Srikantadatta Narasimharaja Wodeyar
-
వారసుడెక్కడ ?
రాజు వెడలె రవితేజములలరగ... అని మైసూరు మాజీ సంస్థానాధీశుల ఇంట పాడుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టేట్లుంది. మైసూరు రాజుల చివరి వారసుడు శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్ గత ఏడాది డిసెంబరు 10న పరమపదించగా, ఆయన వారసుని ఎంపికలో రాణి ప్రమోదా దేవి ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ దంపతులకు సంతానం లేని సంగతి తెలిసిందే. కనుక వారసుని అన్వేషణ అనివార్యమైంది. దగ్గర పడుతున్న దసరా మైసూరు రాజ వంశీకులకు సుమారు ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. 1399లో యదురాయ పట్టాభిషేకంతో మైసూరు రాజుల శకం ప్రారంభమైంది. సుమారు 400 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలతో మైసూరు పేరు ప్రఖ్యాతులు అన్ని ఖండాలకు వ్యాపించింది. దసరా సందర్భంగా మైసూరు రాజులు అంబా విలాస్ రాజ ప్రాసాదంలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ప్రైవేట్ దర్బారు, ఆయుధ పూజ, విజయ దశమి ఊరేగింపులలో అప్పటి మైసూరు రాచరికం కళ్లకు సాక్షాత్కరిస్తుంది. శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్ మరణానంతరం, ఆయన వారసునిపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. సెప్టెంబరు 25న నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఉత్సవాలపై అనుమానాలు మరో మూడు నెలల్లో వారసుని ప్రకటించాల్సి ఉంది. అయితే రాజప్రాసాదం వర్గాల ప్రకారం ఈ సారి నవరాత్రి ఉత్సవాలు ప్యాలెస్‌లో జరిగే అవకాశాల్లేవు. శ్రీకంఠదత్త సంవత్సరీకం (డిసెంబరు 10) పూర్తయ్యే వరకు రాజ ప్రాసాదంలో పూజలు, పునస్కారాలు ఉండవు. అయితే వారసుని ఎంపికలో జరుగుతున్న జాప్యం పట్ల పర్యాటక రంగంలోని పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దసరా సందర్భంగా అలనాటి రాజ వైభవాన్ని తిలకించడానికి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోవచ్చని వారు భయపడుతున్నారు. తద్వారా కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కనుక రాణి ప్రమోదా దేవి ఈ విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. రాణి ప్రమోదా దేవికి పెను సవాలు మైసూరు రాజ వంశీకుల వారసునికి ప్రత్యేక లక్షణాలుండాలి. వారసునికి ఎలాంటి అర్హతలుండాలో శతాబ్దాల కిందటే నిర్ధారించారు. అలాంటి అర్హత కలిగిన వ్యక్తులు అందుబాటులో లేనందు వల్లే వారసుని ఎంపికలో అసాధారణ జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. వారసునికి రాజ వంశీకులతో రక్త సంబంధం ఉండాలి. అతనికి మైసూరు రాచరిక సంప్రదాయాలు తెలిసి ఉండాలి. ఉత్తమ విద్యార్హతలు కలిగి ఉండాలి. స్వచ్ఛమైన జీవన శైలితో పాటు అవివాహితుడుగా ఉండాలి. శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్‌కు అయిదుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. వారికంతా మగ సంతానమే. వారిలో ఒకరిని వారసునిగా ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇక్కడే