j nivas
-
ఏపీ: కరోనాపై అప్రమత్తంగానే ఉన్నాం
సాక్షి, విజయవాడ: కోవిడ్ విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. నిరంతర పర్యవేక్షణ నడుస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ బుధవారం వెల్లడించారు. నవంబర్ నెల నుండి దాదాపు 30 వేల శ్యాంపిళ్లు టెస్ట్ చేయగా 130 పాజిటివ్ కేసులొచ్చాయి. అన్నీ ఒమిక్రాన్ తప్ప కొత్త వేరియంట్లేవీ నమోదు కాలేదు. జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కు ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్ లు అందుబాటులో వున్నాయి అని ఆయన వెల్లడించారు. దేశంలో చైనా నుంచి వచ్చిన కొత్త వేరియెంట్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ స్పందిస్తూ.. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ , ఐసియు బెడ్లు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు , మందులు కూడా అందుబాటులో వున్నాయని, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. -
బహిరంగ ప్రదేశాల్లో చవితి వేడుకలకు అనుమతిలేదు..
సాక్షి,గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను ఈ ఏడాది కూడా నిరాడంబరంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ జె.నివాస్ గురువారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై విజయవాడ, నూజివీడు, మచిలీ పట్నం, గుడివాడ రెవెన్యూ డివిజన్ల సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల పదో తేదీన వినాయక చవితిని పురస్కరించుకుని ఇంటిలో మాత్రమే పూజలకు పరిమితం కావాలని భక్తులను కోరారు. చవితి వేడుకల్లో భాగంగా బహిరంగ ప్రదేశాలు, కూడళ్లలో గణనాథుని విగ్రహాలను ఏర్పాటు చేయొద్దని, నిమజ్జన కార్యక్రమాలు జరపొద్దని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. వినాయక చవితి నిర్వహణ కమిటీలు పూర్తిస్థాయిలో జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు రెవెన్యూ డివిజన్, మండల, మున్సిపాలిటీ స్థాయిలో వినాయక చవితి నిర్వహణ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులను ఆహ్వానించి, వారితో సమావేశాలు నిర్వహించి, వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ నివాస్ ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రజలు గుమిగూడకుండా ఉండడమే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ప్రజలు అందరూ సహకరించాలని విజ్ఞప్తిచేశారు. చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. -
టీచర్ అవతారమెత్తిన కలెక్టర్ నివాస్
సాక్షి, భామిని: ఎప్పుడు అధికారిక కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే కలెక్టర్ జె.నివాస్ గురువారం కాసేపు ఉపాధ్యాయుని అవతారమెత్తారు. సుద్దముక్క చేతపట్టుకుని తరగతి గదిలో పాఠాలు బోధించారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి వారి ప్రగతిని తెలుసుకున్నారు. భామిని మండలం బత్తిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన సందర్భంగా కలెక్టర్ 8వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించారు. అనంతరం మధ్యాహ్న భోజనం పదార్థాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారులు విద్యాకానుకలో భాగంగా అందజేసిన బూట్లను తప్పనిసరిగా వేసుకునేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ బొడ్డేపల్లి శ్రీనివాసరావు, హెచ్ఎం రాడ వెంకటరమణ, తహసీల్దార్ ఎస్.నర్సింహమూర్తి, ఎంపీడీఓ జి.పైడితల్లి, ఎస్సై కె.వి.సురేష్ పాల్గొన్నారు. చదవండి: లంచం అడిగే.. అడ్డంగా దొరికిపాయే.. తోపుడుబండి వ్యాపారి.. మునిసిపల్ చైర్మన్ -
కథలు బాగా చెబుతున్నారు!
