Srikakulam RIMS Hospital
-
రిమ్స్ నియంత్రణలోకి ఆసుపత్రి, కిడ్నీ పరిశోధనా కేంద్రం
సాక్షి, అమరావతి/ శ్రీకాకుళం : పలాసలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రెండు వందల పడకల ఆసుపత్రితో పాటు, కిడ్నీ పరిశోధనా కేంద్రాలను శ్రీకాకుళం రిమ్స్ నియంత్రణ పరిధిలోకి తీసుకుని వస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జీవోను జారీ చేసింది. -
'ఉద్దానం కిడ్నీ సమస్య దీర్ఘకాలికమైనది'
శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ రోగుల సమస్య దీర్ఘకాలికమైందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ రోజురోజుకు రిమ్స్ అధ్వాన్నంగా తయారవుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్దానం కిడ్నీ రోగుల సమస్య పరిష్కారం పట్ల ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ( చదవండి : 15 రోజుల్లోగా స్పందించకుంటే ఉద్యమమే ) ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ప్రజా ఉద్యమాన్ని లేవదీస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ‘కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేశాం’ అంటూ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గతంలో చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.