లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్, ఇద్దరి మృతి
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జాతీయ రహదారిపై వై జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న శ్రీ కేవీఆర్ ట్రావెల్స్ బస్సు.. వై జంక్షన్ వద్ద మలుపు తిరుగుతున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన ప్రయాణికుల్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.