సాక్షి, వజ్రపుకొత్తూరు రూరల్: పని చేయమంటే కథలు బాగా చెబుతున్నారు. నా దగ్గర అలాంటివి చెప్పడం మానేసి బయట కథలు రాసుకోండి అంటూ గ్రామ సచివాలయ ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ జె.నివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట, నువ్వలరేవు గ్రామాల్లో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంచినీళ్లపేట ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు–నేడు పనులను పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని కూడా సందర్శించారు. అయితే సచివాలయం ఎదురుగా చెత్త పేరుకుపోయి ఉండటాన్ని చూసిన ఆయన కార్యదర్శులపై మండిపడ్డారు. శనివారంలోగా చెత్తను తొలగించి సంబంధిత ఫొటోలను తనకు పెట్టాలని అదేశించారు. ] ప్రభుత్వ పథకాల లబి్ధదారుల జాబితాను సచివాలయం వద్ద ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్నించారు. హెంగర్లు, బోర్డులు, లబి్ధదారుల జాబితా లిస్టులు అస్తవ్యస్తంగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న పనులు కుడా చేయకపోతే మీరు ఎందుకు అంటూ మండిపడ్డారు. ఇలాగైతే రేపటి నుంచి ఆఫీసుకు రానవసరం లేదన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులతో పాటు ఎంపీడీవో ఈశ్వరమ్మ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. íఫీవర్ సర్వే వివరాలను గ్రామ వలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు. జనరల్ ఫండ్‌ను సది్వనియోగం చేసుకొని గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. నువ్వలరేవు గ్రామ సచివాలయన్ని కూడా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ, తహసీల్దార్ బి.అప్పలస్వామి, ఎంపీడీవో ఈశ్వరమ్మ, రెవెన్యూ అధికారులున్నారు. -
శ్రీకాకుళంలో తొలి కరోనా మరణం
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. మందస మండల కేంద్రంలో కరోనాతో బాధపడుతున్న 37 ఏళ్ల యువకుడు బుధవారం మృతి చెందాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు మందస పట్టణాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. కరోనా మరణం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్ మందస మండల కేంద్రానికి వెళ్లనున్నారు. కాగా మరణించిన వ్యక్తికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. కేవలం సంక్రమణ ద్వారానే అతడికి కరోనా వ్యాపించిందని అధికారులు వెల్లడించారు. (కరోనా : మృతదేహాలకు కష్టమొచ్చె!) ఇప్పటివరకు జిల్లాలో 400 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 271 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో కేసుల దృష్ట్యా ఒక్క శ్రీకాకుళం పట్టణంలోనే 10 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో భారత్‌లో 2003 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,903 మందిని కరోనా బలి తీసుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారినపడి 4.46 లక్షల మంది మృతి చెందారు. (కరోనా కరాళ నృత్యం) -
నిబద్ధత.. నిజాయితే ముఖ్యం !
సాక్షి, శ్రీకాకుళం : విధి నిర్వహణలో కాస్త సీరియస్‌గా కన్పిస్తారు. దానివెనుక నిబద్ధత, నిజాయితీ ఉంది. మనిషి కాసింత కటువుగా అన్పించినా జిల్లా ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఆయనలో ప్రస్ఫుటిస్తుంది. జిల్లాలో ఉన్నతంగా పనిచేసిన కలెక్టర్లలో తానొకరిగా ఉండాలని పరితపిస్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతాంశాలను ప్రామాణికంగా తీసుకుని... విద్య, వైద్యం, నిరుద్యోగం, సాగునీరు అంశాలకు పెద్దపీట వేస్తూ... సమస్యలే సవాళ్లుగా, ప్రభుత్వ లక్ష్యసాధనే గమ్యంగా అడుగులేస్తూ... రాష్ట్రంలో పలు పైలెట్ ప్రాజెక్టులకు సారథ్యం వహించబోతున్నారు మన కలెక్టర్ జె.