srikakulam collectorate
-
శ్రీకాకుళం కలెక్టరేట్ లో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష
-
నిబద్ధత.. నిజాయితే ముఖ్యం !
సాక్షి, శ్రీకాకుళం : విధి నిర్వహణలో కాస్త సీరియస్‌గా కన్పిస్తారు. దానివెనుక నిబద్ధత, నిజాయితీ ఉంది. మనిషి కాసింత కటువుగా అన్పించినా జిల్లా ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఆయనలో ప్రస్ఫుటిస్తుంది. జిల్లాలో ఉన్నతంగా పనిచేసిన కలెక్టర్లలో తానొకరిగా ఉండాలని పరితపిస్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతాంశాలను ప్రామాణికంగా తీసుకుని... విద్య, వైద్యం, నిరుద్యోగం, సాగునీరు అంశాలకు పెద్దపీట వేస్తూ... సమస్యలే సవాళ్లుగా, ప్రభుత్వ లక్ష్యసాధనే గమ్యంగా అడుగులేస్తూ... రాష్ట్రంలో పలు పైలెట్ ప్రాజెక్టులకు సారథ్యం వహించబోతున్నారు మన కలెక్టర్ జె.నివాస్. బిజీబిజీగా ఉన్న ఆయన ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. ఇప్పుడేం చేస్తున్నానో... రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నానో ఆవిష్కరించారు. వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్నారు. సాక్షితో చెప్పిన ముచ్చట్లు ఆయన మాటల్లోనే.... గతంలో ఇన్ని నియామకాలు ఎప్పుడూ జరగలేదు. ఏపీపీఎస్సీ ద్వారా ఇంత స్థాయిలో ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి. జిల్లాలో లక్షా 50 వేల మంది వరకు గ్రామ సచివాలయాల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీని కోసం అన్ని ఏ ర్పాట్లు చేస్తున్నా. ఇప్పటికే 427 పరీక్ష కేంద్రాల ను గుర్తించాం. తొమ్మిది కేటగిరీల పోస్టులకు మూడు రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని ప్ర భుత్వం భావిస్తున్నా.. ఈ కేటగిరీలన్నింటికీ అ భ్యర్థులంతా పరీక్షలు రాయాలంటే 7 రోజులు అవసరమవుతాయని ప్రభుత్వాన్ని కోరాం. సన్నబియ్యం పంపిణీకి సన్నద్ధం వలంటీర్ల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటి నుంచి పైలెట్ ప్రాజెక్టుగా మన జిల్లా నుంచే ప్రారంభమవుతుంది. పం పిణీకి సంబంధించి వాలంటీర్ల వారీగా మ్యాపిం గ్ చేశాం. ఆ మ్యాపింగ్ ఎంతవరకు బాగా జరిగిందో కొత్తగా నియమితులైన వలంటీర్ల ద్వారా క్రాస్ చెక్ చేయించనున్నాం. వలంటీర్ల వ్యవస్ధ అమల్లోకి వచ్చి ఇంటింటికీ సన్న బి య్యం తీసుకెళ్లి అందించాలంటే వలంటీర్‌కు స్మార్ట్ ఫోన్ ఉండాలి. దానిలో యాప్ ఉండాలి, ఫోన్ సిగ్నల్ ఉండాలి. ఇవన్నీ పక్కాగా ఉండేలా చూస్తున్నాం. ఎఫ్పీ షాపుల వేలి ముద్రల ద్వా రా పంపిణీ చేయడం చాలా కష్టమైంది. ఆ వ్యవస్థకు సంబంధించిన సమస్యలన్నీ సరిచేశాం. సన్నబియ్యం పంపిణీ విషయంలో కూడా అదే రకంగా ముందుకెళ్తాం. అదే సమయంలో గ్రా మ సచివాలయాల పోస్టుల నియామక పరీక్షలు జరగనున్నాయి. మాకిది చాలెంజ్. ఎంపీడీఓ లకు పరీక్ష నిర్వహణ బాధ్యతలు, తహశీల్దార్లకు సన్నబియ్యం పంపిణీ బాధ్యతను అప్పగిస్తున్నాం. ప్రారంభంలో