sri sri song
-
వ్యధార్థ జీవుల యథార్థ కవి
శ్రీశ్రీ 20వ శతాబ్ది ద్వితీయార్ధంలో నాటి కాలపు సామాజికార్థిక రాజకీయ అంశాలను, ఆకలి పేదరికపు కోరల్లో నలుగుతున్న వ్యధార్థ జీవితాలను కవిత్వీకరించాడు. దేశీయంగా జాతీయ ఉద్యమాన్ని నడుపుతున్న గాంధీ ప్రభావంతో, అంతర్జాతీయంగా మార్క్సిస్ట్ సైద్ధాంతిక ప్రభావంతో సాహిత్య సృజన చేశాడు. ఈ విధంగా శ్రీశ్రీపై జాతీయ ఉద్యమ ప్రభావం దాన్ని నడిపిస్తున్న గాంధీ ప్రభావం, ప్రపంచ పవనంగా వీస్తున్న మార్క్సిస్ట్ దృక్ప థాలతో శ్రీశ్రీ కవిత్వం ముందుకు సాగిందని నేను భావిస్తున్నాను. గాంధీ స్వాతంత్య్రోద్యమ తాత్విక పునాదిపై కవిత్వమే కాదు.. నాటికలు, వ్యాసాలు, కవితలు, వ్యాఖ్యానాలు, అనువా దాలు, ఇంటర్వ్యూలు, ఇలా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేశాడు. ‘మహాసంకల్పం’ కవిత ద్వారా గాంధీ సైద్ధాంతిక భూమికను వ్యక్తం చేస్తూ.. ‘ఇదిగో నా స్వాతంత్య్ర స్వప్నం.. జన సందోహం కరిగి ఒకే వ్యక్తిగా రూపుధరిస్తే/ ఇదేం చిత్ర మని చూశాను ఒక పెద్ద కాంస్య విగ్రహానికి ప్రాణం వచ్చినట్టుగా/ ఒక మేఘం గగనపథం దిగి మానవుడై నిలిచినట్టుగా.. ఒకే ఒక్క మానవ మూర్తి నా కళ్ళ ముందు కనిపించాడు... అతని బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి.. అంటూ గాంధీ తాత్వికతకు బావుటా పట్టాడు. మహాత్ముడి ఆదర్శాల వెలుగులో దేశ ప్రజలు పయనించాలని కాంక్షిస్తూ ఈ రచన చేశాడు. మహా త్ముడి నిర్యాణం తర్వాత శ్రీశ్రీ రాసిన ‘సంభ వామి యుగేయుగే’ వంటి రచన తెలుగులోనే కాదు, మరే ప్రాంతీయ భాషలోనూ రాలేదని ప్రముఖ పాత్రికేయులు నార్ల చిరంజీవి వ్యాఖ్యానించారు. ఓ మహాత్మా ఓ మహర్షీ/ ఏది చీకటి ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యువు/ ఏది పుణ్యం ఏది పాపం/ ఏది నరకం ఏది నాకం.. అంటూ రాసిన ‘ఓ మహాత్మా’ కవితా ఖండిక ప్రజల నాలుకలపై నిలిచి ఉంది. స్వభావరీత్యా శ్రీశ్రీ పసిపాప లాంటి వాడుగా కనిపిస్తాడు. ప్రతిదానికీ స్పందించే లక్షణం ఉంటుంది. ‘అభిప్రాయాల కోసం బాధల్ని లక్ష్యపెట్టని వాళ్లు మాలోకి వస్తారు. అభిప్రాయాలు మార్చుకొని సుఖాల్ని కామించే వాళ్లు మీలోకి వస్తారు’– అని సాహిత్య లోకాన్ని రెండుగా విభజించి ఒక స్పష్టమైన గీత గీసి ప్రజాశిబిరం, ప్రజా వ్యతిరేక శిబిరంగా విడ గొట్టాడు. స్వాతంత్య్రానంతరం ధనిక పేదల మధ్య పెరిగిన అంతరాలు ఆకలి జీవుల, అన్నార్తుల హాహాకారాలను ‘పేదలు’ కవితలో వ్యక్తపరుస్తాడు. ‘ఉద్యోగం ఇవ్వని చదువు/ నిలకడ లేని