నివాస్. బిజీబిజీగా ఉన్న ఆయన ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. ఇప్పుడేం చేస్తున్నానో... రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నానో ఆవిష్కరించారు. వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్నారు. సాక్షితో చెప్పిన ముచ్చట్లు ఆయన మాటల్లోనే.... గతంలో ఇన్ని నియామకాలు ఎప్పుడూ జరగలేదు. ఏపీపీఎస్సీ ద్వారా ఇంత స్థాయిలో ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి. జిల్లాలో లక్షా 50 వేల మంది వరకు గ్రామ సచివాలయాల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీని కోసం అన్ని ఏ ర్పాట్లు చేస్తున్నా. ఇప్పటికే 427 పరీక్ష కేంద్రాల ను గుర్తించాం. తొమ్మిది కేటగిరీల పోస్టులకు మూడు రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని ప్ర భుత్వం భావిస్తున్నా.. ఈ కేటగిరీలన్నింటికీ అ భ్యర్థులంతా పరీక్షలు రాయాలంటే 7 రోజులు అవసరమవుతాయని ప్రభుత్వాన్ని కోరాం. సన్నబియ్యం పంపిణీకి సన్నద్ధం వలంటీర్ల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటి నుంచి పైలెట్ ప్రాజెక్టుగా మన జిల్లా నుంచే ప్రారంభమవుతుంది. పం పిణీకి సంబంధించి వాలంటీర్ల వారీగా మ్యాపిం గ్ చేశాం. ఆ మ్యాపింగ్ ఎంతవరకు బాగా జరిగిందో కొత్తగా నియమితులైన వలంటీర్ల ద్వారా క్రాస్ చెక్ చేయించనున్నాం. వలంటీర్ల వ్యవస్ధ అమల్లోకి వచ్చి ఇంటింటికీ సన్న బి య్యం తీసుకెళ్లి అందించాలంటే వలంటీర్‌కు స్మార్ట్ ఫోన్ ఉండాలి. దానిలో యాప్ ఉండాలి, ఫోన్ సిగ్నల్ ఉండాలి. ఇవన్నీ పక్కాగా ఉండేలా చూస్తున్నాం. ఎఫ్పీ షాపుల వేలి ముద్రల ద్వా రా పంపిణీ చేయడం చాలా కష్టమైంది. ఆ వ్యవస్థకు సంబంధించిన సమస్యలన్నీ సరిచేశాం. సన్నబియ్యం పంపిణీ విషయంలో కూడా అదే రకంగా ముందుకెళ్తాం. అదే సమయంలో గ్రా మ సచివాలయాల పోస్టుల నియామక పరీక్షలు జరగనున్నాయి. మాకిది చాలెంజ్. ఎంపీడీఓ లకు పరీక్ష నిర్వహణ బాధ్యతలు, తహశీల్దార్లకు సన్నబియ్యం పంపిణీ బాధ్యతను అప్పగిస్తున్నాం. ప్రారంభంలో కొన్ని సమస్యలుంటాయి. రెండు మూడు నెలల్లో అన్నీ సవ్యమవుతాయి. స్కూల్స్, హాస్టల్స్ రూపురేఖలు మార్చుతాం పాఠశాలలు, వసతి గృహాల్లో మార్పు రావాలి. దానికోసం సీఎం జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృ ష్టి సారించారు. కేవలం హాస్టల్స్ బాత్రూమ్లు, టాయిలెట్లు, ఇతర మరమ్మతు కోసం జిల్లా కు రూ.14 కోట్లు ఇచ్చారు. విజయవాడ కార్పొరేషన్లో నేను పనిచేసినప్పుడు విమానాశ్రయాల్లో ఉండేలా స్కూల్స్‌లో టాయిలెట్స్ తయారు చేశాం. ఇక్కడ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. తొలి విడతగా 100 ఎస్సీ, బీసీ హాస్టల్స్‌తోపాటు గురుకులాల్లో ఆధునిక వసతులు క ల్పిస్తున్నాం. రెండు మూడు నెలల్లో హాస్టల్స్ స్వరూపం మార్చుతాం. లక్ష మందికి ఉపాధి జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎక్కువ. దీన్ని దృష్టిలో ఉంచుకుని లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా తీసుకున్నాం. 2019–2020 సంవత్సరానికి 50 వేల ఉద్యోగాలు, 2020–2021కి 50 వేల ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ రూపొం దిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన యాప్‌ను తయారుచేశాం. దాని లో నిరుద్యోగ యువత తమ విద్యార్హతలు, ఇ తర ధ్రువ పత్రాలు నమోదు చేసుకోవాలి. ప్రతి నెలా జాబ్‌మేళా నిర్వహిస్తాం. కొత్తగా పరిశ్రమలు తీసుకురావాలని సీఎం దృష్టిలో పెట్టాం. ముఖ్యంగా గార్మెంట్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నా ం. ఇప్పటికే రెండు మూడు కంపెనీలతో సంప్రదింపులు చేశాం. పంటల బీమాపై ప్రత్యేక శ్రద్ధ జిల్లాలో 5 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో 2.5 లక్షల మంది మాత్రమే బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవడం వలన పంటల బీమాకు అర్హులయ్యారు. మిగిలిన వారు బీ మాకు దూరంగా ఉండిపోతున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఈనెల 13వ తేదీ క్యాంపెయిన్ చేపడుతున్నాం. ఆధార్, బ్యాంకు ఖాతా, పట్టాదా రు పుస్తకం చూపిస్తే చాలు వారి పేరున బీమా ప్రీమియం మేమే చెల్లిస్తాం. రైతులు కట్టాల్సిన ప్రీమియం డబ్బులు కలెక్టర్ నిధుల నుంచి బీమా కంపెనీలకు చెల్లించనున్నాం. లక్ష మంది రైతులను బీమా పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. బీమా చెల్లింపుల్లో కూడా జాప్యం ఉంది. 2017కు సంబంధించిన బీమా పరిహారం ఈ ఏడాది వచ్చిందని, దీనివల్ల రైతుల్లో అసంతృప్తి ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే... జిల్లాలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడంతో వర్షం వచ్చినా నీరు నిల్వ చేసుకోలేని దుస్థితిని ఎదుర్కొన్నాం. హిరమండలం రిజర్వాయర్ సామర్థ్యం 19 టీఎంసీలు ఉండాల్సి ఉంది. కాని పనులు వేగంగా జరగకపోవడంతో వరద నీరు స్టోరేజ్ సామర్థ్యం కోల్పోతున్నాం. ఆఫ్‌షోర్ రిజ ర్వాయర్తో పలాస ప్రాంతానికి మే లు జరగనుంది. కానీ దాని పనులు ఆశించిన మేర జరగలేదు. 25 శాతం లోపు పనులు ఉండటం వలన కాం ట్రాక్ట్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. ప్రజారోగ్యం కోసం రిమ్స్‌లో వైద్య సేవలు అందించేందు కు అహర్నిశలు కష్టపడుతున్నాం. తరచూ ఆసుపత్రికి వెళ్లి పరిశీలిస్తున్నాను. లోటుపాట్లు సరిదిద్దేందుకు కృషి చేస్తున్నాను. స్టాఫ్ నర్సులు విశాఖ నుంచి వస్తున్నారు. అటువంటిది లేకుండా 21మందిని వెనక్కి తీసుకున్నాం. జీఎంఆర్ వైద్యులను తీసుకొచ్చాం. మాతృశిశు మరణాలు జిల్లాలో సమస్యగా మారింది. ఇటీవల జరిగిన 31 కేసుల్లో 13 కేసులు రక్తస్రావం వల్ల తలెత్తినవే. ఇటువంటి పరిస్థితులు అధిగమించేందుకు నాంది ప్రోగ్రామ్ అమలవుతున్నది. రక్తహీనత సమస్యను పరిష్కరించేందుకు నువ్వుల లడ్డూ వంటివి అందిస్తున్నాం. బాలసంజీవని ప్రొగ్రాం ద్వారా 9, 10 తరగతి విద్యార్ధులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రతి ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. పర్సనల్ టచ్ మా సొంత గ్రామం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం. మా నాన్న కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అమ్మ ప్రధానో పాధ్యాయిని. భార్య, కుమా ర్తె ఉన్నారు. నేను 10వ తరగతి వరకు కాంచీపురంలో చదివాను. తిరుచనాపల్లిలో ఇంటర్, వెల్లూరులోని వీఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. అనంతరం క్యాంపస్ ఇంటర్వ్యూలో కన్స్ట్రక్షన్ కంపె నీలో మెకానికల్ ప్రాజెక్టు ఇంజనీర్‌గా ఎంపికై మూడేళ్లపాటు చెన్నైలో చేశాను. ఆ ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. తొలుత డీఎస్పీగా ఎంపికయ్యాను. ఆ తర్వాత మూడో అటెంప్ట్‌లో సివిల్స్‌కు ఎంపికయ్యాను. 2010 లో ఐఏఎస్‌గా ఎంపికై తూర్పుగోదావరిలో ట్రై నీగా పనిచేశాను. ఆ తర్వాత గూడూరు సబ్‌కలెక్టర్‌గా, అదిలాబాద్ ఐటీడీఏ పీఓగా పనిచేశాను. 2016లో విశాఖ జేసీగా నియమితులయ్యాను. ఆ తర్వాత విజయవాడ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసి ఎన్నికలకు ముందు జిల్లాకొచ్చాను. ఇరయంబూ స్ఫూర్తితో.. మా జిల్లా కలెక్టర్‌గా ఇరయంబూ (1999) ఉన్న హయాంలో వరదలు వచ్చాయి. ఆ సమయంలో రైతులు గట్టు కొట్టేశారు. దీంతో ఊ రంతా మునిగిపోయింది. మా ప్రాంతం కూ డా ముంపునకు గురైంది. ఆ సమయంలో కలెక్టర్ ఇరయంబూ అందించిన సేవలు అమో ఘం. కలెక్టర్‌గా ఉంటే ఏదైనా చేయగలమిని భావించి సివిల సర్వెంట అవ్వాలని నిర్ణయించుకున్నా. ఐఏఎస్ అనేది నా కోరిక. ఈ విషయంలో మా తల్లిదండ్రులు ఒత్తిడి లేదు. దిల్లీలో ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాను. అమ్మ ప్రో త్సాహంతో ముందుకుసాగాను. మా తల్లిదండ్రులిద్దరూ ఒకేలా ప్రోత్సాహించేవారు. గ్రం థాలయం నుంచి పుస్తకాలు తీసుకొచ్చి చదివించేవారు. -
భిక్షగాళ్లు లేని బెజవాడగా మార్చేస్తాం
సాక్షి,అమరావతి బ్యూరో: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భిక్షగాళ్లు లేని బెజవాడగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని వీఎంసీ కమిషనర్ జె.నివాస్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని నవజీవన్ బాల భవన్లో విజయవాడ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లోని భిక్షగాళ్లను వీఎంసీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గుర్తించిన 80 భిక్షగాళ్లను తెలంగాణకు చెందిన అమ్మ, నాన్న అనాథాశ్రయానికి అప్పగించే కార్యక్రమాన్ని కమిషనర్ నివాస్ పర్యవేక్షించారు. ఈసందర్భంగా భిక్షగాళ్లకు బిస్కెట్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన అమ్మ, నాన్న ఫౌండేషన్ భిక్షగాళ్లను, అనాథలను అక్కున చేర్చుకొనే మంచి çసంస్థ అని చెప్పారు. సంస్థకు అప్పగించే ప్రతిఒక్కరి ఫొటోలు పూర్తి వివరాలు సేకరించినట్లు వివరించారు. అలాగే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేందుకు రేషన్ కార్డులు ఇచ్చేలా ఈ సంస్థ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారని ఆయన పేర్కొన్నారు. భిక్షగాళ్లు్ల లేని బెజవాడగా తీర్చిదిద్దేందుకు ఇది తొలిఅడుగు అని అభిప్రాయపడ్డారు. త్వరలోనే మిగిలిన భిక్షగాళ్లను కూడా ప్రత్యేక డ్రైవ్ ద్వారా అమ్మ, నాన్న ఎన్జీవో సంస్థకు అప్పగించనున్నట్లు వెల్లడించారు.. రాజీవ్ గాంధీ హోల్‌సేల్ మార్కెట్ తరలింపు విజయవాడ: నగరంలో రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్, పూల మార్కెట్లు వేరే ప్రాంతాలకు తరలించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జె.నివాస్ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంంలో తన చాంబర్లో హోల్‌సేల్ మార్కెట్ వ్యాపారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ మార్కెట్ తరలింపునకు సహకరించాలని కోరారు. విజయవాడ– అమరావతి గేట్‌వే ప్రాజెక్ట్ కింద ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నమని వివరించారు. దీని దృష్ట్యా హోల్‌సేల్ మార్కెట్లను వేరే ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అమరావతి రాజధానికి సమీపంలో విజయవాడ కేంద్ర బిందువు అయిందన్నారు. అందు వలన వ్యాపారాలు మార్కెట్లను తరలించేందుకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. సమావేశంలో కార్పొరేషన్ ఎస్టేట్ ఆఫీసర్ సి.హెచ్.కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
జేసీ చేతికి సూపర్ బజార్