కొన్ని సమస్యలుంటాయి. రెండు మూడు నెలల్లో అన్నీ సవ్యమవుతాయి. స్కూల్స్, హాస్టల్స్ రూపురేఖలు మార్చుతాం పాఠశాలలు, వసతి గృహాల్లో మార్పు రావాలి. దానికోసం సీఎం జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృ ష్టి సారించారు. కేవలం హాస్టల్స్ బాత్రూమ్లు, టాయిలెట్లు, ఇతర మరమ్మతు కోసం జిల్లా కు రూ.14 కోట్లు ఇచ్చారు. విజయవాడ కార్పొరేషన్లో నేను పనిచేసినప్పుడు విమానాశ్రయాల్లో ఉండేలా స్కూల్స్‌లో టాయిలెట్స్ తయారు చేశాం. ఇక్కడ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. తొలి విడతగా 100 ఎస్సీ, బీసీ హాస్టల్స్‌తోపాటు గురుకులాల్లో ఆధునిక వసతులు క ల్పిస్తున్నాం. రెండు మూడు నెలల్లో హాస్టల్స్ స్వరూపం మార్చుతాం. లక్ష మందికి ఉపాధి జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎక్కువ. దీన్ని దృష్టిలో ఉంచుకుని లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా తీసుకున్నాం. 2019–2020 సంవత్సరానికి 50 వేల ఉద్యోగాలు, 2020–2021కి 50 వేల ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ రూపొం దిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన యాప్‌ను తయారుచేశాం. దాని లో నిరుద్యోగ యువత తమ విద్యార్హతలు, ఇ తర ధ్రువ పత్రాలు నమోదు చేసుకోవాలి. ప్రతి నెలా జాబ్‌మేళా నిర్వహిస్తాం. కొత్తగా పరిశ్రమలు తీసుకురావాలని సీఎం దృష్టిలో పెట్టాం. ముఖ్యంగా గార్మెంట్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నా ం. ఇప్పటికే రెండు మూడు కంపెనీలతో సంప్రదింపులు చేశాం. పంటల బీమాపై ప్రత్యేక శ్రద్ధ జిల్లాలో 5 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో 2.5 లక్షల మంది మాత్రమే బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవడం వలన పంటల బీమాకు అర్హులయ్యారు. మిగిలిన వారు బీ మాకు దూరంగా ఉండిపోతున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఈనెల 13వ తేదీ క్యాంపెయిన్ చేపడుతున్నాం. ఆధార్, బ్యాంకు ఖాతా, పట్టాదా రు పుస్తకం చూపిస్తే చాలు వారి పేరున బీమా ప్రీమియం మేమే చెల్లిస్తాం. రైతులు కట్టాల్సిన ప్రీమియం డబ్బులు కలెక్టర్ నిధుల నుంచి బీమా కంపెనీలకు చెల్లించనున్నాం. లక్ష మంది రైతులను బీమా పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. బీమా చెల్లింపుల్లో కూడా జాప్యం ఉంది. 2017కు సంబంధించిన బీమా పరిహారం ఈ ఏడాది వచ్చిందని, దీనివల్ల రైతుల్లో అసంతృప్తి ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే... జిల్లాలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడంతో వర్షం వచ్చినా నీరు నిల్వ చేసుకోలేని దుస్థితిని ఎదుర్కొన్నాం. హిరమండలం రిజర్వాయర్ సామర్థ్యం 19 టీఎంసీలు ఉండాల్సి ఉంది. కాని పనులు వేగంగా జరగకపోవడంతో వరద నీరు స్టోరేజ్ సామర్థ్యం కోల్పోతున్నాం. ఆఫ్‌షోర్ రిజ ర్వాయర్తో పలాస ప్రాంతానికి మే లు జరగనుంది. కానీ దాని పనులు ఆశించిన మేర జరగలేదు. 