Sri Govindaraja Swamy
-
ఫిబ్రవరి 4న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రథసప్తమి
తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పర్వదినం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా స్వామివారు దేవేరులతో కలిసి ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.తెల్లవారు జామున 3 నుండి 5 గంటల వరకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుండి 7.30 గంటల వరకు సూర్యప్రభ వాహనంతో శ్రీగోవిందరాజస్వామి వారి వాహన సేవలు ప్రారంభమవుతాయి.ఉదయం 8 నుండి 9 గంటల వరకు హంస వాహనం, ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పెద్దశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 2.30 గంటల వరకు ముత్యపు పందిరి వాహనం, మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.రాత్రి 7 నుండి రాత్రి 8.30 గంటల వరకు గరుడ వాహనాన్ని అధిష్టించి శ్రీవారు దర్శనమిస్తారు. రథసప్తమి వేడుకలను అర్ధ బ్రహ్మోత్సవమని, ఒక రోజు బ్రహ్మోత్సవమని కూడా భక్తులు అంటారు. TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంతిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. .శ్రీవారి దర్శనానికి రెండు కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు74,742 మంది స్వామివారిని దర్శించుకోగా 22,466 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.67 కోట్లు సమర్పించారు.దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
కల్పవృక్ష వాహనంపై గోవిందుడి వైభవం
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం ఉదయం గోవిందరాజస్వామి కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ వాయిద్య విన్యాసాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వాహన సేవ అనంతరం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. సుగంధ పరిమళాలు, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి సర్వభూపాల వాహన సేవ సాగింది. కార్యక్రమంలో పెదజీయంగార్, చిన్నజీయంగార్, టీటీడీ స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో చంద్రశేఖర్‌పిళ్లై, ఏఈవో ప్రసాదమూర్తిరాజు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ కళావేదికలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందులో భాగంగా గోవిందరాజస్వామి ఆలయంలో ఉదయం ఎస్కె.స్వర్ణకుమారి బృందం విష్ణుసహస్రనామ పారాయణం సాగింది. అనంతరం కే.రవీంద్రరెడ్డి పురాణ ప్రవచనం, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గోవిందరాజస్వామి పుష్కరిణిలో రాత్రి ఎం.వాణి హరికథ పారాయణం చేశారు. మహతి కళాక్షేత్రంలో చెన్నైకు చెందిన జే.జనని బృందం ప్రదర్శించిన భక్తి సంగీతం అలరించింది. రామచంద్ర పుష్కరిణి వద్ద అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల హరికథా కాలక్షేపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నేడు గరుడ సేవ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గరుడ సేవ జరగనుంది. ఉదయం పల్లకీ సేవ నిర్వహించనున్నారు. -
హంస వాహనంపై గోవిందుడి చిద్విలాసం
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: తిరుపతి శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం సాయంత్రం స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు చిన్నశేష వాహనాన్ని అధిరోహించి భక్తులకు కనువిందు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం సర్వాంగ శోభితుడై స్వామివారు చిన్నశేష వాహనంలో కొలువుదీరి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. స్వామివారి వాహనం ముందు భక్త బృందాలు ప్రదర్శించిన కోలాటాలు, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయంలోని కల్యాణ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఊంజల సేవ చేశారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు హంస వాహనంపై స్వామి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. షడగోప రామానుజ పెదజీయంగార్, గోవింద రామానుజ చిన్నజీయర్, టీటీడీ స్థానికాలయాల డెప్యూటీ ఈవో చంద్రశేఖర్‌పిళ్లై, ఏఈవో ప్రసాదమూర్తిరాజు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూ డో రోజైన శుక్రవారం ఉదయం సింహ, రాత్రి ముత్యపు పందరి వాహన సేవలు జరుగనున్నాయి.