బతుకు వ్యాపకాలు/ స్వరాజ్య దుఃస్థితిని చూపుతున్నాయి’ అంటాడు. చెదిరి పోయిన కలల్ని ‘బాటసారి’ కవితలో కూటి కోసం, కూలి కోసం, పట్టణంలో బ్రతుకు దామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలు దేరిన బాటసారికి ఎదురైన సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతాడు. గాంధీ గ్రామ స్వరా జ్యంపై అపార నమ్మకం ఉన్న శ్రీశ్రీ గ్రామీణ జీవితంలో ముసురుతున్న రోదనలకు అక్షర రూపం ఇచ్చాడు. అయితే ఇటీవల దళిత సాహితీవేత్తలు శ్రీశ్రీ సాహిత్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్టు నేను భావిస్తున్నాను. సమస్త కార్మిక, కర్షక, అభా గ్యుల, అన్నార్తుల అనాధల, వ్యధార్థజీవుల, యథార్థ బతుకుల్ని తన సాహిత్యంలో చూపిన శ్రీశ్రీని మన క్యాంపులోనే పెట్టుకోవాలి. అవతలి పక్షాలకు అప్పజెప్పి మనం బల హీనులం కాకూడదు. తెలుగు సాహిత్యంలో జాషువాని, శ్రీశ్రీని రెండు కళ్ళుగా స్వీకరించాల్సిన సందర్భం. తద్వారానే సామాజిక పరివర్తనకు మార్గదర్శకులమవుతాం. ఇది నేటి చారిత్రక అవసరం. సామాజిక సంస్కరణ లేకుండా భారతదేశ అభివృద్ధిని కాంక్షించలేము. ఈ సామాజిక లక్ష్యానికి ఒక సాంస్కృతిక కార్యాచరణను ప్రకటించిన వాళ్లు శ్రీశ్రీ, జాషువా. – డొక్కా మాణిక్య వరప్రసాద్, వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ విప్, మాజీ మంత్రి (నేడు శ్రీశ్రీ జయంతి) -
ఆకాశవీధిలో అందాల జాబిలి
చిత్రం: మాంగల్యబలం రచన: శ్రీశ్రీ సంగీతం: మాస్టర్ వేణు గానం: ఘంటసాల, సుశీల మాంగల్యబలం చిత్రంలోని ఈ పాటను శ్రీశ్రీ రాశారంటే ఎవరూ నమ్మకపోవచ్చు. విప్లవకవిగా ముద్ర పడిన శ్రీశ్రీ రొమాంటిక్ సాంగ్స్ రాస్తారా అనుకుంటారు. ఆయన భావకవి కూడా. ఈ పాటలో అలతి అలతి పదాలతో ఎంతో భావుకతతో రాశారు. పాటలో అర్థం ఎలా ఉన్నప్పటికీ, ఈ పాట అమ్మను దృష్టిలో పెట్టుకుని రాసినట్లుగా అనిపిస్తుంది నాకు. అమ్మను అందరూ చందమామ అంటారు. ఇందులో ఒయ్యారి తార అమ్మ. అమ్మ నాట్యంలో ఒయ్యారం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆడవారికి ఉండవలసిన లక్షణాలు ఈ పాటలో చూపారు. ‘ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా, చందమామ అందమే వేరు. సినీరంగంలో ఎందరు తారలు ఉన్నా సావిత్రి చందమామ వంటివారు’ అని అందరూ అనేవారు. అమ్మ భౌతికంగా లేకపోయినా, ఎప్పుడు తలచుకుంటే అప్పుడు కనిపిస్తుంది. అమ్మ లిటరల్‌గా గాలిలో ఉంది. ఆకాశవీధిలో అందాల జాబిలిగా అమ్మ ఉందన్నట్లు శ్రీశ్రీ రాసినట్లుగా నేను భావిస్తాను.