Spurned lover
-
వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు..
తన ప్రేమను కాదందన్న అక్కసుతో మానవ మృగంలా మారిపోయి యువతిని దారుణంగా హతమార్చాడో దుర్మార్గుడు. కత్తిలో నరికి అత్యంత దారుణంగా అమాయకురాలిని పొట్టన పెట్టుకున్నాడు. ఉన్మాదిలా మారి తమ కూతురి ప్రాణం బలిగొన్న రాక్షసుడిని ఉరి తీయాలని హతురాలి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ క్రైం: ప్రేమోన్మాది గుబ్బల వెంకట సూర్యనారాయణ చేతిలో హతమైన కాదా దేవికపై జరిగిన దాడి అత్యంత పాశవికమైనదని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. కాకినాడ జీజీహెచ్లో దేవిక మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి నివేదిక ప్రకారం.. దేవికను నిందితుడు కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో ఆమె ముఖం, మెడ భాగాల్లో లోతైన గాట్లు పడ్డాయి. సూర్యనారాయణ ఆమె కాలర్ బోన్లో కత్తి దింపి ఎడమ వైపునకు చీల్చేశాడు. రెండువైపులా నరకడంతో మెడలోని రక్తనాళాలు పూర్తిగా తెగిపోయాయి. దేవిక మరణానికి అదే కారణమని గుర్తించారు. విచక్షణారహితంగా కత్తితో పొడుస్తూండటంతో దేవిక రెండు చేతులూ అడ్డం పెట్టి రక్షించుకునే ప్రయత్నం చేసింది. అయితే అంతకు మించిన బలంతో అతడు కత్తితో పొడవడంతో దేవిక రెండు మోచేతుల పైభాగాల్లో లోతైన గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె ఎడమ చేతి ఎముకను సత్యనారాయణ నరికేశాడు. ఆమె రెండు భుజాలు శరీరం నుంచి వేరు పడ్డాయి. ఎడమ భుజానికి ఆధారమైన హ్యూమరస్ ఛిద్రమైంది. అక్కడి ఎముకలో సైతం కత్తి దిగింది. కత్తి నేరుగా మెడలో దించిన ఆనవాళ్లున్నాయి. దేవిక శరీరంలో మొత్తం 15 బలమైన గాయాలున్నట్టు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. ఆ రాక్షసుడిని ఉరి తీయాలి చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం చేసుకుంటుందనుకుంటే ఇలా దారుణంగా హత్యకు గురవుతుందని ఊహించలేదని దేవిక కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తమ వద్దే పెరిగి, చదువుకుంటోందని, ఉద్యోగం వస్తే కళ్లలో పెట్టుకుని చూసుకుంటుందని అనుకుంటే దేవుడు అన్యాయం చేశాడంటూ దేవిక అమ్మమ్మ బోరున రోదించింది. అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటుందని హైదరాబాద్లో తాము నిశ్చింతగా ఉంటే కిరాతకుడి చేతిలో తమ కూతురు బలైపోయిందని దేవిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమార్తెని హత్య చేసిన రాక్షసుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. (క్లిక్: ప్రేమోన్మాది ఘాతుకం.. పట్టపగలే నడిరోడ్డుపై కిరాతకం) దేవిక కుటుంబానికి ప్రభుత్వం అండ: మంత్రి చెల్లుబోయిన వేణు రామచంద్రపురం/కె.గంగవరం: ప్రేమోన్మాది చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన కాదా దేవిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడి ఆదుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కరప మండలం కూరాడలో హత్యకు గురైన కాదా దేవిక తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను మంత్రి వేణు కె.గంగవరంలో ఆదివారం సాయంత్రం పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ఆటవికంగా హత్యకు పాల్పడిన హంతకుడిపై ప్రభుత్వం తర్వతగతిన విచారణ పూర్తి చేసి కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలు ప్రస్తావించకూడదని, ప్రతి ఒక్కరూ ఇలాంటి దుశ్చర్యలను ఖండించాలన్నారు. ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవాని, కె.గంగవరం మండల విప్ కొప్పిశెట్టి లక్ష్మణ్, శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు నరాల ఏడుకొండలు, వైఎస్సార్సీపీ నాయకుడు పంపన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి వద్దందని.. ప్రియురాలిని నరికేశాడు
