నిబద్ధత.. నిజాయితే ముఖ్యం ! | Special Article On Srikakulam Collector J Srinivas | Sakshi
Sakshi News home page

నిబద్ధత.. నిజాయితే ముఖ్యం !

Published Sun, Aug 11 2019 7:48 AM | Last Updated on Sun, Aug 11 2019 7:48 AM

Special Article On Srikakulam Collector J Srinivas - Sakshi

భార్య, కుమార్తెతో కలెక్టర్‌ నివాస్‌

సాక్షి, శ్రీకాకుళం : విధి నిర్వహణలో కాస్త సీరియస్‌గా కన్పిస్తారు. దానివెనుక నిబద్ధత, నిజాయితీ ఉంది. మనిషి కాసింత కటువుగా అన్పించినా జిల్లా ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఆయనలో ప్రస్ఫుటిస్తుంది. జిల్లాలో ఉన్నతంగా పనిచేసిన కలెక్టర్లలో తానొకరిగా ఉండాలని పరితపిస్తారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యతాంశాలను ప్రామాణికంగా తీసుకుని... విద్య, వైద్యం, నిరుద్యోగం, సాగునీరు అంశాలకు పెద్దపీట వేస్తూ... సమస్యలే సవాళ్లుగా, ప్రభుత్వ లక్ష్యసాధనే గమ్యంగా అడుగులేస్తూ... రాష్ట్రంలో పలు పైలెట్‌ ప్రాజెక్టులకు సారథ్యం వహించబోతున్నారు మన కలెక్టర్‌ జె.నివాస్‌. బిజీబిజీగా ఉన్న ఆయన ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. ఇప్పుడేం చేస్తున్నానో... రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నానో ఆవిష్కరించారు. వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్నారు. సాక్షితో చెప్పిన ముచ్చట్లు ఆయన మాటల్లోనే....

గతంలో ఇన్ని నియామకాలు ఎప్పుడూ జరగలేదు. ఏపీపీఎస్‌సీ ద్వారా ఇంత స్థాయిలో ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి. జిల్లాలో లక్షా 50 వేల మంది వరకు గ్రామ సచివాలయాల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీని కోసం అన్ని ఏ ర్పాట్లు చేస్తున్నా. ఇప్పటికే 427 పరీక్ష కేంద్రాల ను గుర్తించాం. తొమ్మిది కేటగిరీల పోస్టులకు మూడు రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని ప్ర భుత్వం భావిస్తున్నా.. ఈ కేటగిరీలన్నింటికీ అ భ్యర్థులంతా పరీక్షలు రాయాలంటే 7 రోజులు అవసరమవుతాయని ప్రభుత్వాన్ని కోరాం. 

సన్నబియ్యం పంపిణీకి సన్నద్ధం
వలంటీర్ల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్‌ ఒకటి నుంచి పైలెట్‌ ప్రాజెక్టుగా మన జిల్లా నుంచే ప్రారంభమవుతుంది. పం పిణీకి సంబంధించి వాలంటీర్ల వారీగా మ్యాపిం గ్‌ చేశాం. ఆ మ్యాపింగ్‌ ఎంతవరకు బాగా జరిగిందో కొత్తగా నియమితులైన వలంటీర్ల ద్వారా క్రాస్‌ చెక్‌ చేయించనున్నాం. వలంటీర్ల వ్యవస్ధ అమల్లోకి వచ్చి ఇంటింటికీ సన్న బి య్యం తీసుకెళ్లి అందించాలంటే వలంటీర్‌కు స్మార్ట్‌ ఫోన్‌ ఉండాలి. దానిలో యాప్‌ ఉండాలి, ఫోన్‌ సిగ్నల్‌ ఉండాలి. ఇవన్నీ పక్కాగా ఉండేలా చూస్తున్నాం.

ఎఫ్‌పీ షాపుల వేలి ముద్రల ద్వా రా పంపిణీ చేయడం చాలా కష్టమైంది. ఆ వ్యవస్థకు సంబంధించిన సమస్యలన్నీ సరిచేశాం. సన్నబియ్యం పంపిణీ విషయంలో కూడా అదే రకంగా ముందుకెళ్తాం. అదే సమయంలో గ్రా మ సచివాలయాల పోస్టుల నియామక పరీక్షలు జరగనున్నాయి. మాకిది చాలెంజ్‌. ఎంపీడీఓ లకు పరీక్ష నిర్వహణ బాధ్యతలు, తహశీల్దార్లకు సన్నబియ్యం పంపిణీ బాధ్యతను అప్పగిస్తున్నాం. ప్రారంభంలో కొన్ని సమస్యలుంటాయి. రెండు మూడు నెలల్లో అన్నీ సవ్యమవుతాయి.  