ప్రేమికుల మధ్య ఉండే అందమైన చిలిపితనం, సున్నితమైన శృంగారం ఈ పాటలో కనిపిస్తాయి. జలతారు మేలి మబ్బు పరదాలు నేసి తెరచాటు చేసి;పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి; అందాల చందమామ దొంగాటలాడెనే దోబూచులాడెనే... ఇంత అందమైన ఆలోచన మరో కవికి వస్తుందా అనిపిస్తుంది. మబ్బులతో పరదాలు నేయడం, ఆ తెరచాటున ఒకసారి దాగొని, మరొకసారి కనపడుతూ దొంగాటలు, దోబూచులు ఆడుతుంది చందమామ. ప్రియుడిని చూసిన ప్రేయసి సిగ్గులమొగ్గగా మారి, ఒకసారి కనపడుతూ, మరొకసారి కనపడకుండా దోబూచులాడుతుంది. జడి వాన హోరు గాలి సుyì రేగి రానీ జడిపించబోనీకలకాలము నీవే నేనని పలు బాసలాడి చెలి చెంత చేరిఅందాల చందమామ అనురాగం చాటెనే నయగారం చేసె¯óరెండవ చరణంలో... ఎన్నిసమస్యలు వచ్చినా నన్ను నీలోకి తీసుకో. జడి వాన కురిసినా, హోరు గాలి వీచినా, ప్రకృతి మనలను ఎంత భయపెట్టినా, కలకాలం నీలోనే ఉంటానని బాసలు చేసి, ఒకరిని ఒకరు చేరాలి ప్రేయసీప్రియులు అన్నారు శ్రీశ్రీ. సినీ సాహిత్యంలో ఇంతకుమించిన రొమాంటిక్ సాంగ్ లేదేమో అనిపిస్తుంది. అమ్మను చందమామలా ఎంత అందంగా చూపారో, అంతకు మించినఅందం ఈ పాటకు ఘంటసాల, సుశీలగార్లు తీసుకువచ్చారు. – సంభాషణ: డా. వైజయంతి -
ఇద్దరు మిత్రులు...
నువ్వు రాసిన కవితలు గుబాళిస్తోంటే నువ్వు తాగిన ఖాళీ సీసాల కంపు నాకెందుకు! అన్నాడు కాళోజీ. ఎమర్జెన్సీ టైమ్‌లో ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల కార్యక్రమాన్ని సమర్థిస్తూ శ్రీశ్రీ పాట రాశాడు. ఆ నేరం చాలదా సాహితీ క్రీడాంగణంలో ఫుట్‌బాల్ అయ్యేందుకు? అందరూ తలో కాలూ వేస్తున్నారు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసిన శ్రీశ్రీని నెత్తురు కక్కుకుంటూ నేల రాల్చాలని ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగత లోపాలు ఎత్తి చూపుతూ రెండు శ్రీలను ధరించినవాడు మహాకవి అవునోకాదో కాని రెండు పెగ్గులను బిగించినవాడు నిశ్చయంగా తాగుబోతే అని డయాగ్నస్ చేశారు. అటువంటి నిస్సహాయ నిస్త్రాణ పరిస్థితుల్లో ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు’ అన్నట్లుగా శ్రీశ్రీకి తోడున్నవాడు కాళోజీ. వీరిద్దరి అనుబంధం ఇప్పటిదా? కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ నేపథ్యంగా ముడిపడినది. ఆ వైనం ఆసక్తికరం. నిజాం స్టేట్‌లో ఉర్దూ అధికార భాష. తెలుగు బడులను నిరసించారు. మెడ్రాస్ స్టేట్‌లో తెలుగు బడులపై నిర్బంధం లేదు. ఈ నేపథ్యంలో