25 శాతం లోపు పనులు ఉండటం వలన కాం ట్రాక్ట్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. ప్రజారోగ్యం కోసం రిమ్స్‌లో వైద్య సేవలు అందించేందు కు అహర్నిశలు కష్టపడుతున్నాం. తరచూ ఆసుపత్రికి వెళ్లి పరిశీలిస్తున్నాను. లోటుపాట్లు సరిదిద్దేందుకు కృషి చేస్తున్నాను. స్టాఫ్ నర్సులు విశాఖ నుంచి వస్తున్నారు. అటువంటిది లేకుండా 21మందిని వెనక్కి తీసుకున్నాం. జీఎంఆర్ వైద్యులను తీసుకొచ్చాం. మాతృశిశు మరణాలు జిల్లాలో సమస్యగా మారింది. ఇటీవల జరిగిన 31 కేసుల్లో 13 కేసులు రక్తస్రావం వల్ల తలెత్తినవే. ఇటువంటి పరిస్థితులు అధిగమించేందుకు నాంది ప్రోగ్రామ్ అమలవుతున్నది. రక్తహీనత సమస్యను పరిష్కరించేందుకు నువ్వుల లడ్డూ వంటివి అందిస్తున్నాం. బాలసంజీవని ప్రొగ్రాం ద్వారా 9, 10 తరగతి విద్యార్ధులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రతి ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. పర్సనల్ టచ్ మా సొంత గ్రామం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం. మా నాన్న కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అమ్మ ప్రధానో పాధ్యాయిని. భార్య, కుమా ర్తె ఉన్నారు. నేను 10వ తరగతి వరకు కాంచీపురంలో చదివాను. తిరుచనాపల్లిలో ఇంటర్, వెల్లూరులోని వీఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. అనంతరం క్యాంపస్ ఇంటర్వ్యూలో కన్స్ట్రక్షన్ కంపె నీలో మెకానికల్ ప్రాజెక్టు ఇంజనీర్‌గా ఎంపికై మూడేళ్లపాటు చెన్నైలో చేశాను. ఆ ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. తొలుత డీఎస్పీగా ఎంపికయ్యాను. ఆ తర్వాత మూడో అటెంప్ట్‌లో సివిల్స్‌కు ఎంపికయ్యాను. 2010 లో ఐఏఎస్‌గా ఎంపికై తూర్పుగోదావరిలో ట్రై నీగా పనిచేశాను. ఆ తర్వాత గూడూరు సబ్‌కలెక్టర్‌గా, అదిలాబాద్ ఐటీడీఏ పీఓగా పనిచేశాను. 2016లో విశాఖ జేసీగా నియమితులయ్యాను. ఆ తర్వాత విజయవాడ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసి ఎన్నికలకు ముందు జిల్లాకొచ్చాను. ఇరయంబూ స్ఫూర్తితో.. మా జిల్లా కలెక్టర్‌గా ఇరయంబూ (1999) ఉన్న హయాంలో వరదలు వచ్చాయి. ఆ సమయంలో రైతులు గట్టు కొట్టేశారు. దీంతో ఊ రంతా మునిగిపోయింది. మా ప్రాంతం కూ డా ముంపునకు గురైంది. ఆ సమయంలో కలెక్టర్ ఇరయంబూ అందించిన సేవలు అమో ఘం. కలెక్టర్‌గా ఉంటే ఏదైనా చేయగలమిని భావించి సివిల సర్వెంట అవ్వాలని నిర్ణయించుకున్నా. ఐఏఎస్ అనేది నా కోరిక. ఈ విషయంలో మా తల్లిదండ్రులు ఒత్తిడి లేదు. దిల్లీలో ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాను. అమ్మ ప్రో త్సాహంతో ముందుకుసాగాను. మా తల్లిదండ్రులిద్దరూ ఒకేలా ప్రోత్సాహించేవారు. గ్రం థాలయం నుంచి పుస్తకాలు తీసుకొచ్చి చదివించేవారు. -
ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ..
