sreedhar
-
మరో మూవీకి సై అన్న మెగాస్టార్ అల్లుడు
విజేత సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా స్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా మరో చిత్రం రాబోతుంది. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్ సమర్పణలో పీపుల్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది. విక్టరీ వెంకటేష్ నమో వెంకటేశ, మహేష్ బాబు దూకుడు వంటి చిత్రాలకు రచనా సహకారం అందించిన శ్రీధర్ సీపాన ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. (నవిష్క..వేడుక) ఇటీవలే వెంకీ మామ వంటి ఘన విజయం సాధించిన చిత్రాన్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫాక్టరీ, మరో చిత్ర నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలసి ఈ ఏడాది మార్చి నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీధర్ ఇప్పటికే అహ నా పెళ్ళంట, పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం,సౌఖ్యం, డిక్టేటర్ వంటి పలు చిత్రాలకు కథ, మాటలు అందించిన విషయం తెలిసిందే. (‘సూపర్ మచ్చి’ అంటున్న చిరు అల్లుడు ) ఈ సందర్భంగా శ్రీధర్ సీపాన మాట్లాడుతూ..‘రచయితగా నాకున్న అనుభవంతో ఓ మంచి కథను దర్శకునిగా పరిచయం కావటానికి సిద్ధం చేసుకున్నాను. ఈ కధకు హీరో కళ్యాణ్ దేవ్ సరైన నాయకుడని అనిపించింది. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కధా చిత్రంగా దీనికి రూపకల్పన చేయటం జరిగింది. హీరో పాత్ర ఎంతో ఉన్నతంగా ఉంటుంది. దర్శకునిగా నన్ను పరిచయం చేస్తున్న నిర్మాతలకు కృజ్ఞతలు. వారి గౌరవాన్ని పెంచే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తానని నమ్మకంగా చెప్పగలను’ అని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర నటీనటులను, సాంకేతిక వర్గం వివరాలు త్వరలో ప్రకటిస్తామని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు. -
బాధ్యతలు చేపట్టిన ఆర్టీఓ
అనంతపురం సెంట్రల్ : జిల్లా రోడ్డు ర వాణా శాఖ అధికారి (ఆర్టీఓ)గా కె. శ్రీధర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆర్టీఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులకు ఉత్తమ సేవలందించడమే తన ప్రథమ లక్ష్యమన్నారు. -
సీఆర్డీఏ కొత్త కమిషనర్‌గా శ్రీధర్
సాక్షి, విజయవాడ బ్యూరో : సీఆర్డీఏ కమిషనర్ నాగులాపల్లి శ్రీకాంత్ బదిలీ చర్చనీయాంశంగా మారింది. రాజధాని వ్యవహారాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నా ఆయనను ఉన్నట్టుండి బదిలీ చేయడం వెనుక రాజకీయ కారణాలున్నాయని తెలుస్తోంది. సీఆర్డీఏ ఆవిర్భావం నుంచి దానికి ఒక రూపు తీసుకురావడంతోపాటు రాజధానిలో భూసమీకరణ, సింగపూర్ మాస్టర్‌ప్లాన్, స్విస్ ఛాలెంజ్ విధానం వంటి అంశాల్లో కీలకపాత్ర పోషించిన శ్రీకాంత్‌ను రెండేళ్ల క్రితం ఏరికోరి ప్రభుత్వం ఆ పోస్టులో కూర్చోబెట్టింది. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను కావాలని సీఆర్డీఏ కమిషనర్‌గానియమించారు. సీఆర్డీఏ స్వరూపం ఎలా ఉండాలనే దానిపై ఆయన భారీ కసరత్తు చేసి కొత్త విభాగాలను ఏర్పాటు చేశారు. వీజీటీఎం ఉడాలో కేవలం నాలుగు విభాగాలే ఉండగా అది సీఆర్డీఏగా మారిన తర్వాత 18 విభాగాలు ఏర్పాటు చేయించారు. రైతుల వ్యతిరేకతతో కత్తిమీద సాములా మారిన భూసమీకరణలోనూ కీలకంగా వ్యవహరించారు. కొత్త రాజధాని ఎలా ఉండాలనే దానిపై పలు దేశాల్లో పర్యటించి నివేదికలు సమర్పించారు. సింగపూర్, జపాన్, చైనా తదితర దేశాల నుంచి వచ్చిన పలు కంపెనీలను ఆయన సీఆర్డీఏ కార్యాలయంలోనే పనిచేయించి తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. వాస్తవానికి కొద్ది రోజుల నుంచి కమిషనర్ బదిలీ అవుతారని సీఆర్డీఏలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల నెలరోజులపాటు శ్రీకాంత్ ముస్సోరి శిక్షణకు వెళ్లినప్పుడే ఆయన బదిలీ అవుతారనే ప్రచారం జరిగింది. మూడురోజుల క్రితం శిక్షణ ముగించుకుని వచ్చి ఆయన విధుల్లో చేరారు. ఆ తర్వాత వెంటనే బదిలీ కావడం గమనార్హం. రాజధాని వ్యవహారాలు రోజురోజుకూ కీలకంగా మారుతున్న సమయంలో ఆయన్ను ఎందుకు మార్చారనే దానిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. రాజకీయ కారణాలే ఆయన బదిలీకి కారణమనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఆయన స్థానంలో గుంటూరు జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ అదనపు కమిషనర్‌గా ఉన్న చెరుకూరి శ్రీధర్ నియమించారు. రాజధాని భూసమీకరణలో కీలక భూమిక నిర్వహించిన శ్రీధర్‌కు కొద్దికాలంగా ఇతర సీఆర్డీఏ వ్యవహారాల్లోనూ ప్రాధాన్యత పెరిగింది. శ్రీకాంత్ శిక్షణలో ఉన్న సమయంలో ఆయనే ఇన్చార్జి కమిషనర్‌గా వ్యవహరించారు. ఇప్పుడు పూర్తిస్థాయి కమిషనర్‌గా నియమితులు కావడం విశేషం. భూసమీకరణలో కీలకంగా... సాక్షి, అమరావతి : సీఆర్డీఏ కమిషనర్‌గా నియమితులైన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి 2014 అక్టోబర్ మూడున జేసీగా బాధ్యతలు స్వీకరించారు. రాజధానికి భూసమీకరణలో అన్నీ తానై రైతులను ఒప్పించి భూములను రాజధానికి ఇప్పించడంలో తనదైన ముద్ర వేశారు. రాష్ట్రంలో మీ ఇంటికి – మీ భూమి కార్యక్రమాన్ని మొట్టమొదట గుంటూరు జిల్లా నుంచే ప్రారంభింపజేయటంలో కృషి చేశారు. మిర్చి యార్డులో కీలక సంస్కరణలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన బదిలీ కావటంతో ఆ స్థానంలో జాయింట్ కలెక్టర్‌గా ఇంకా ఎవరినీ నియమించలేదు. -
పత్తి వ్యాపారి ఆత్మహత్య
సత్తెనపల్లి : ఆర్థిక ఇబ్బందులతో పత్తి వ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దుల్లిపల్ల గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన అలోకం శ్రీధర్(40) పత్తి వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దీంతో మనస్థాపానికి గురై మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.