Sri Kalahasti temple
-
కన్నప్ప ధ్వజారోహణం.. ప్రారంభమైన శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)
-
ఆది దంపతుల కల్యాణ మహోత్సవం
-
శ్రీకాళహస్తీశ్వరుడికి మోహన్ బాబు ప్రత్యేక పూజలు
-
గ్రహణం వేళ ఆ ఆలయానికి పోటెత్తిన భక్తులు
సాక్షి, చిత్తూరు: సూర్యగ్రహణం సందర్బంగా దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలను శాస్త్రోకంగా మూసివేస్తారు. కానీ చిత్తూరు జిల్లాలోనికి శ్రీకాళహస్తి ఆలయం యథావిధిగా తెరుచుకొని ఉంటుంది. గ్రహణం వేళ ఆలయంలో పూజలు యథావిధిగా కొనసాగుతాయి. గురువారం సూర్యగ్రహం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ఉదయం నుంచే యథావిధిగా పూజలు కొనసాగాయి. దీంతో ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజల్లో పాల్గొంటున్నారు. ఇది శుభ పరిణామం అని పూజారులు అంటున్నారు. సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారన్నది అందరికీ తెలిసినా...తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం మాత్రం గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. శ్రీకాళహస్తితోపాటు పిఠాపురం పాదగయ క్షేత్రంలోనే భక్తులు దర్శించుకునే వీలుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. పూర్వకాలం నుంచి ఈ పద్ధతిని పాటిస్తూ వస్తున్నామని వెల్లడించారు. -
భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న దళారులు
-
సూపరింటెండెంట్‌కు ‘ఈవో’ బాధ్యతలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో వై.రామచంద్రారెడ్డి గురువారం రాత్రి ఆలయ బాధ్యతలను సూపరింటెండెంట్ శ్రీనివాసులురెడ్డికి అప్పగించి వెళ్లిపోయారు. బుధవారం ఆలయ ఈవోను రాష్ట్ర దేవాదాయశాఖకు బదిలీ చేస్తున్నట్లు కమిషనర్ అనురాధ ఉత్తర్వులు పంపిన విషయం తెలిసిందే. కాగా మరోవైపు ఆలయ ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్, కాంట్రాక్టర్లు ఈవో రామచంద్రారెడ్డి నియామకం చెల్లదని హైకోర్టులో వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్ ప్యూహత్మకంగా వ్యవహరించారు. గురువారం ఈవోను రిలీవ్ చేయించి ఆ ఫైల్‌ను సూపరింటెండెంట్ ఫ్యాక్స్ ద్వారా క మిషనర్‌కు పంపించారు. శుక్రవారం హైకోర్టులో విచారణ సందర్భంగా కమిషనర్ శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవోను బదిలీ చేసినట్లు తగిన ఆధారాలు చూపనుంది. దీంతో కోర్టు ఆ కేసును కొట్టివేస్తుందనే ఉద్దేశంతోనే బదిలీ వేటు పడిందని ఆలయాధికారులు బాహాటంగానే చెబుతున్నారు. ఇక నూతనంగా ఈవో బాధ్యతలు చేపట్టనున్న తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా వాసి తిరుపతి ఆర్జేసీ శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని దేవాదాయశాఖ కార్యాలయంలోనే శుక్రవారం బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. -
నేను ఏ పార్టీలోనూ లేను : మోహన్‌బాబు
-
అవి మేలే చేశాయి
విమర్శలు, వదంతులు నాకు మేలే చేశాయంటున్నారు నటి కాజల్ అగర్వాల్. టాలీవుడ్లో మగధీర తరువాత క్రేజీ హీరోయిన్ల జాబితాలో చేరిన ఈ బ్యూటీ ఇటీవల కాస్త వెనకపడ్డారనే చెప్పాలి. అదే విధంగా కోలీవుడ్‌లో విజయ్ సరసన తుపాకి, జిల్లా చిత్రాల్లో నటించినా ఆ తరువాత ఆశించిన అవకాశాలు రావడంలేదు. అయితే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మకు పెళ్లి కావడంలేదనే బెంగ పెట్టుకున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు కారణం ఈ అమ్మడు ఇటీవల శ్రీకాళహస్తికి వెళ్లి దోష నివారణకు విశేష పూజలు నిర్వహించడమే. అదేవిధంగా తనకంటే ముందు చెల్లెలి పెళ్లి జరిగిపోవడం కూడా ఈ భామ కలవరానికి కారణం అని