సాక్షి, శ్రీకాకుళం : ఒకవైపు మొరపెట్టుకుంటున్న కష్టాలు... మరోవైపు సమస్యలపై విన్నపాలు.. ఇంకోవైపు ఫిర్యాదులు, పథకాల మంజూరు కోసం అర్జీలు... కబ్జాలు, అక్రమాల తతంగాలు... ఇలా అనేకం అధికారుల దృష్టికి వచ్చాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమం పరిష్కార వేదికగా నమ్మకం కల్గించడంతో పెద్ద సంఖ్యలో అర్జీదారులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. చెప్పాలంటే కలెక్టరేట్ ప్రాంగణంలో బారులు తీరారు. వేల సంఖ్యలో వినతులు వెల్లువెత్తాయి. వీరందరి నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఒక్కరోజే కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో 1125 అర్జీలు వచ్చాయి. అందులో 50 వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతావి సంబంధిత శాఖల పరిశీలనలో ఉన్నా యి. అత్యధికంగా భూ పరిపాలన శాఖకు సంబంధించి 265, సెర్ఫ్‌కు సంబంధించి 185, పౌరసరఫరాలకు సంబంధించి 157, గిరిజన సంక్షేమానికి సంబంధించి 125, హౌసింగ్‌కు సంబంధించి 112, మున్సిపల్ పరిపాలన శాఖకు సంబంధించి 81 అర్జీలు వచ్చాయి. చిన్నబోయిన వరుణుడు సమస్యల ముందు వర్షపు జల్లులు చిన్నబోయాయి. తెల్లవారు జామున నుంచి చినుకులు పడుతున్నా జనం లెక్కచేయలేదు. స్పందన వేదిక వద్దకు వెళితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావంతో వర్షాన్ని సైతం పట్టించుకోకుండా కలెక్టరేట్‌కు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. పడుతున్న చినుకుల మ«ధ్యనే బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉండి తమ వినతులు అధికారులకు అందజేశారు. పరిష్కారమైతే తమ కష్టం ఏమాత్రమని ఓపిగ్గా ఉంటూ అధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు. గతం ఎలా ఉన్నా ప్రస్తుతం చకచకా సమస్యలు పరిష్కారమవుతున్నాయన్న నమ్మకంతో కలెక్టరేట్ స్పందన కార్యక్రమానికి పోటెత్తుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిటలాడుతోంది. సోమవారం వర్షం పడుతున్నా అర్జీదారుల తాకిడి తగ్గలేదు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ జె.నివాస్ వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు కొత్త రేషన్‌కార్డుల మంజూరు కోసం, స్వయం ఉపాధి పనుల కోసం, భూమి వివాదాల పరిష్కారం కోసం, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు, ట్రైసైకిళ్ల కోసం, గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాలు, వసతి గృహాల సీట్ల తదితర వ్యక్తిగత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతులు సమర్పించారు. వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ, వికలాంగ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, సీపీఓ, నీటి పారుదల శాఖ, రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్ తదితర శాఖలకు సంబంధించి ఎక్కువగా వినతులు వచ్చాయి. ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ వాటి పరిష్కా రం కోసం సంబంధిత అధికారులకు పంపించారు. హుద్‌హుద్ తుపా ను బాధితులకు మంజూరు చేసిన 32 ఇళ్లను తమకు అప్పగించాలని కోరుతూ ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేసం గ్రామానికి చెందిన మ త్స్యకారులు ఫిర్యాదు చేశారు. తాను కొనుగోలు చేసిన 30 సెంట్లు భూమిని ఆక్రమించుకుంటున్నారని, వారి నుంచి తమకు న్యాయం చేయాలని ఉర్లాంకు చెందిన ఒకాయన ఫిర్యాదు చేశాడు. నీలంపేట, మామిడివలస, లంకాం, ఖండ్యాం, లాభాం వద్ద ఓపెన్ హెడ్ ఛా నల్స్, నారాయణపురం ఎడమ కాలువకు పూడికతీత, మరమ్మత్తులు చేపట్టాలని భూర్జ, ఆమదాలవలస రైతులు కోరారు. సరుబుజ్జిలి, హిరమండలాలకు వంశధార నదిలో ఇసుక ర్యాంపులు ప్రభుత్వం కల్పించిందని, ఆ ర్యాంపుల నుండి ఎల్‌ఎన్‌పేట మండలానికి ఇసుకు తీసుకురావడానికి అనుమతులు ఇవ్వాలని ఆ మండలాలకు చెందిన పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్–2 రజనీకాంతరావు, డీఆర్ఓ నరేంద్రప్రసాద్, డీఆర్డీఎ పీడీ కళ్యాణ్‌చక్రవర్తి, డ్వామా పీడీ కూర్మారావు, జిల్లా పరిషత్ సీఈఓ టి.కైలాస గిరీశ్వర్ తదితర శాఖల అ«ధికారులు పాల్గొన్నారు. పరిష్కారంలో ఐదో స్థానం జూలై 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 6202 అర్జీలొచ్చాయి. వీటిలో 1521 పరిష్కరించారు. 2461 వినతులు పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 1553 వినతులు పరిశీలనలో ఉన్నాయి. 667 అర్జీలు తిరస్కరణకు గురయ్యాయి. ఈ విధంగా 28వ తేదీనాటికి అర్జీల పరిష్కారంలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. తాజాగా సోమవారం వచ్చిన అర్జీలతో కలిపి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరిష్కారంలో మరింత ముందడుగు వేసే అవకాశం ఉంది. రక్తం తగేస్తోంది. ఆదుకోండి గిరిజన ప్రాంతంలో పుట్టడం... నిరుపేద కుటుంబానికి చెందడం... మలగాం చంద్రరావు చేసిన పాపం. తలసేమియా వ్యాధి అతని రక్తాన్ని తాగేస్తోంది. తీవ్ర రక్తహీనతతో బాధ పడుతున్న ఈ నిర్భాగ్యుడు సోమవారం ‘స్పందన’లో కలెక్టర్‌కు తన గోడు విన్నవించుకున్నాడు. చంద్రరావుది భామిని మండలం బాలేరు గ్రామం. ఎంబీఏ 2017లో పూర్తిచేసి బతుకుతెరువు కోసం హైదరాబాద్‌లో ఓ చిరుద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి రక్తహీనత మొదలైంది. ఆరంభంలో ఆ విషయం తెలియక అలాగే ఓ మూడు నెలలు కాలం గడిపేశాడు. స్నేహితులు ఆయనకు రక్తహీనత ఉన్నట్లు గమనించి వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో రక్తం 2.9 పాయింట్లు ఉన్నట్లు కనుగొని, తలసేమియా వ్యాధిగా ధ్రువీకరించారు. దీంతో అప్పటి నుంచి హైదరాబాద్, విజయనగరం, చెన్నై గుడ్లవేలూరుతోపాటు పలుచోట్ల వైద్యం కోసం చాలామంది డాక్టర్ల వద్దకు తిరిగాడు. ఆయన తల్లిదండ్రులు వలసజీవులు. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్ధితి. బతుకుపోరాటంలో భాగంగా హైదరాబాద్, చెన్నై వెళ్లిపోయి భవన నిర్మాణ కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకు ఓ అక్క, చెల్లి ఉన్నారు. రూ.40 లక్షలు ఉంటే శాశ్వత పరిష్కారం పూర్తిగా ఈ జబ్బు నయం కావాలంటే రూ.40 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని బాధితుడు చెప్పాడు. పేదరికంలో పుట్టి తిండికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న తనకు రూ.40 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నానని, వైద్యం చేయించమని, చిన్న ఉద్యోగం లేదా పెన్షన్ ఇప్పించాలని స్పందనకు వచ్చి కలెక్టర్‌ను వేడుకున్నాడు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని కలెక్టర్ చెప్పారని బాధితుడు సాక్షికి తెలిపాడు. -
