spreding viral fevers
-
పిల్లల నుంచే కరోనా ప్రమాదం ఎక్కువ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి పిల్లలపై పెద్దగా ప్రభావం చూపించడం లేదని, వైరస్ సోకినప్పటికీ పిల్లలుపై దాని ప్రభావం పెద్దగా ఉండడం లేదని, వైరస్ సోకినప్పుడు కొందరు పిల్లల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, మరి కొందరిలో అసలు అలాంటి లక్షణాలు కూడా కనిపించడం లేదని, అతి తక్కువ పిల్లలలపై మాత్రమే ‘కవసాకి వ్యాధి’ లాగా తీవ్ర ప్రభావం చూపిస్తోందంటూ వైద్య నిపుణుల నుంచి కరోనా వ్యాపిస్తోన్న తొలినాళ్లలో వినిపడిన వాదన. పిల్లల విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భరోసా ఇచ్చింది. (ఇలా కూడా కరోనా వస్తుందంటే.. నమ్మలేం!) ఈ నేపథ్యంలో భారత్ సహా పలు దేశాల పిల్లల విషయంలో పెద్దలు నిర్లక్ష్యం వహించారు. పిల్లలు సరైనా మాస్కులు లేకుండా ఆట పాటల్లో గడుపుతున్నారు. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతోంది కనుక వారి ఆరోగ్యం కరోనా వైరస్ పెద్దగా ప్రభావం చూపించలేక పోవచ్చునుగానీ, వారి ద్వారా పెద్దలు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు వైరస్ బారిన పడి మత్యుగుహలోకి అడుగు పెడుతున్నారని ‘ది జర్మన్ సొసైటీ ఫర్ వైరాలోజీ’ తాజాగా హెచ్చరించింది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ పిల్లల విషయంలో పాటించాల్సిన కొన్ని మార్గదర్శకాలను వివరించింది. 12 ఏళ్లు, ఆపై వయస్సున్న పిల్లలంతా విధిగా నోరు, ముక్కు కవరయ్యేలా మాస్కులు ధరించాలని. ఆరేళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలు కూడా స్వచ్ఛందంగా మాస్కులు వేసుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, స్కూలు వెళ్లే ప్రతి పిల్లవాడు మాస్కు ధరించాలని సూచించింది. స్పెయిన్‌లో కరోనా వైరస్ సోకినా 60 వేల మందిపై యాండీ బాడీస్ పరీక్షలు నిర్వహించగా, వారిలో 3.4 శాతం పిల్లలు ఉన్నారని తేలింది. వారి అందరిలో యాంటీ బాడీస్ అభివద్ధి చెందినట్లు తేలడం సంతోషకరమైన వార్త. పెద్ద వాళ్లలో కేవలం 4. 4 నుంచి ఆరు శాతం మందిలో మాత్రమే యాంటీ బాడీస్ ఉన్నట్లు గుర్తించారు. కనుక పిల్లల విషయంలో పెద్దలే జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. -
మంచంపై మన్యం
మండలాల వారీగా నమోదైన జ్వరపీడిత కేసులు మండలం పీహెచ్‌సీలు జూలై ఆగస్ట్ పోలవరం 4 480 220 బుట్టాయగూడెం 6 2,800 1,500 జీలుగుమిల్లి 2 484 102 కుకునూరు 2 770 300 వేలేరుపాడు 2 1,000 550 కొయ్యలగూడెం 1 300 450 టి.నరసాపురం 2 489 195 పోలవరం : మన్యసీమ విష జ్వరాలతో వణికిపోతోంది. నిత్యం వందలాది మంది జ్వరాల బారిన పడుతూ చికిత్స కోసం పీహెచ్‌సీలను ఆశ్రయిస్తున్నారు. వైరల్ జ్వరాలతోపాటు టైఫాయిడ్, మలేరియా కేసులు సైతం ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయి. అక్కడక్కడా బయటపడుతున్న డెంగీ జాడలు కలవరపెడుతున్నాయి. గిరిజన మండలాలైన పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడుతోపాటు ఏజెన్సీని ఆనుకుని ఉన్న జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, టి.నరసాపురం వంటి మైదాన ప్రాంత మండలాల్లోనూ జ్వరాల కేసులు కలవరపెడుతు న్నాయి. పోలవరం నియోజకవర్గంలో 19 పీహెచ్‌సీలు ఉండగా, వేల సంఖ్యలో జ్వరాల కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జూలైలో 6,023, ఆగస్ట్‌లో ఇప్పటివరకు 3,317 కేసులు నమోదయ్యాయి. వీటిలో 20 నుంచి 30 శాతం టైఫాయిడ్ కేసులు కాగా, పదుల సంఖ్యలో మలేరియా బాధితులు సైతం ఆసుపత్రులకు వస్తున్నారు. వైద్యుల కొరత, రక్త పరీక్ష ఫలితాలు ఆలస్యమవుతుండటంతో ప్రైవే టు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదిలావుంటే వాతావరణంలో మార్పులతోపాటు పంచాయతీలు రక్షిత మంచినీటి పథకాలను క్లోరినేషన్ చేయకపోవడం, గ్రామాల్లో నీరు నిల్వ ఉన్నచోట పారిశుధ్య పనులు చేపట్టకపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నీటి నమూనాలు సేకరించి పరీక్షించడం లేదు. నెలకు రెండుసార్లు పరీక్షించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. కాచి చల్లార్చిన నీటి తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రకటనలిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు.