సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. మందస మండల కేంద్రంలో కరోనాతో బాధపడుతున్న 37 ఏళ్ల యువకుడు బుధవారం మృతి చెందాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు మందస పట్టణాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. కరోనా మరణం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్ మందస మండల కేంద్రానికి వెళ్లనున్నారు. కాగా మరణించిన వ్యక్తికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. కేవలం సంక్రమణ ద్వారానే అతడికి కరోనా వ్యాపించిందని అధికారులు వెల్లడించారు. (కరోనా : మృతదేహాలకు కష్టమొచ్చె!)
ఇప్పటివరకు జిల్లాలో 400 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 271 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో కేసుల దృష్ట్యా ఒక్క శ్రీకాకుళం పట్టణంలోనే 10 కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో భారత్‌లో 2003 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,903 మందిని కరోనా బలి తీసుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారినపడి 4.46 లక్షల మంది మృతి చెందారు. (కరోనా కరాళ నృత్యం)
Comments
Please login to add a commentAdd a comment