నేటి సాయంత్రం శ్రీపైడితల్లమ్మ ఉత్సవాలు ప్రారంభం
విజయనగరం ప్రజల కొంగుబంగారమైన శ్రీపైడితల్లమ్మ వారి తెప్పోత్సవం ఈ రోజు సాయంత్రం ప్రారంభంకానుంది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు విజయనగరం జిల్లా ప్రజలతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఒడిశా రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇప్పటికే విజయనగరం చేరుకున్నారు. అయితే శ్రీపైడితల్లమ్మ తెప్పోత్సవంకు సంబంధించిన ఏర్పాట్లును ఇప్పటికే దేవాదాయశాఖ దాదాపుగా పూర్తి చేసింది. పైడితల్లిమ్మ సిరిమానోత్సవం అనంతర ఘట్టమైన శ్రీపైడితల్లమ్మ తెప్పోత్సవం అత్యంత ముఖ్యమైంది.