రేషన్‌కార్డులు లేక..పథకాలకు నోచుకోక
సాక్షి, చీపురుపల్లి రూరల్: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్‌కార్డు ఎంతో అవసరం. అలాంటి రేషన్‌కార్డు లేకపోతే ప్రభుత్వం ప్రతీ నెలా అందజేస్తున్న రేషన్ సరుకులతో పాటు ప్రభుత్వ పథకాలకు కూడా దూరమవ్వాల్సిందే. ఇది ఏ ఒక్క రూ కాదనలేని నిజం. ప్రజలకు ఏవేవో చేసేశాం, ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్‌కార్డులను మంజూరు చేయడంలో ఎంతో నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేందుకు పీకే పాలవలస ఒక ఉదాహరణ. ఈ గ్రామానికి చెందిన గవిడి గొల్లబాబు గత మూడున్నర ఏళ్లుగా రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేస్తునే ఉన్నాడు. కొత్త రేషన్‌కార్డు రావాలంటే భార్య, భర్తల పేర్లు ఏ ఒక్క కార్డులో కూడా ఉండకూడదనే నిబంధన ఉంది. ఈ క్రమంలో కొత్త కార్డు వస్తుందనే ఆశతో తల్లిదండ్రుల కార్డులో ఉన్న పేరును గొల్లబాబు తొలగించాడు. అదే విధంగా భార్య పేరును కూ డా ఆమె తల్లిదండ్రుల కార్డులో నుంచి తొలగించా డు. ప్రతీ జన్మభూమి సభలో దరఖాస్తు చేసుకోవడమే తప్ప రేషన్‌కార్డు మాత్రం రావడం లేదు. దీంతో భార్య, భర్తలతో పాటుగా పిల్లలు సైతం ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదు. ఇది ఈ ఒక్కడి సమస్య కాదు నియోజకవర్గంలోని వందలాది మంది సమస్య. రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. కార్డులు లేక పథకాలకు నోచుకోలేకపోతున్నారు. ప్రయోజనం లేని జన్మభూమి సభలు ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన జన్మభూమిలో వందల సంఖ్యలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు వచ్చినప్పటికీ ఏ ఒక్కరికీ మంజూరైన దాఖలా లు లేవు. గత నాలుగేళ్లుగా జరిగిన జన్మభూమి సభల్లో కూడా వందల సంఖ్యలో రేషన్‌కార్డులు దరఖాస్తు చేస్తే పదుల సంఖ్యలో మాత్రమే మంజూరయ్యాయి. దీంతో అర్హులందరికీ నిరాశ తప్పడం లేదు. పేద ప్రజల పట్ల ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో ఈ ఒక్క రేషన్ కార్డు విషయంలోనే స్పష్టమవుతోందని పలువురు మండిపడుతున్నారు. 55 మంది ఎదురు చూపు మండలంలోని ఒక్క పీకే పాలవలస గ్రామంలోనే 55 మంది అర్హులు రేషన్‌కార్డుల కోసం ప్రతీ సారి దరఖాస్తు చేసుకొని మోసపోతున్నారు. గ్రామానికి విచ్చేసిన రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులను నిలదీస్తే మేమేమీ చేయలేం, మా చేతుల్లో ఏమీ లేదని చెబుతున్నారని స్థానిక విలేకర్లతో తమ గోడు చెప్పుకుంటున్నారు. రేషన్‌కార్డు కోసం 1100కి ఎప్పుడు ఫోన్ చేసినా, ప్రోసెస్‌లో ఉన్నాయని చెబుతున్నారని