కంచికి చేరిన పాలకవర్గం కథ మరో 2 నెలలుండగానే పదవులు రద్దు ‘సాక్షి’ కథనంతో ప్రకంపనలు వైఎస్సార్ సీపీ ఆందోళనల పర్యవశనం సాక్షి, విశాఖపట్నం : ఈసారి వారి పప్పులుడకలేదు. మరో రెండు నెలల పదవీ కాలం ఉండగానే సూపర్‌బజార్ పాలకవర్గం రద్దయింది. కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు.. లెక్కకు మించి అక్రమాలకు ఆలవాలమైన విశాఖ కో-ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్(సూపర్‌బజార్) పాలకవర్గానికి ఎట్టకేలకు చెక్‌పడింది. ప్రస్తుత పాలకవర్గానికి మరో రెండు నెలల గడువు ఉండగానే రద్దయింది. పగ్గాలు జిల్లా జాయింట్ కలెక్టర్ జె.నివాస్ చేతికి వెళ్లాయి. ఈ మేరకు సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి.విజయ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ కథ సూపర్‌బజార్ పాలకవర్గం మే 21వ తేదీతో ముగిసింది. కొత్త పాలకవర్గ నియామకం జరపకపోవడంతో తమ పదవీ కాలం మరో అర్నెల్ల పాటు పొడిగించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఓ వైపు అవినీతి ఆరోపణలు.. లోకాయుక్త విచారణ నేపథ్యంలో ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలాన్ని పొడిగించడానికి ఇష్టపడని అప్పటి సహకార శాఖ ప్రత్యేక కమిషనర్ మిరియాల శేషగిరిబాబు రద్దు చేసి జేసీకి పగ్గాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఈ ఉత్తర్వులను తొక్కిపెట్టి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాలక వర్గాన్ని మరో అర్నెల్ల పాటు పొడిగిస్తూ రివైజ్డ్ జీవో జారీ చేశారు. ఈ విషయాన్ని ‘మరో ఆర్నెల్లు ఆరగించండి’ అంటూ మే 22న సాక్షిలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ప్రస్తుత పాలకవర్గం పాల్పడుతున్న అవినీతి.. అవకతవకలు.. లోకాయుక్త విచారణ తదితర పరిణామాలపై ప్రచురిత మైన ఈ పరిశోధనాత్మక కథనం సంచలనం రేపింది. ‘సాక్షి’లో ఇచ్చిన కథనంపై ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. సూపర్‌బజార్ అవినీతిపై విచారణ జరపాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ఖండించడంతో పాటు ద క్షిణ కో-ఆర్డినేటర్ కోలా గురువులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీల ఆధ్వర్యంలో వందలాది మంది కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేశారు. అక్రమాలపై సమగ్ర నివేదిక పాలకవర్గం అవినీతిపై జిల్లా యంత్రాంగం కూడా దృష్టి సారించింది. సూపర్బజార్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా కో-ఆపరేటివ్ అధికారి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. సహకార వ్యవస్థ నిబంధనలకు విరుద్ధంగా సూపర్‌బజార్ లో కార్యకలాపాలు సాగుతున్నాయని, కేవలం ఆర్థికపరమైన ప్రయోజనాల కోసమే నాడు తన పదవీకాలాన్ని పొడిగించాలని ప్రస్తుత పాలకవర్గం కోరినట్టుగా సదరు నివేదికలో పొందుపర్చారు. దీంతో ప్రస్తుత పాలకవర్గ పదవీకాలాన్ని రద్దు చేసి తక్షణమే పర్సన్ ఇన్చార్జి(పీఐసీ)గా జేసీ నివాస్‌కు అప్పగించాలని కో-ఆపరేషన్ స్పెషల్ కమిషనర్ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సూపర్‌బజార్ పర్సన్ ఇన్చార్జి బాధ్యతలను జేసీకి అప్పగిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి.విజయకుమార్ జీవో నెం.691ను జారీ చేశారు. మరో రెండు నెలల పాటు పదవీ కాలం ఉండగానే ప్రస్తుత పాలకవర్గం పదవీకాలాన్ని రద్దు చేయడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఆదేశాలు తక్షణమే అమలు సూపర్‌బజార్ ప్రస్తుత పాలకవర్గ చైర్మన్ ఆర్.రామకృష్ణంరాజుపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ప్రస్తుత పాలకవర్గం హయాంలో భారీగా అవినీతి, ఆరోపణలు వెల్లువెత్తాయి. సహకార చట్టం నియమాలకు విరుద్ధంగా పాలకవర్గం నిర్ణయాలు తీసుకోవడంతో సంస్థ ఆర్థికంగా నష్టపోతుంది. ఈ నేపథ్యంలో జిల్లా సహకార శాఖాధికారి, జిల్లా కలెక్టర్ సిఫార్సు మేరకు రామకృష్ణంరాజు పాలకవర్గాన్ని రద్దు చేస్తూ జేసీని పర్సన్ ఇన్చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. - జి.గోవిందరావు, మేనేజింగ్ డెరైక్టర్, సూపర్‌బజార్