క్లిష్ట సమస్య ఎదురవుతోంది. ఆ అయిదుగురిలోని ఉపనన్యు, రుద్ర ప్రతాప్ సింగ్‌లు కేవలం పదో తరగతి వరకే చదివారు. వర్చస్ అరస్, ఆదిత్య గురుదేవ్లు డిగ్రీ పూర్తి చేశారు. వర్చస్ అరస్‌కు రాజ ప్రాసాదం సంప్రదాయాలు, శ్లోకాలు తెలిసినప్పటికీ, కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా మరో సామాజిక వర్గానికి చెందిన, విడాకులు పొందిన మహిళను పెళ్లాడారు. ఆదిత్య ఆస్ట్రేలియాలో ఎంబీఏ పూర్తి చేసి, బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక మిగిలింది కాంతరాజ్ అరస్. ఇతనిని ఎంపిక చేయడానికి ప్రమోదా దేవి సముఖంగా ఉన్నప్పటికీ, ఒడయార్ బతికి ఉన్నప్పుడే అతనిని వ్యతిరేకించారు. పైగా అతను పీయూసీ వరకే చదువుకున్నాడు. ఒడయార్‌కు శ్రాద్ధ కర్మలు ఇతనే నిర్వర్తించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో వారసుని ఎంపిక రాణి ప్రమోదా దేవికి క్లిష్టతరంగా తయారైంది. -
మైసూర్ మహారాజా ప్యాలెస్
-
మైసూరు రాచరికంలో ప్రతిష్టంభన
రాజులే పోయినా...రాజ్యాలు కూలినా... చిరస్మరణీయంగా ఉండేది మాత్రం వారు చేసిన మంచి పనులే. మిగతా రాజుల విషయంలో ఏమో కానీ, మైసూరు రాజులు మాత్రం నిత్యం ప్రజా క్షేమాన్నే ఆకాంక్షించారు. ప్రస్తుతం వారసులు లేక మైసూరు రాజ వంశం అంతమైనట్లేనని అందరూ భావిస్తున్న తరుణంలో రూ. కోట్లు విలువ చేసే వారి ఆస్తులు ఎవరికి దక్కుతాయనే విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది. చివరి రాజ వారసుడు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ ఈ నెల 10న పరమపదించినప్పటి నుంచీ దీనిపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ఒడయార్ ఆస్తులకు ఉత్తరాధికారి? శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ పరమపదించిన తర్వాత ఆస్తులకు సంబంధించి ఆయన సతీమణి ప్రమోదాదేవి యజమానిగా వ్యవహరిస్తారా... లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా అనే విషయమై ఆసక్తి నెలకొంది. ఒడయార్‌కు సంతానం లేనందున, సహజంగా ఆయన ఆస్తంతా ప్రమోదా దేవికే చెందాలి. ఒడయార్ అంత్యక్రియలను ఆయన అక్క కుమారుడు కాంతరాజ అర్స్ నిర్వహించారు. అయితే కర్మకాండలను నెరవేర్చడానికి మాత్రమే ఆయనకు ప్రైవేట్ దర్బారులో తాత్కాలికంగా పట్టాభిషేకం చేశారు. ఒడయార్ వారసుడుగా ఆయనను ప్రకటించడానికి ప్రమోదా దేవి ఇప్పటికీ సుముఖత వ్యక్తం చేయడం లేదు. అంతేకాక మైసూరులోని అంబా విలాస్ రాజప్రాసాదం చుట్టూ ఉన్న భూములు, బెంగళూరు రాజప్రాసాదం మినహా దాని చుట్టూ ఉన్న భూములపై 1996 నుంచి రాష్ర్ట ప్రభుత్వం, ఒడయార్ల మధ్య కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. సుప్రీం కోర్టులో నడుస్తున్న వ్యాజ్యాలు మైసూరు అంబా విలాస్ రాజ ప్రాసాదం మినహా చుట్టూ ఉన్న 60 ఎకరాల భూమి. బెంగళూరులోని రాజ ప్రాసాదం మినహా, దాని చుట్టూ ఉన్న 460 ఎకరాల భూమి హక్కులపై కూడా... 1996లో చట్టం.. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య 1996లో జనతా దళ్ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైసూరు రాజ వంశస్తుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి చట్టాన్ని తెచ్చారు. దీనిపై కూడా కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నందున ఏ విధంగా వ్యవహరిస్తారనే విషయమై కుతూహలం నెలకొంది. ఒడయార్ అంత్యక్రియలకు హాజరైనప్పుడు విలేకరులు దీనిపై ప్రశ్నించినప్పుడు ఆయన చాలా ఇబ్బందికి గురయ్యారు. 1999లో జనతా దళ్ ఓడిపోయి అధికారాన్ని కోల్పోయినప్పుడు ‘చాముండి మాత ఆగ్రహం వల్ల జనతా దళ్ ఓడిపోయింది’ అని ఒడయార్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాకతాళీయమే అయిన మైసూరు రాజులైనా... ముగ్గురు సంస్థానాధీశులు బెంగళూరులోని రాజ ప్రాసాదంలోనే కన్నుమూశారు. ముగ్గురూ గుండెపోటుతోనే తుది శ్వాసను విడవడం గమనార్హం. జయచామరాజేంద్ర ఒడయార్, నాల్వడి కృష్ణరాజ ఒడయార్, శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్లు సొంత పనులపై బెంగళూరుకు వచ్చినప్పుడు రాజ ప్రాసాదంలోనే మృత్యువాత పడ్డారు. ఆధునిక మైసూరు శిల్పిగా పేరు గడించిన నాల్వడి కృష్ణరాజ ఒడయార్ తండ్రి పదవ చామరాజేంద్ర ఒడయార్ 1894లో, నాల్వడి 1940లో కన్నుమూశారు. ఒడయార్ కుటుంబానికి చెందిన ఆస్తులు మైసూరులోని లోక్ రంజన్ రాజ ప్రాసాదం చాముండి కొండపై ఉన్న రాజేంద్ర విలాస్ రాజ ప్రాసాదం ఊటీలోని ఫర్న్హిల్ ప్యాలెస్ మైసూరులోని గన్ హౌస్ మైసూరులోని సురభి డెయిరీ మైసూరులోని చైతన్య హాలు మంజునాథ్ ప్యాకింగ్స్ అండ్ ప్రాడక్ట్ రీజెన్సీ గ్రూపు మైసూరులోని జగన్మోహన రాజ ప్రాసాదం మైసూరులోని పెద్ద చెరువు మైదానం -
కన్నుమూసిన ఒడయార్
-
బెంగళూరులో మైసూరు మహారాజు `వొడెయార్` మృతి
మైసూరు: మైసూరు రాజవంశస్థుడైన శ్రీకాంత్ దత్తా నరసింహారాజా వొడెయార్ (60) గుండెపోటుతో మరణించారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 3. 30 గంటల ప్రాంతంలో వొడెయార్ మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. హృద్వేగ సంబంధిత వ్యాధి కారణంగా ఆయన చికిత్స నిమిత్తం విక్రమ్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయన ప్రాణం నిలబెట్టేందుకు ఎంతోగానూ ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆ ఆస్పత్రి ఇన్ చార్జీ కె. మదన్ కుమార్ చెప్పారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్ దత్తా నరసింహారాజా వొడెయార్ బెంగళూర్ ఫ్యాలెస్ లో తన ఇద్దరి సోదరిమణులు, ఇతర కుటుంబ సభ్యులతో నివాస ముంటున్నారు. అయితే శ్రీకాంత్ దత్తా గుండె ఒక్కసారిగా స్తంభించిపోవడంతో ఆయన్నుమధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో హుటాహుటినా విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. వొడెయార్ ను పునరుజ్జీవితుడిని చేసేందుకు వెంటిలేటర్ ను అమర్చినా వైద్యులు విశ్వప్రయత్నాలు చేసినా.. ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. చివరికి వొడెయార్ మరణించినట్టు హృద్రోగ చికిత్స నిపుణుడు రంగనాథ నాయక్ నిర్ధారించినట్టు మదన్ కుమార్ పేర్కొన్నారు.