తెలిపారు. దీంతో చేసేదేమీ లేక కలెక్టర్ గ్రీవెన్‌సెల్‌లో కూడా ఫిబ్రవరి 4న ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఏ ఒక్క అధికా రి కూడా గ్రామంలోకి రాలేదని వారు వాపోతున్నారు. రెండోసారి గ్రీవెన్‌సెల్‌లో అడిగితే మండ ల రెవెన్యూ అధికారులకు వివరాలంతా పంపిం చామని సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద ప్రస్తావిస్తే కలెక్టర్ కార్యాలయం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. -
19, 20 తేదీల్లో కేంద్ర బృందం పర్యటన
శ్రీకాకుళంకలెక్టరేట్,న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు, ప్రభుత్వ ఆస్తులను పరిశీలించేందుకు.. నష్టాలను అంచనా వేసేందు కు ఈ నెల 19, 20 తేదీల్లో కేంద్ర బృందం జిల్లాలో పర్యటించనుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి శంభుసింగ్ నేతృత్వంలో హోం, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ కమిషన్, రోడ్స్ అండ్ హైవేస్, వాట ర్‌సప్లై, ఫైనాన్స్ శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఆర్.పి.సింగ్, వి.కె.భట్ల, కె.రాంవర్మ, ఎ.చంద్రశేఖర్, ఎ.కృష్ణప్రసాద్, పి.జి.ఎస్.రావులతో కూడిన ఈ బృం దం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఇదీ షెడ్యూల్ 19వ తేదీ: మధ్యాహ్నం 3 గంటలకు రణస్థలం మండలం బంటుపల్లిలో దెబ్బతిన్న చెరువులు, కాలువలు, రోడ్లను పరిశీలిస్తుంది. 3.30 గంటలకు లావేరు మండలం ఆదపాక, బుడుమూరుల్లో జరిగిన పంట నష్టం, చెరువులకు పడిన గండ్లు, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తుంది. అనంతరం బుడుమూరు ఎస్సీ కాలనీని సందర్శిస్తుంది. 4.10 గంటలకు పొందూరు మండలం లోలుగులోని కుమ్మరి గుంట చెరువు, ఇరిగేషన్ కాలువలకు పడిన గండ్లను పరిశీలిస్తుంది. అనంతరం ఎచ్చెర్ల టీటీడీసీలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకిస్తుంది. అనంతరం ఫరీద్‌పేట వద్ద నాగావళి కుడి కాలువ గట్టుకు పడిన గండిని పరిశీలించి ఆక్కడ వరి పంటకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుంది. రాత్రికి శ్రీకాకుళం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తుంది. 20వ తేదీ: ఉదయం 10.30 గంటలకు సోంపేట మండలం ఇస్కలపాలెంలో పర్యటిస్తుంది. అనంతరం కవిటి మండలం రాజపురం ప్రాంతంలో కొబ్బరి తోటలకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తుంది. తర్వాత పలాస మండలం సున్నాదేవి గ్రామంలో పర్యటిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు పలాస నుంచి బయలుదేరి కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, బోరుభద్ర మీదుగా పోలాకి మండలం డీఎల్ పురం, సుసరాం వరకు వరి పంటకు జరిగిన నష్టాన్ని, వంశధార కాలువలకు పడిన గండ్లను పరిశీలిస్తుంది. అనంతరం నరసన్నపేట మండలం కోమర్తిలో అరటి తోటలకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎచ్చెర్ల మండలం ముద్దాడకు వెళ్లి అక్కడ వరి పంటకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తుంది. అనంతరం కేంద్ర బృందం విశాఖపట్నం వెళుతుంది.