ముగిసిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఓటింగ్
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజల శాంతియుత నిరసనల మధ్య అధ్యక్ష ఎన్నిల ఓటింగ్ ముగిసింది. గొటబయ రాజపక్స వారసుడిని ఎన్నుకునేందుకు నేతలు ఓటు వేశారు. ఈ ఓటింగుకు దూరంగా ఉన్నారు తమిళ్ నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ టీఎన్ఎఫ్పీ జనరల్ సెక్రెటరీ, ఎంపీ సెల్వరాసా గజేంద్రన్. పార్లమెంట్లో నిర్వహించిన ఓటింగ్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు తాత్కాలిక అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘే.
శాంతియుత నిరసనలు..
ఓవైపు అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్లమెంట్లో ఓటింగ్ జరుగుతున్న వేళ ప్రజలు శాంతియుత నిరసనలకు దిగారు. తాత్కాలిక అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా కొలంబోలోని అధ్యక్ష భవనం వద్ద నిరసనలు చేపట్టారు. అయితే.. ఎలాంటి అల్లర్లకు దారి తీయకుండా భవనం మెట్లపై కూర్చుని నినాదాలు చేశారు.
A silent protest by the public against Acting President Ranil Wickremesinghe is currently underway at the Presidential Secretariat in Colombo. pic.twitter.com/pg0qWqIyHD
— NewsWire 🇱🇰 (@NewsWireLK) July 20, 2022
ఇదీ చదవండి: Sri Lanka Presidential Elections: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల వేళ.. భారత్ సాయం కోరిన విపక్షనేత