sridar
-
శ్రీధర్‌బాబు కుట్రలు సాగవు
సాక్షి, హైదరాబాద్: ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేత శ్రీధర్‌బాబు ఎన్నికల సమయంలో తనపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని మంథని టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. రూ. తొమ్మిది వందల కోట్లు సంపాదించానని ఆరోపణలు చేస్తున్నారని, ఎవరైనా రూ.రెండు కోట్లు ఇస్తే తన ఆస్తులు రాసిస్తానని అన్నారు. తనపై కేసులు ఉంటే శ్రీధర్‌బాబు మంత్రిగా ఉన్నప్పుడు వదిలి పెట్టేవారా.. అని ప్రశ్నించారు. మంగళవారమిక్కడి తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆధారాలు లేకుండా హైదరాబాద్‌లో నాపై ఫిర్యాదులు చేస్తే మీడియా ఇంత హైలైట్ చేస్తుందని అనుకోలేదు. ఇది బాధాకరం. గుండా నాగరాజు హత్య కేసులో బిల్లా రమణారెడ్డి ముద్దాయి. ముద్దాయికి సాక్ష్యం చెప్పే అర్హత ఉంటుందా? నేను ఆ కేసులోనే లేను. ఆ కేసు కొలిక్కి వచ్చినందుకే నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. మీడియా నాపై ఇంత కక్ష ఎందుకు కట్టిందో అర్థం కావడం లేదు. మంథని కేంద్రంగా కొన్ని ముఠాలు ఏర్పడ్డాయి. నన్ను బద్నామ్ చేయడమే వాటి పని. నా మీద ఓడిపోయిన కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు నన్ను బద్నామ్ చేసేందుకు ఆ ముఠాలకు బాధ్యత అప్పజెప్పారు. శ్రీధర్‌బాబు మళ్లీ ఓడిపోతాననే భయంతో ఇలాంటి వాటిని ప్రేరేపిస్తున్నారు. నా ఆస్తులపైనా రాద్ధాంతం చేస్తున్నారు. హైదరాబాద్‌లో సినీనటుడు శ్రీహరి ఇంటి పక్కన కోట్ల రూపాయల విలువైన ప్లాట్ ఉందని ఏమీ తెలుసుకోకుండానే మీడియా ప్రచురించింది, ప్రసారం చేసింది. పూరిగుడిసెలో పుట్టి ఎమ్మెల్యే అయిన నాలాంటి వాడికి కోట్ల రూపాయల ప్లాట్ సంపాదించడం సాధ్యమవుతుందా... ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడు వందల కోట్లు సంపాదించానని అంటున్నారు. అదే నిజమైతే ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుందా.. పేదలు ఎమ్మెల్యేలు కాకూడదా? దొంగలు ఫిర్యాదు చేస్తే ఏమీ తెలుసుకోకుండా మీడియా ప్రాధాన్యతనివ్వడం సమంజసమా? శ్రీధర్‌బాబు రచిస్తున్న నాటకాల్లో భాగంగానే నాపై కుట్ర జరుగుతోంది. నాపై వస్తున్న అసత్య ఆరోపణలకు సంబంధించి ఇకనైనా మీడియా వివరణ తీసుకుని ప్రచురించాలి. ఇలాంటి అసత్య వార్తలను నిలిపివేయాలని కోరుతున్నాను’ అని అన్నారు. -
శ్రీధర్ రాజీనామా
ముంబై: హైదరాబాద్ మాజీ క్రికెటర్, బీసీసీఐ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) మాటూరి వెంకట (ఎంవీ) శ్రీధర్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బుధవారం జరిగిన సమావేశంలో బోర్డు పరిపాలనా కమిటీ (సీఓఏ) ఆమోదించింది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ (పరస్పర విరుద్ధ ప్రయోజనాలు)కు సంబంధించి శ్రీధర్ సంతృప్తికర వివరణ ఇవ్వకపోవడమే ఆయన తప్పుకోవడానికి కారణంగా కనిపిస్తోంది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2013లో శ్రీనివాసన్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఎంవీ శ్రీధర్ బీసీసీఐ జనరల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. ఆఫీస్ బేరర్ల తరహాలో కాకుండా ‘పే రోల్స్’లో ఉంటూ బోర్డు ఉద్యోగి హోదాలో ఆయన వేతనం పొందుతున్నారు. కొన్నాళ్ల క్రితం బీసీసీఐ ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’కు సంబంధించి తమ ఉద్యోగులందరూ పూర్తి వివరాలు అందించాలని కోరింది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు చెందిన ఐదు క్లబ్‌లకు తాను యజమానిననే విషయాన్ని అందులో శ్రీధర్ వెల్లడించలేదు. బీసీసీఐలో బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో కూడా ఆయన హెచ్‌సీఏ నుంచి ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందారని కూడా తెలిసింది. పైగా హెచ్‌సీఏలో జరిగిన నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన ఛార్జ్‌షీట్‌లో తన పేరు ఉన్న విషయాన్ని శ్రీధర్ బయటకు చెప్పలేదు. వీటన్నింటికి తోడు ఇటీవల తగిన అర్హతలు లేని సోహమ్ దేశాయ్‌ను ఎన్సీఏ ట్రైనర్‌గా ఎంపిక చేయడం కూడా శ్రీధర్ బయటకు వెళ్లడానికి కారణమైంది. -
అవినీతి జట్టుకు శ్రీధర్ బిగ్‌బాస్
– మేయర్‌కు కౌన్సిల్ నిర్వహించే అర్హతలేదు – బిల్లులు పాస్ చేయించుకొనేందుకే కౌన్సిల్ – వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల ధ్వజం విజయవాడ సెంట్రల్ : అధికార దుర్వినియోగానికి పాల్పడిన మేయర్ కోనేరు శ్రీధర్‌కు కౌన్సిల్ నిర్వహించే అర్హత లేదని వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల అన్నారు. పార్టీ కార్పొరేటర్లతో కలిసి ఆమె శనివారం తన చాంబరులో విలేకరులతో మాట్లాడారు. కౌన్సిల్లో అవినీతి జట్టుకు మేయర్ బిగ్‌బాస్ అని ఆరోపించారు. మేయర్ పదవిని అడ్డుపెట్టుకొని కేఎంకే సంస్థకు కాంట్రాక్ట్‌లను దోచిపెడితే, ఎనిమిది మంది కార్పొరేటర్లు బినామీ పేర్లతో కాంట్రాక్ట్‌లను చేశారన్నారు. ఆ బిల్లులను పాస్ చేయించుకోవడం కోసమే హడావుడిగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ప్రజా సమస్యలను ఏనాడు పట్టించుకోని టీడీపీ పాలకులు.. తమ సొంత ప్రయోజనాల కోసం మరోసారి కౌన్సిల్‌ను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేయర్ అధికార దుర్వినియోగంపై కమిషనర్ జి.వీరపాండియన్‌కు రెండుసార్లు ఫిర్యాదు చేశామన్నారు. ఆయన విచారణ నిర్వహించకుండానే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కార్పొరేటర్ షేక్ బీ జాన్‌బీ మాట్లాడుతూ మేయర్‌కు నైతిక విలువలు ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు కరీమున్నీసా, బి.సంధ్యారాణి, టి.జమలపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.