srichaitanya
-
ఆన్‌లైన్‌లోనూ అత్యుత్తమ బోధన
Sushma Boppana About Infinity Learn: కోవిడ్ తర్వాత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ అభ్యసనానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీచైతన్య విద్యాసంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఇన్ఫినిటీ లెర్న్’ అనే ఎడ్యుటెక్ సంస్థను ప్రారంభించింది. నీట్, జేఈఈ విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు అందిస్తోంది. మూడు దశాబ్దాలకు పైగా బోధనానునుభవంతో ఆన్‌లైన్‌లోనూ అత్యుత్తమ శిక్షణ అందించి విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని ‘ఇన్ఫినిటీ లెర్న్’ సహ వ్యవస్థాపకురాలు సుష్మ బొప్పన పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇన్ఫినిటీ లెర్న్’ గురించి ఆమె మాటల్లోనే... నాణ్యమైన కంటెంట్ ఇతర సంస్థలకు భిన్నంగా నాణ్యమైన కంటెంట్ అందించే ప్రధాన లక్ష్యంగా ‘ఇన్ఫినిటీ లెర్న్’ను తీర్చిదిద్దాం. ఆఫ్‌లైన్‌లో బోధిస్తున్న విధానానికి దీటుగా డిజిటల్‌లోనూ అత్యుత్తమ శిక్షణ అందించే ఏర్పాటు చేశాం. విద్యార్థులకు కేవలం ఆన్లైన్లో పాఠాలు చెప్పడం, హోమ్‌వర్క్‌లు కేటాయించడమే కాకుండా ఆ విద్యార్థికి సబ్జెక్టుపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాం. గత 36 ఏళ్లుగా శ్రీచైతన్య విద్యాసంస్థల ద్వారా సాధించిన అనుభవం ఈ వ్యూహాలు అమలు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. నీట్, జేఈఈపై దృష్టి మొదటగా నీట్, జేఈఈపై దృష్టి సారించాం. నీట్ లాంగ్‌టర్మ్ శిక్షణకు దేశవ్యాప్తంగా విద్యార్థులు చేరుతున్నారు. టెస్ట్ సిరీస్‌కూ ఆదరణ లభిస్తోంది. 2023 నాటికి జాతీయ స్థాయి పోటీ పరీక్షలతోపాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్, ఇంగ్లీషు లాంగ్వేజ్ పాఠాలు, కంప్యూటర్ కోర్సులు అందించే ఆలోచన ఉంది. 2024 నాటికి శ్రీచైతన్య విద్యార్థులు కాకుండా మరో 10 లక్షల మంది విద్యార్థులు నేరుగా ‘ఇన్ఫినిటీ లెర్న్’ ప్రయోజనాలు పొందేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ‘అమెజాన్ అకాడమీ’తోనూ ఒప్పందం కుదుర్చుకుని నీట్, జేఈఈ పరీక్షల పూర్తి కోర్సులను అందిస్తున్నాం. నీట్–2021లో రికార్డుస్థాయి ఫలితాలు సాధించాం. వచ్చే ఏడాది మరిన్ని ర్యాంకులు సాధించే అవకాశం ఉంది. ప్రణాళిక, పర్యవేక్షణ ఇన్ఫినిటీ లెర్న్‌లో విద్యార్థి స్థాయికనుగుణంగా బోధన ఉంటుంది. అప్పుడే విద్యార్థుల్లో విశ్వాసం పెరుగుతుందనేది మా నమ్మకం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కాన్సెప్ట్ ఓరియెంటెడ్, ప్రాబ్లమ్ ఓరియెంటెడ్, న్యూమరికల్ అంశాలుగా విద్యార్థుల అవసరాల మేరకు కంటెంట్ అందిస్తున్నాం. ఆన్‌ౖలñ న్లో విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నారో తెలుసుకునే విధంగా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. తరగతిలో నేర్చుకున్న అంశాలను హోమ్ వర్క్ ద్వారా సాధన చేయడం, అందులో విద్యార్థులకు ఎదురైన అనుభవాలు, సందేహాలు నివేదికల రూపంలో అధ్యాపకుడికి చే రతాయి. వాటిని తర్వాత తరగతిలో ఉపాధ్యాయుడు విశ్లేషించి సందేహాలుంటే నివృత్తి చేస్తారు. దీంతో ఎప్పటికప్పుడు అంశాలపై పట్టు పెంచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడే వారు పరీక్షల్లోనూ రాణించగలుగుతారు. టెక్నాలజీ వినియోగం తరగతి గదిలో స్మార్ట్ బోర్డులను ఏర్పాటు చేసి ‘హైబ్రిడ్ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ప్రోగ్రామ్’ను రూపొందించాం. నీట్ లాంగ్‌టర్మ్ విద్యార్థులందరికీ దీన్ని అమలు చేస్తున్నాం. తద్వారా ఆన్లైన్ ప్లాట్‌ఫాంను మరింత మెరుగుపరుస్తున్నాం. ఉపాధ్యాయ ఆధారిత బోధన కంటే విషయ ఆధారిత బోధనకు ప్రాధాన్యతనిస్తున్నాం. విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వినేటపుడు టెక్నాలజీ సమస్యలు తలెత్తకుండా అప్లికేషన్ తయారుచేశాం. పాఠాలు, స్టడీమెటీరియల్, యానిమేషన్ అంశాలను జోడించి బోధన సాగిస్తున్నాం. స్కాలర్షిప్ టెస్ట్ శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులతోపాటు ఇతర విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల అవసరాలు తీర్చేలా దీన్ని రూపొందించాం. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో నిపుణులైన అధ్యాపకులు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోలేనిచోట విద్యార్థులకు ప్రయోజనం కలగాలని భావించాం. నామమాత్రపు ధర నిర్ణయించి కోర్సులను అందిస్తున్నాం. రూ.99 నుంచి కోర్సు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ‘స్కోర్’ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా దీర్ఘకాలిక శిక్షణ అందిస్తున్నాం. -