తాను ఎంతగానో ప్రేమిస్తున్న ప్రియురాలు.. తనను పెళ్లి చేసుకోడానికి నిరాకరించడంతో తీవ్రంగా నిరాశ చెందిన ప్రేమికుడు.. ఆమెను గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతమైన జవహర్ తాలూకాలో జరిగింది. నిందితుడు నీలేష్ ఖార్పడా (19) గత కొన్నాళ్లుగా 14 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. వీళ్లిద్దరూ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారని, దాంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని.. కానీ ఆమె అతడి ప్రతిపాదనను తిరస్కరించిందని పోలీసులు తెలిపారు. వీళ్లిద్దరూ కూడా ఇదే తాలూకాలోని తిలోండా అనే గ్రామానికి చెందినవారు. బాధితురాలు ఖర్వాడా గ్రామం వ్దద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనక నుంచి వచ్చిన ప్రేమికుడు ఆమెను గొడ్డలితో నరికేశాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి పంపారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
ప్రేయసిపై కోపంతోనే చర్చిని ధ్వంసం చేశాడు
ఆమె క్రిస్టియన్.. అతను ముస్లిం. నాలుగు నెలల కిందట ఓ చర్చిలో ఆమెను చూసి మనసు పారేసుకున్నడు. మొదట ఆమె కూడా ఓకే చెప్పింది. వేర్వేరు మతాలు కాబట్టి ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోరని, ఒక్కసారిగా ప్రేమబంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది! ఆమెపై, తమను విడదీసిన కారణంపై కోపం పెంచుకున్న ఆ విఫల ప్రేమికుడు చర్చిని ధ్వసం చేసి పారిపోయాడు. చివరికి పోలీసులకు చిక్కి నేరం అంగీకరించాడు! ఏప్రిల్ 16న నగరంలోని ప్రతాప్ పురా ప్రాంతంలోని సెయింట్ మేరీస్ చర్చిపై గుర్తుతెలియని దుండగులు దాడిచేసి, ప్రతిమలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఊహించని విధంగా ప్రేమ కోణం బయటపడింది. ముగ్గురు నిందితుల్లో ఒకరైన హైదర్ అలీ ప్రేమ విఫలమైన నిర్వేదంలోనే స్నేహితుల సహాయంతో చర్చిని ధ్వసం చేశాడని, పోలీసుల ఇంటరాగేషన్లో నేరం అంగీకరించాడని ఓ ఉన్నతాధికారి మీడియాకు చెప్పారు. సదరు చర్చికి వెళ్లే ఓ యువతి, హైదర్లు ప్రేమించుకున్నారని, మతాలు వేరవ్వడంతో ఆమె పెళ్లికి నిరాకరించి, చెర్చికి రావడం మానేసిందని, దీంతో ఆమెపై, తమను విడదీసిన కారణంపై అక్కసు పెంచుకున్న హైదర్ దురాగతానికి ఒడిగట్టాడని, ఆ మేరకు వాగ్మూలం కూడా రాసిచ్చినట్లు సమాచారం. అయితే ఆగ్రా సిటీ ఎస్పీ సమీర్ సౌరభ్.. హైదర్ ను అదుపులోకి తీసుకున్న విషయం తప్ప మిగతా వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. -
ప్రేమించలేదని కారుతో గుద్దేశాడు..
కొచ్చి: కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో దారుణం జరిగింది. సంవత్సర కాలంగా వెంటపడుతున్నా పట్టించుకోవడం లేదనే అక్కసుతో 22 సంవత్సరాల అమ్మాయిపై కారును ఎక్కించాడో దుర్మార్గుడు. బీకాం రెండవ సంవత్సరం చదువుతున్న అమ్మాయిపై 21 ఏళ్ల షెబీన్ ఈ దాడికి తెగబడ్డాడు. అరింబూర్ లోని గుడి కెళ్ళి తిరిగి వస్తున్న ఆమెపై కారుతో ఎటాక్ చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అంతేకాదు ఆమె సహాయం చేసేందుకు ప్రయత్నించిన మరో ఐదుగురిపై కూడా కారు ఎక్కించాడు. కారు రివర్స్ చేసుకొని వచ్చిమరీ వారిని కారుతో గుద్ది తీవ్రంగా గాయపర్చాడు. వీరిలో ఒకరు వెంటలేటిర్పై చికిత్స తీసుకుంటుండగా, మరో వ్యక్తి ఐసీయూ లో ఉన్నారు. సంఘటన అనంతరం నిందితుడు షెబీన్ తల్లితండ్రులతో సహా పరారయ్యాడు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.