ఇరుప్రాంతాలకు సాహిత్య వారధులు ఏర్పడ్డాయి. హైద్రాబాద్‌లో, ఆ తర్వాత కొన్నేళ్లకు హనుమకొండలో, ఆ తర్వాత వరంగల్లులో, ఆపైన కాళోజీ స్వగ్రామం మడికొండలో ఆంధ్రభాషా నిలయాలను స్థాపించుకున్నారు. మహామహుల రాకపోకలు జరుగుతున్నాయి. సురవరం వారి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ నదిలా రెండు ప్రాంతాల్లో సౌభ్రాతృత్వాన్ని పంచుతోంది. ఈ నేపథ్యంలో విశ్వనాథ వరంగల్ వచ్చేవారు. మడికొండకూ వచ్చేవారు. ‘ఈసారి వరంగల్ పోయినప్పుడు గార్లపాటి రాఘవరెడ్డిగారనే మంచి కవి పరిచయం, కాళోజీగారి ఆతిథ్యం మరచిపోలేని విషయాలు’ అని వానమామలై వరదాచార్యులవారి ‘మణిమాల’ కావ్యానికి రాసిన పీఠికలో విశ్వనాథ అన్నారు. అయితే అదే ముందుమాటలో ‘వానమామలై తెలంగాణకు చెందిన కవులలో ప్రసిద్ధుడు’ అని కూడా అన్నారు. ఈ మాటకు కాళోజీకి కోపం వచ్చింది. నన్నయ నుంచి విశ్వనాథ వరకూ అందరం ఒక్కటే అందరూ మనవాళ్లే అనుకుంటూ ఉంటే తెలుగు ఆణిముత్యమైన వానమామలై వరదాచార్యులను ‘తెలంగాణకు చెందిన’ అని విడదీస్తరా? ‘తెలంగాణ వాదా’నికి బీజం వేసింది తాము మాత్రమే ఆంధ్రులం అనుకుంటున్న ఇలాంటివారు కాదా? అని అప్పట్లోనే ప్రశ్నించారు. మరో సందర్భంలో విశ్వనాథను ఆహ్వానించిన వరంగల్ మిత్రులు రామాయణ కల్పవృక్షాన్ని కవిగారితో చదివిద్దాం అనుకున్నారు. ఏ ఘట్టం? అని చర్చ వచ్చింది. ఏదైనా ఒక్కలాగే ఉంటది, ఆయన్నే ఎంచుకోమందాం అన్నాడు కాళోజీ. ఈ వైనాన్ని విశ్వనాథ చెవిలో వేశారు అభిమానులు. ఏదైనా ఒక్కలాగే ఉంటుందంటాడా అని ఆయన మనసులో పడింది. విశ్వనాథ తన ‘ఆంధ్ర ప్రశస్తి’ని తొలితరం చరిత్రపరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖరశర్మకు అంకితం చేస్తూ ‘డిగ్రీలు లేని పాండిత్యంబు వన్నెకురాని ఈ పాడు కాలమున బుట్టినట్టి...’ అని గౌరవాన్ని ప్రకటించుకున్నారు. అయితే అదే విశ్వనాథ ఆ తర్వాత ‘పులుల సత్యాగ్రహం’ రచనలో ‘మాకు తెలిసిన వాడొకడున్నాడు. వాడు మెట్రికో ఇంటరో పాసయ్యాడో, ఫెయిలయ్యాడో. ఆ చదువు చదివే సరికి వానికి అర ఎకరం భూమి పోయింది. తర్వాత ఉద్యోగం లేదు. ఏం చేయాలో తోచక చరిత్ర పరిశోధన మొదలు పెట్టాడు. మహా పండితుడు-చరిత్ర పరిశోధకుడు అని పెద్దపేరు సంపాదించాడు’ అని మల్లంపల్లిని ఉద్దేశించి రాశారు. ఈ వెక్కిరింపుకు ఏమన్న అర్థమున్నదా ? అని విశ్వనాథను కాళోజీ ముఖం మీదనే అడిగాడు. విశ్వనాథ కవిత్వం తనవంటి తెలుగువారిక్కూడా అర్థం కాని సంస్కృతభూయిష్టం అని కాళోజీ అనేవాడు. కాళోజీదీ కవిత్వమా? అనుకునే కొందరు