ఎయిమ్స్‌లో నారాయణ శ్రీచైతన్య హవా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) 2017 ఎంబీబీఎస్ ఫలితాల్లో నారాయణ శ్రీచైతన్య సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాల నుంచే టాప్–100లో 23 ర్యాంకుల కైవసం చేసుకుంది. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 13, 18, 19, 22, 25, 35, 38, 50, 60, 63, 70, 74, 90, 97 ర్యాంకులు.. ఇతర కేటగిరీల్లో ఆలిండియా 2, 5, 11, 16, 21, 41, 43, 46, 70 ర్యాంకులను నారాయణ శ్రీచైతన్య విద్యా ర్థులు సాధించారు. ఈ సంద ర్భంగా ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదం డ్రులను నారాయణ శ్రీచైతన్య విద్యాసం స్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శ్రీ మతి సుష్మ అభినందించారు. -
శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య
– ప్రేమ వ్యవహారమే కారణం? కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు శివారులోని బి.తాండ్రపాడు శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ విద్యార్థి మహ్మద్ అక్రమ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటకు అక్రమ్ హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకున్నాడు. తోటి విద్యార్థులు గమనించి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించాడు. శిరివెళ్ల మండలం ముళ్లపేటకు చెందిన మహ్మద్ రఫీ, మోబీను దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో అక్రమ్ మొదటి వాడు. రెండో కుమారుడు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. అక్రమ్ బి.తాండ్రపాడు సమీపంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాగా, రెండేళ్ల క్రితం రఫీ గుండెపోటుతో చనిపోగా తల్లి సంరక్షణలో ఇద్దరు కుమారులు చదువుకుంటున్నారు. ఇటీవల అక్రమ్ ప్రేమలో పడినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లి ఆరోగ్యం బాగలేదని చెప్పిన అక్రమ్ ఐస్ క్రీమ్ తిని హాస్టల్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు చివరి క్షణంలో తన సెల్ నుంచి లవర్‌కు పలు మెసేజ్‌లు పంపినట్లు తెలిసింది. వీటిని అమ్మాయి తల్లిదండ్రులు గమనించి వార్నింగ్ ఇవ్వడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అక్రమ్‌కు సెల్ ఎక్కడ నుంచి వచ్చింది? మరోవైపు కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులు సెల్ఫోన్లను వినియోగించడం నిషేధం. విద్యార్థులు తమ బంధువులతో మాట్లాడాలంటే రూపాయి కాయిన్ ఫోన్లను యాజమాన్యాలు అందుబాటులో ఉంచుతాయి. అయితే దాదాపు రూ.15 వేల విలువ చేసే సోనీ కంపెనీకి చెందిన ఆండ్రాయిడ్ ఫోన్ అక్రమ్ దగ్గర ఉంది. ఈ విషయాన్ని యాజమాన్యం గమనించలేకపోవడం గమనార్హం. మరోవైపు విషయం తెలిసిన వెంటనే తాలుకా పోలీసుస్టేషన్ సీఐ మహేశ్వరరెడ్డి, రూరల్ పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుయాదవ్ పోస్టుమార్టం రూమ్‌లో అక్రమ్ శవాన్ని పరిశీలించి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐలు వివరించారు. నెల రోజుల్లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య కర్నూలు జిల్లాలో నెల రోజుల్లో శ్రీచైతన్య, నారాయణ జూనియర్ కళాశాలల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నారాయణ జూనియర్ కళాశాలల్లో జూలై 27న అధ్యాపకుడు మందలించాడని సందీప్ అనే విద్యార్థి ఉరేసుకొని తనువు చాలించగా, ఆగస్టు 25న ప్రణయ్‌రెడ్డి అనే విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఆగస్టు 29న శ్రీచైతన్య జూనియర్ కళాశాలకు చెందిన మహ్మద్ అక్రమ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.