Sri Venkateshwara International Airport
-
రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు వెంకన్న పేరు
- రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం - శ్రీవారి భక్తుల్లో ఆనందం తిరుపతి : రేణిగుంటలో ఉన్న తిరుపతి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పేరు మారనుంది. త్వరలో దీన్ని శ్రీ వేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవనున్నారు. గురువారం అమరావతిలో జరిగిన రాష్ట్ర కేబి నెట్ సమావేశంలో మంత్రులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒకట్రెండు మాసాల్లో ఈ మేరకు ఎయిర్‌పోర్ట్సు అధారి టీకి ఉత్తర్వులు అందే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి ఎయిర్‌పోర్టును 1976లో ఏర్పాటు చేశారు. ఆ తరువాత పీవీ నరసింహారావు ప్రధాని హోదాలో రూ.11 కోట్లు మంజూరు చేసి ఆ యా నిధులతో న్యూ టెర్మినల్ భవనాన్ని, న్యూ రన్ వే, రేడియో టవర్లను నిర్మించారు. 1999 నుంచి ప్యాసింజర్ ట్రాఫిక్ పెరిగింది. ప్రస్తుతం రోజూ 10 వి మానాలు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా యి. హైదరాబాద్, కోయంబత్తూరు, న్యూ ఢిల్లీ, విశాఖపట్నం, విజయవాడ వెళ్లే ప్రయాణికులకు తిరుపతి నుంచి విమాన ప్రయాణం సులభతరమైంది. ఎయిర్‌కోస్తా, స్పైస్‌జెట్, ట్రూ జెట్, ఎయిర్ ఇండియా సంస్థలకు చెందిన విమానాలు రోజుకు 1000 నుంచి 1500 మందిని సుదూర ప్రాంతాలకు చేర వే స్తున్నాయి. సుమారు 12 దేశాల నుంచి విదేశీ యాత్రికులు తిరుపతి చేరుకుని శ్రీవారిని దర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎయిర్ పోర్టులో దిగే దేశ విదేశాలకు చెందిన ప్రయాణికులందరూ ఎయిర్‌పోర్టులోనే స్వామి వారిని స్మరించుకునేలా ఉండాలంటే పేరు మా ర్చడం ఎంతో అవసరమన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతి ఎయిర్‌పోర్టును శ్రీవేంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా మా ర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ కేంద్రానికి పంపితే అక్కడి మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ పరి శీలించి ఆమోదాన్ని వ్యక్తం చేసి, ఎయిర్‌పోర్టు అధారిటీకి పంపుతుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి కనీసం రెండు నెలలు పడుతుం ది. ఈ లెక్కన వచ్చే మే నెల తరువాత ఎయిర్‌పోర్టును వెంకన్న పేరుతో పిలుచుకోవచ్చన్నమాట. కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో శ్రీవారి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్టుకు శ్రీవారి పేరు
సాక్షి, అమరావతి: ఆదాయం పెంచుకునేందుకు వీలుగా సజ్ పాలసీలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ అమరావతి విమానాశ్రయం అని, తిరుపతి విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అని పేరు పెట్టేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. పలు సంస్థలకుభూముల కేటాయింపులు జరిపింది. వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వెల్లడించారు. పోలవరం కుడికాలవకు 122.100 కిలోమీటరు దగ్గర పడిన గండి పూడ్చివేత పనులకు (ప్యాకేజీ 5) వ్యయం చేసిన రూ.8,81,30,000 నిధులకు జలవనరుల శాఖ ఇచ్చిన పరిపాలనాపరమైన అనుమతులకు ఆమోదం. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ, సర్వే, డిజైన్ల రూపకల్పన, ఎల్పీ షెడ్యూళ్లు(1), స్పిల్‌వే నిర్మాణం పనులు(3), 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ హౌస్‌కు పునాది, అప్రోచ్ చానల్, టెయిల్ రేస్ పూల్ తదితర పనులకు సంబంధించిన (ఆర్ఏ బిల్లు 29) మొబిలైజేషన్ అడ్వాన్స్ రికవరీ వాయిదాకు అమోదం. Ü ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ యూనివర్సిటీ డ్రాఫ్ట్ బిల్లు–2017కు ఆమోదం. రానున్న మూడు, నాలుగేళ్లలో ఐదు శాఖల భాగస్వామ్యంతో 300 కోట్లతో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉన్నత విద్యాశాఖలో తిరిగి విధులకు హాజరైన పలు వర్సిటీలకు చెందిన బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు. 2–6–2014 నుంచి 23–12–2014 మధ్య పదవీ విరమణ పొందిన 83 మంది దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్–1968లోని సెక్షన్ 2, 21, 22, 23లకు సవరణలు చేసేందుకు ప్రతిపాదన. ఈ సవరణ ద్వారా వ్యాట్ విధించకుండా అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఏఈడీ), ల్యాండెడ్ కాస్ట్‌పై కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ వేసేందుకు ఆమోదం.