స్కూల్స్, హాస్టల్స్‌ రూపురేఖలు మార్చుతాం
పాఠశాలలు, వసతి గృహాల్లో మార్పు రావాలి. దానికోసం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృ ష్టి సారించారు. కేవలం హాస్టల్స్‌   బాత్‌రూమ్‌లు, టాయిలెట్లు, ఇతర మరమ్మతు కోసం జిల్లా కు రూ.14 కోట్లు ఇచ్చారు. విజయవాడ కార్పొరేషన్‌లో నేను పనిచేసినప్పుడు విమానాశ్రయాల్లో ఉండేలా స్కూల్స్‌లో టాయిలెట్స్‌ తయారు చేశాం. ఇక్కడ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. తొలి విడతగా 100 ఎస్సీ, బీసీ హాస్టల్స్‌తోపాటు గురుకులాల్లో ఆధునిక వసతులు క ల్పిస్తున్నాం. రెండు మూడు నెలల్లో హాస్టల్స్‌ స్వరూపం మార్చుతాం.

 

లక్ష మందికి ఉపాధి
జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎక్కువ. దీన్ని దృష్టిలో ఉంచుకుని లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా తీసుకున్నాం. 2019–2020 సంవత్సరానికి 50 వేల ఉద్యోగాలు, 2020–2021కి 50 వేల ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ రూపొం దిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన యాప్‌ను తయారుచేశాం. దాని లో నిరుద్యోగ యువత తమ విద్యార్హతలు, ఇ తర ధ్రువ పత్రాలు నమోదు చేసుకోవాలి. ప్రతి నెలా జాబ్‌మేళా నిర్వహిస్తాం. కొత్తగా పరిశ్రమలు తీసుకురావాలని సీఎం దృష్టిలో పెట్టాం. ముఖ్యంగా గార్మెంట్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నా ం. ఇప్పటికే రెండు మూడు కంపెనీలతో సంప్రదింపులు చేశాం. 

పంటల బీమాపై ప్రత్యేక శ్రద్ధ
జిల్లాలో 5 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో 2.5 లక్షల మంది మాత్రమే బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవడం వలన పంటల బీమాకు అర్హులయ్యారు. మిగిలిన వారు బీ మాకు దూరంగా ఉండిపోతున్నారు. వీరి కోసం  ప్రత్యేకంగా ఈనెల 13వ తేదీ క్యాంపెయిన్‌ చేపడుతున్నాం. ఆధార్, బ్యాంకు ఖాతా, పట్టాదా రు పుస్తకం చూపిస్తే చాలు వారి పేరున బీమా ప్రీమియం మేమే చెల్లిస్తాం. రైతులు కట్టాల్సిన ప్రీమియం డబ్బులు కలెక్టర్‌ నిధుల నుంచి బీమా కంపెనీలకు చెల్లించనున్నాం. లక్ష మంది రైతులను బీమా పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. బీమా చెల్లింపుల్లో కూడా జాప్యం ఉంది. 2017కు సంబంధించిన బీమా పరిహారం ఈ ఏడాది వచ్చిందని, దీనివల్ల రైతుల్లో అసంతృప్తి ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 

ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే...
జిల్లాలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడంతో వర్షం వచ్చినా నీరు నిల్వ చేసుకోలేని దుస్థితిని ఎదుర్కొన్నాం. హిరమండలం రిజర్వాయర్‌ సామర్థ్యం 19 టీఎంసీలు ఉండాల్సి ఉంది. కాని పనులు వేగంగా జరగకపోవడంతో వరద నీరు స్టోరేజ్‌ సామర్థ్యం కోల్పోతున్నాం. ఆఫ్‌షోర్‌ రిజ ర్వాయర్‌తో పలాస ప్రాంతానికి మే లు జరగనుంది. కానీ దాని పనులు ఆశించిన మేర జరగలేదు. 25 శాతం లోపు పనులు ఉండటం వలన కాం ట్రాక్ట్‌ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. 