తెలుస్తోంది. అయితే అలాంటి భయాలేమీ తనకు లేవంటున్నారు కాజల్. శ్రీ కాళహస్తికి వెళ్లడాన్ని కూడా బూతద్దంలో చూస్తున్నారని నిజానికి తన చెల్లెలి పెళ్లికి హాజరైన తన కజిన్ సిస్టర్స్ తిరుమలను దర్శించాలనే ఆకాంక్షను వెల్లడించడంతో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లామన్నారు. శ్రీకాళహస్తికి వెళ్లి చిన్న పూజ నిర్వహించామని చెప్పారు. నిజానికి తాము అక్కడ ఒక గంట సమయం మాత్రమే గడిపామని తెలిపారు. ఏదేమయినా ఇలాంటి పస లేని ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తమిళంలో తుపాకి, జిల్లా వంటి చిత్రాల్లో స్టార్ హీరోలు విజయ్, మోహన్‌లాల్‌తో కలిసి నటించడం మంచి అనుభవాన్ని ఇచ్చిందన్నారు. ఈ చిత్రాల్లో తన నటనకు చాలా ప్రశంసలు అందుకున్నానన్నారు. కొన్ని సద్విమర్శల ద్వారా చాలా నేర్చుకునే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. అలాంటి విమర్శలు తనకు మేలే చేశాయన్నారు. అయినా అంతగా అవకాశాలు రావడంలేదుగా అన్న ప్రశ్నకు తానేమీ ఖాళీగా కూర్చోలేదని హిందీలో రెండు చిత్రాలు చేస్తున్నానని చెప్పారు. తెలుగులోను రామ్‌చరణ్‌కు జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నానని తెలిపారు. ఇక తమిళంలో బాలాజీ మోహన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం మేలో ప్రారంభం కానుందని తెలిపారు. ఇందులో నగర ప్రాంత యువతిగా చాలా గ్లామరస్ పాత్రను పోషించనున్నట్లు చెప్పారు. తమిళంలో నన్బేండా చిత్రంలో మీరు నటించాల్సిన పాత్రను నయనతార తన్నుకుపోరుుందిగా అంటే, ఆ చిత్రంలో నటించే విషయం ఉదయనిధి స్టాలిన్‌తో చర్చించిన విషయం నిజమేనన్నారు. అయితే తాను కమిట్ అవ్వలేదని స్పష్టం చేశారు. అదే విధంగా కమల్ హాసన్ సరసన ఒక భారీ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా కాల్షీట్స్ సమస్య కారణంగా అంగీకరించలేకపోయానని కాజల్ తెలిపారు. -
దాన్ని కూడా భూతద్దంలో చూస్తారా?
శ్రీకాళ హస్తీశ్వర దర్శనం అంటేనే ప్రత్యేకం. ముఖ్యంగా పెళ్లి ఆశలు గలవారే తమ దోషాలను తొలగించుకోవడానికి పరమేశ్వరుని వరాలు పొందడానికి శ్రీకాళహస్తిని దర్శించుకుంటారన్నది ప్రతీతి. నయనతార, సమంత నుంచి చాలా మంది హీరోయిన్లు శ్రీకాళహస్తిలో విశేష పూజలు నిర్వహించారు. ఆ ఆలయాన్ని నటి కాజల్ దర్శించుకోవడంతో ఈ బ్యూటీపై కూడా రకరకాల ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ భామకంటే ముందు చెల్లెలు పెళ్లి చేసుకోవడంతో ఈమె దోష నివారణ కోసం శ్రీకాళహస్తిలో పూజలు నిర్వహించినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాజల్‌తోపాటు ఆమె తల్లిదండ్రులు కూడా కాళహస్తీశ్వరుణ్ని దర్శించుకున్నారు. కాగా కాజల్ అగర్వాల్‌పై జరుగుతున్న ప్రచారంపై ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు. శ్రీకాళహస్తిలోని ఆలయ దర్శనానికి వెళ్లడాన్ని కూడా భూతద్దంలో చూపుతున్నారంటూ రుసరుసలాడారు. ఆమె మాట్లాడుతూ తనపై జరుగుతున్న ప్రచారం చూసి పలువురు తనను అడుగుతున్నారన్నారు. ఆలయానికెందుకెళతారు? దైవ దర్శనం చేసుకోవడం కూడా తప్పా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తన కుటుంబానికి, తన వృత్తికి మంచి జరగాలని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నట్లు వివరించారు. అంతకన్నా మరే కారణం లేదని స్పష్టం చేశారు. సినిమా విషయానికొస్తే ప్రస్తుతం తెలుగులో నటిస్తున్నట్లు తెలిపారు. తమిళంలో ఒక భారీ చిత్రంలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. బాలీవుడ్ విషయానికొస్తే అక్కడ అవకాశాల్లేకపోయినా తాను బిజీనే అన్నారు. కారణం ఫ్యాషన్ షో కార్యక్రమాలకు తనకు భలే డిమాండ్ ఉందని కాజల్ అంటున్నారు.