సాంప్రదాయవాదులు విశ్వనాథ అభిమానుల్లో ఉండేవారు. అయితే శ్రీశ్రీ దృష్టిలో కాళోజీకి ఉన్నతమైన స్థానం ఉంది. కాళోజీ ఎవడు? నిజాంను ఎదిరించిన వాడు. వేమనలా అందరికీ అర్థమయ్యే కవిత్వాన్ని రాసినవాడు. ఈ నేపథ్యంలో 1953లో మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ వార్షికోత్సవాలు జరిగాయి. కాళోజీ సహాధ్యాయి దేవులపల్లి రామానుజరావు, మిత్రుడు పులిజాల హనుమంతరావు దీని నిర్వాహకులు. భారత ఉపరాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వనాథ ప్రభృత ప్రముఖులూ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా తొలి తెలంగాణ రచయితల సంఘం (తెరస) సమావేశాలూ జరిగాయి. మహాకవి శ్రీశ్రీ తదితరులు ‘తెరస’ ఆహ్వానంపై వచ్చారు. అయితే కాళోజీ సమావేశాలకు రాలేదు. సాంప్రదాయ-ఆధునిక తరాల మధ్య (కాంగ్రెస్ అనుకూలురు కమ్యూనిస్ట్ అనుకూలురు) వైరుధ్యాలు నెలకొన్న వాతావరణంలో తన మిత్రులయిన నిర్వాహకులకు ఇబ్బంది కలగకూడదని కాళోజీ అభిమతం. ఈ సమావేశాల్లో కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని ఆవిష్కరింపజేయాలని దాశరధి కృష్ణమాచార్య, బిరుదురాజు రామరాజు, డి.రామలింగం వంటి మిత్రులు ప్రయత్నించారు. వట్టికోట ఆళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథమాల తరఫున ‘నా గొడవ’ను ప్రచురించారు. అయితే ఆవిష్కరణకు నిర్వాహకులు సహకరించలేదు. ఎవరి వేదికలు, ఎవరి క్యాంపులు వారివి. రాత్రి భోజనాలైన తర్వాత 11 గంటల వేళ యువరచయితలు ఒక క్యాంపులో శ్రీశ్రీతో ‘నా గొడవ’ ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కాళోజీని ఫ్రెంచ్ కవి, నవలాకారుడు లూయీ అరగాన్‌తో పోల్చాడు. ఆ మరుసటి రోజు ‘కాళోజీ మన లూయీస్ అరగాన్’ అన్న శ్రీశ్రీ వ్యాఖ్యతో వార్తలు వచ్చాయి. ఈ అరగాన్ ఎవడు? కాళోజీ సందేహం! శ్రీశ్రీకి ఉత్తరం రాశాడు కాళోజీ. ‘తక్కిన వాళ్లందరూ యుద్ధంలో పారిపోతున్నపుడు లూయీస్ అరగాన్ ప్రజల తరఫున నిలుచున్నాడు ’ అని శ్రీశ్రీ వివరణ ఇచ్చాడు. గురజాడ వారసుడైన శ్రీశ్రీని రష్యన్ కవి మయకోవిస్కీతో, ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్జాయిస్తో పోలుస్తారు. అరగాన్‌తో కూడా! శ్రీశ్రీ పోలికలో ఔచిత్యం ఉంది! కాళోజీతో మమేకత ఉంది! ఈ సందర్భంగా శ్రీశ్రీ కాళోజీని ఫ్రెంచ్ కవి, నవలాకారుడు లూయీ అరగాన్‌తో పోల్చాడు. ఈ అరగాన్ ఎవడు? కాళోజీ సందేహం! - పున్నా కృష్ణమూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రచయిత, 7680950863