిస్తాం. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభను వెలికి తీయాలి. చాలా చోట్ల పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ లేదు. గ్రౌండ్ స్థలం కేటాయించి వసతులు కల్పించాలి. – రాగళ్ల హరీశ్ బతికపల్లి ప్రోత్సాహం కరువు ఆటలు ఆడేందుకు ఆసక్తి ఉన్నా ఆడించే వారులేరు. దీనికితోడు మైదానం కూడా లేదు. ఆటల్లో ప్రోత్సాహం కరవైంది. క్రీడలకు కావాల్సిన వసతులు లేక క్రీడల్లో రాణించలేక పోతున్నాం. ఫలితంగా ఆటలకు దూరమవుతున్నాం. మాకు వ్యాయామ ఉపాధ్యాయుడు, మైదానం ఏర్పాటు చేయాలి. – రాజ్‌కుమార్ 10వ, తరగతి పెగడపల్లి సమాచారం సేకరిస్తున్నాం పాఠశాలల్లో మైదానాలు ఏర్పాటు, పీఈటీల నియామకంపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. యూడైస్ నివేదిక ఆధారంగా హెచ్ఎంల ద్వారా పాఠశాలల్లో పూర్తి సమాచారం సేకరిస్తున్నాం. ఆటస్థలం, పీఈటీల కొరతపై వివరాలు యూడైస్ నివేదికలో చేర్చుతాం. – శ్రీనివాస్, ఎంఈవో -
డయాబెటిస్ వచ్చింది... వరి అన్నం మానేయాలా?
నా వయసు 56. నాకు డయాబెటిస్ వచ్చినట్లు ఇటీవలే తెలిసింది. చాలా మంది ఫ్రెండ్స్ అన్నం మానేసి, గోధుమరొట్టెలు తినమని అంటున్నారు. డయాబెటిస్ వచ్చినవారికి వరి మంచిది కాదా? - బి. వెంకటరావు, హైదరాబాద్ ఇది చాలా మందిలో ఉండే అపోహే. తృణధాన్యాలన్నింటిలో తక్షణం వండి తినడానికి వీలుగా ఉండేది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతం మంది వరినే ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తుంటారు. అయితే చాలామందిలో ఇది బరువు పెరగడానికి, స్థూలకాయానికి, మధుమేహం మరింత పెరగడానికి దోహదం చేస్తుందనే అపోహ ఉంది. దాంతో రాత్రి పూట రోటీలు మాత్రమే తినడమో లేదా డయాబెటిస్ వస్తే వరిని పూర్తిగా మానేసి, గోధుమ లేదా ఇతర ఆహారాలు తీసుకోవడమో చేస్తుంటారు. వాస్తవానికి మనం తీసుకునే ఆహారంతో మనకు అవసరమైన శక్తిలో 60 శాతం కార్బోహైడ్రేట్ల నుంచి వస్తుంది. ఈ కార్బోహైడ్రేట్లు రెండు రకాలుగా ఉంటాయి. 1) సింపుల్ షుగర్స్... అంటే చక్కెర, బెల్లం, మనం తయారు చేసుకునే స్వీట్ల వంటివి. ఇవి తీసుకోగానే రక్తంలో చక్కెరపాళ్లు వేగంగా పెరుగుతాయి. శరీరానికి అవసరమైన శక్తి కోసం వినియోగించిన పోగా మిగిలినవి కొవ్వు నిల్వలుగా మారతాయి. ఇక రెండో రకమైన కార్బోహైడ్రేట్లు... కాంప్లెక్స్ షుగర్స్. ఇవి తృణధాన్యాలు, దుంపలు, కొన్ని పళ్లు, నట్స్ నుంచి లభిస్తాయి. కాంప్లెక్స్ షుగర్స్ వల్ల లాభం ఏమిటంటే... అవి శరీరంలోకి మెల్లిగా అబ్సార్బ్ అవుతాయి. పైగా వినియోగం కాగా మిగిలినవి కొవ్వు నిల్వలుగా మారే అవకాశం తక్కువ. వరి కూడా ఇలాంటిదే. పైగా పొట్టుతో ఉండే ముడిబియ్యంలో పీచుపదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు కూడా అదనంగా ఉంటాయి. కాబట్టి వరి బరువును పెంచడానికో లేదా డయాబెటిస్‌ను మరింత పెంచడానికో దోహదపడుతుందనేది పూర్తిగా అపోహ మాత్రమే. అయితే అన్నం విషయంలో మనం ఎంత మోతాదులో దాన్ని తీసుకుంటున్నామో తెలిసే అవకాశం కాస్త తక్కువ. అదే రోటీలు తీసుకుంటే రెండు, మూడు, నాలుగు... ఇలా లెక్క తెలిసే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది రోటీలకు ప్రాధాన్యమిస్తుంటారు. మీ పరిమితి తెలుసుకుని తినగలిగితే... అదీ ముడిబియ్యం వాడితే వరి కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్