
ఎయిర్‌పోర్టుకు శ్రీవారి పేరు
సాక్షి, అమరావతి: ఆదాయం పెంచుకునేందుకు వీలుగా సజ్ పాలసీలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ అమరావతి విమానాశ్రయం అని, తిరుపతి విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అని పేరు పెట్టేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. పలు సంస్థలకుభూముల కేటాయింపులు జరిపింది. వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వెల్లడించారు.
పోలవరం కుడికాలవకు 122.100 కిలోమీటరు దగ్గర పడిన గండి పూడ్చివేత పనులకు (ప్యాకేజీ 5) వ్యయం చేసిన రూ.8,81,30,000 నిధులకు జలవనరుల శాఖ ఇచ్చిన పరిపాలనాపరమైన అనుమతులకు ఆమోదం. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ, సర్వే, డిజైన్ల రూపకల్పన, ఎల్‌పీ షెడ్యూళ్లు(1), స్పిల్‌వే నిర్మాణం పనులు(3), 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ హౌస్‌కు పునాది, అప్రోచ్ చానల్, టెయిల్ రేస్ పూల్ తదితర పనులకు సంబంధించిన (ఆర్‌ఏ బిల్లు 29) మొబిలైజేషన్ అడ్వాన్స్ రికవరీ వాయిదాకు అమోదం. Ü ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ యూనివర్సిటీ డ్రాఫ్ట్ బిల్లు–2017కు ఆమోదం.
రానున్న మూడు, నాలుగేళ్లలో ఐదు శాఖల భాగస్వామ్యంతో 300 కోట్లతో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉన్నత విద్యాశాఖలో తిరిగి విధులకు హాజరైన పలు వర్సిటీలకు చెందిన బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు. 2–6–2014 నుంచి 23–12–2014 మధ్య పదవీ విరమణ పొందిన 83 మంది దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్–1968లోని సెక్షన్ 2, 21, 22, 23లకు సవరణలు చేసేందుకు ప్రతిపాదన. ఈ సవరణ ద్వారా వ్యాట్ విధించకుండా అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఏఈడీ), ల్యాండెడ్ కాస్ట్‌పై కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ వేసేందుకు ఆమోదం.