ప్రజారోగ్యం కోసం 
రిమ్స్‌లో వైద్య సేవలు అందించేందు కు అహర్నిశలు కష్టపడుతున్నాం. తరచూ ఆసుపత్రికి వెళ్లి పరిశీలిస్తున్నాను. లోటుపాట్లు సరిదిద్దేందుకు కృషి చేస్తున్నాను. స్టాఫ్‌ నర్సులు విశాఖ నుంచి వస్తున్నారు. అటువంటిది లేకుండా 21మందిని వెనక్కి తీసుకున్నాం. జీఎంఆర్‌ వైద్యులను తీసుకొచ్చాం. మాతృశిశు మరణాలు జిల్లాలో సమస్యగా మారింది. ఇటీవల జరిగిన 31 కేసుల్లో 13 కేసులు రక్తస్రావం వల్ల తలెత్తినవే. ఇటువంటి పరిస్థితులు అధిగమించేందుకు నాంది ప్రోగ్రామ్‌ అమలవుతున్నది. రక్తహీనత సమస్యను పరిష్కరించేందుకు నువ్వుల లడ్డూ వంటివి అందిస్తున్నాం. బాలసంజీవని ప్రొగ్రాం ద్వారా 9, 10 తరగతి విద్యార్ధులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రతి ఆసుపత్రిలో బ్లడ్‌ స్టోరేజ్‌ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. 

పర్సనల్‌ టచ్‌ 
మా సొంత గ్రామం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం. మా నాన్న కమర్షియల్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. అమ్మ ప్రధానో పాధ్యాయిని. భార్య, కుమా ర్తె ఉన్నారు. నేను 10వ తరగతి వరకు కాంచీపురంలో చదివాను. తిరుచనాపల్లిలో ఇంటర్, వెల్లూరులోని వీఐటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివాను. అనంతరం క్యాంపస్‌ ఇంటర్వ్యూలో కన్‌స్ట్రక్షన్‌ కంపె నీలో మెకానికల్‌ ప్రాజెక్టు ఇంజనీర్‌గా ఎంపికై మూడేళ్లపాటు చెన్నైలో చేశాను. ఆ ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. తొలుత డీఎస్పీగా ఎంపికయ్యాను. ఆ తర్వాత మూడో అటెంప్ట్‌లో సివిల్స్‌కు ఎంపికయ్యాను. 2010 లో ఐఏఎస్‌గా ఎంపికై తూర్పుగోదావరిలో ట్రై నీగా పనిచేశాను. ఆ తర్వాత గూడూరు సబ్‌కలెక్టర్‌గా, అదిలాబాద్‌ ఐటీడీఏ పీఓగా పనిచేశాను. 2016లో విశాఖ జేసీగా నియమితులయ్యాను. ఆ తర్వాత విజయవాడ కార్పొరేషన్‌ కమిషనర్‌గా పనిచేసి ఎన్నికలకు ముందు జిల్లాకొచ్చాను.    

ఇరయంబూ స్ఫూర్తితో..
మా జిల్లా కలెక్టర్‌గా ఇరయంబూ (1999) ఉన్న హయాంలో వరదలు వచ్చాయి. ఆ సమయంలో రైతులు గట్టు కొట్టేశారు. దీంతో ఊ రంతా మునిగిపోయింది. మా ప్రాంతం కూ డా ముంపునకు గురైంది. ఆ సమయంలో కలెక్టర్‌ ఇరయంబూ అందించిన సేవలు అమో ఘం. కలెక్టర్‌గా ఉంటే ఏదైనా చేయగలమిని భావించి సివిల సర్వెంట అవ్వాలని నిర్ణయించుకున్నా. ఐఏఎస్‌ అనేది నా కోరిక. ఈ విషయంలో మా తల్లిదండ్రులు ఒత్తిడి లేదు. దిల్లీలో ఐఏఎస్‌ ప్రిపేర్‌ అయ్యాను. అమ్మ ప్రో త్సాహంతో ముందుకుసాగాను. మా తల్లిదండ్రులిద్దరూ ఒకేలా ప్రోత్సాహించేవారు. గ్రం థాలయం నుంచి పుస్తకాలు తీసుకొచ్చి చదివించేవారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement