Sri Chaitanya students
-
‘వాహనదారులారా.. కళ్లు తెరవండి.. విలువైన ప్రాణాలు పణంగా పెట్టకండి’
ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా 13 లక్షలమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఇక గాయపడ్డ వారి సంఖ్య అయిదు కోట్లమంది కంటే ఎక్కువే. అంటే ప్రతి మూడు నిమిషాలకొకరు ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు. ఇక ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశాల్లో భారతదేశమే ముందుంది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట నెత్తురోడుతున్న దేశం మనది. దేశీయ రహదారుల పొడవు 47లక్షల కిలోమీటర్లయితే 27 శాతానికి పైగా రోడ్డు ప్రమాదాలు నేషనల్ హైవేల మీదనే జరుగుతున్నాయి. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. జాగ్రత్తలు మరిచి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు కొందరు. వీరి వల్ల అమాయకులు ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ట్రాఫిక్ పట్ల చైతన్యం పెంపొందించేందుకు కొంపల్లి శ్రీ చైతన్య K5 పాఠశాల విద్యార్థులు నడుం బిగించారు. తమ వంతు బాధ్యతగా కొంపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించడం, హెల్మెట్ ధరించకపోవటం,సైలెన్సర్లు తీసేసి భారీ శబ్దంతో హారన్లు మోగించుకుంటూ నడపటం, ఫుట్ పాత్‌లపైకి దూసుకురావడం.. రాంగ్ రూట్లలోకి రావడం, పరిమితికి మించి వేగంగా వాహనం నడపడం, మద్యం తాగి రోడ్డెక్కడం.. ఇలా ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలపై చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు విద్యార్థులు. వాహనం జాగ్రత్తగా నడపడంతో పాటు అంబులెన్స్‌లకు దారివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య ఏజీఎం జీవీఆర్ రావు, కె5 ప్రిన్సిపళ్లు నేతాజీ, సౌజన్య, ఇతర ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు రోదసీ రంగంలో నాసా పరిశోధనలకు సంబంధించి వివిధ కిట్స్‌ను విద్యార్థులకు అందించారు. -
వ్యాసరచన పోటీల్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ
సాక్షి, హైదరాబాద్: మధుమేహ వ్యాధి ప్రబలడానికి కారణాలు, నివారణ చర్యలపై అవగాహన పెంచడానికి విజయవాడలోని వీజీఆర్ డయాబెటిక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, శ్రీ చైతన్య స్కూల్ నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు భారీ సంఖ్యలో విజేతలుగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన ఈ పోటీల్లో 40,358 మంది విద్యార్థులు పాల్గొనగా.. 2,295 మంది విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలోని సిద్ధార్ధ ఆడిటోరియంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో విజేతలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, వీజీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ కె.వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. విజేతలను శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ బీఎస్ రావు అభినందించారు. -
ఎన్టీఎస్ఈ ఫలితాల్లో శ్రీ చైతన్య క్లీన్ స్వీప్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్(ఎన్టీఎస్ఈ) స్టేజ్-1 పరీక్షల ఫలితాల్లో స్టేట్ మొదటి ర్యాంకు నుంచి వరుసగా 20 ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులు సాధించి క్లీన్‌స్వీప్ చేశారని ఆ విద్యా సంస్థల అకాడమిక్ డెరైక్టర్ సీమ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా 103 మంది విద్యార్థులు ఒక్క శ్రీ చైతన్య స్కూల్ నుంచే ఎంపికయ్యారని ఆమె వెల్లడించారు. తమ విద్యార్థులైన ఎం.కౌషిక్, కె.రోహిత్ రెడ్డిలు స్టేట్ మొదటి ర్యాంకును, ఎ.కల్యాణ్ నాయక్, ఎ.భరత్ స్టేట్ రెండో ర్యాంకును సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బి.ఎస్.రావు మాట్లాడుతూ ఎన్‌టీఎస్‌ఈలో గత ఐదేళ్లుగా శ్రీ చైతన్య విద్యార్థులే అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, పటిష్టమైన రీసెర్చ్ ఓరియంటెడ్ టీచింగ్ మెథడాలజీ వల్లే ఇలాంటి అద్భుత ఫలితాలు సాధించినట్లు ఆయన వివరించారు. -
ఒత్తిళ్లను అధిగమిస్తేనే విజయం
ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ బళ్లారి అర్బన్, న్యూస్‌లైన్ : మానసిక ఒత్తిళ్లను అధిగమించినప్పుడే పరీక్షలలో, ఇంటర్వ్యూలలో విజయం సాధ్యమవుతుందని ప్రముఖ నవలా రచయిత, మానసిక వైద్య నిపుణులు, ఫిల్మ్ డెరైక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ విద్యార్థులకు సూచించారు. స్థానిక రాఘవ కళామందిరంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దశల వారీగా శ్రీచైతన్య విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. ఒత్తిళ్లను తట్టుకునే విధానాలపై మెళకువలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చురుకుదనం, బుద్ధి వికాసంతో పాటు శారీరక ఎదుగుదలకు వ్యక్తిత్వ వికాసం తోడ్పడుతుందన్నారు. విద్యార్థులకు విలువతో కూడిన విద్యను అందించి ఉజ్వల భవిష్యత్తు అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యాభివృద్ధితోనే దేశం మరింత పురోభివృద్ధి చెందుతుందన్నారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి లభించాలంటే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశ్నాపత్రం అందించి జవాబులు సరిచేసే విధానాన్ని క్షుణంగా వివరించారు. అత్యంత వినోదంగా, ఉత్సాహంగా సాగిన యండమూరి ప్రసంగం విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపింది. కార్యక్రమంలో శ్రీచైతన్య పీయూ కళాశాల ప్రిన్సిపాల్ బీ.గోపాల్, శ్రీరాములు, అనిత, ఎన్ చంద్రశేఖర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.