SriKrishnudu
-
జ్ఞాననిధి పార్థసారథి
సాధారణంగా కృష్ణుడు అనగానే చేతిలో పిల్లనగ్రోవి ఊదుతూ జగత్తును సమ్మోహనపరుస్తూ కనిపిస్తాడు. అయితే వైఖానసాగమం, పాంచరాత్ర ఆగమం ఎనిమిది మంది కృష్ణ రూపాలను వివరించాయి. వాటిలో బాలకృష్ణుడు, నవనీత కృష్ణుడు, కాళీయ మర్దన కృష్ణుడు, గోవర్ధనధరుడు, మదన గోపాలమూర్తి, పార్థసారథి, త్రైలోక్య మోహనుడు, జగన్మోహనుడు మొదలైన రూపాలు విశేషమైనవి. శ్రీ కృష్ణుడి రూపాలలో విశిష్టమైనది మదన గోపాలుని రూపం. ఈ స్వామి 16 చేతులతో దర్శనమిస్తాడు. రెండు చేతులతో వేణువును ఊదుతూ, మరో రెండు చేతులతో శంఖ చక్రాలను, మిగిలిన చేతులలో పాశ అంకుశాలను, పద్మం చెరకుగడను ధరించి దర్శనమిచ్చే ఈ స్వామిని రాజగోపాలుడు అని కూడా పిలుస్తారు ఈ స్వామి దర్శనంతో సకల అభీష్టాలు నెరవేరుతాయి. మహాభారత యుద్ధంలో అర్జునుడికి మార్గదర్శకుడిగా రథసారధిగా శ్రీ కృష్ణుడు కనిపిస్తాడు ఈ స్వామి రూపం పార్థసారథిగా ప్రసిద్ధి పొందింది. ఈ స్వామి ఒక చేతితో చండ్రకోలును, మరో చేతితో శంఖాన్ని ధరించి దర్శనమిస్తాడు. ఈ స్వామి జ్ఞాన ప్రదాయకుడు. భగవద్గీతను అనుగ్రహించింది ఈయనే. జగన్మోహనస్వామి రూపం బృందావనంలో రత్న కిరీటాన్ని ధరించి గరుడుని భుజంపై కూర్చుని ఎడమవైపు లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొని ఎనిమిది చేతులతో దర్శనమిస్తాడు. చెన్నై నగరంలో పార్ధసారధి స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనది విశిష్టమైనది కూడా. ఇక్కడి స్వామి వారి రూపం సాధారణంగా కనిపించే కృష్ణ వంటిది కాదు. స్వామి వారు ఇక్కడ మీసాలతో దర్శనమిస్తారు. ఆగమ శిల్ప శాస్త్రాలలో ఎక్కడా కూడా దేవతలకు గడ్డం మీసం మొదలైనవి కనబడకపోగా ఇక్కడి స్వామి మీసాల కృష్ణుడిగా ప్రసిద్ధుడు. ఈ స్వామిని దర్శిస్తే అన్ని భయాలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
జనన మరణాలు
జ్యోతిర్మయం జనన మరణాలు అనేవి సర్వప్రాణులకు సహజములే. పుట్టిన ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు గిట్టక మానడు. మరణించిన వానికి కూడా పుట్టుక తప్పదు. ఈ జనన మరణాలు అనేవి వదిలించుకుంటే వదిలేవి కావు. అట్టి జనన మరణాలను గూర్చి దుఃఖించుట తగదని శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి ‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్యచ తస్మాదపరిహార్యే ర్థే నత్వం శోచితుమర్హసి॥ చేసిన ఉపదేశం అన్ని కాలాలకు అన్ని ప్రాంతా లకు చెందిన వ్యక్తులందరికీ వర్తించేదే. ‘‘ఈ దేహాలన్నీ నశించేవే (అంతవంత ఇమే దోహాః). మానవుడు చినిగిన బట్టలను వదిలిపెట్టి, కొత్త బట్టలను ధరించినట్లు జీవుడు పాతబడినట్టి శరీరాలను వదిలి, నూతన శరీరాలను ధరిస్తాడు’’ అందుకే పండితులైన వారు ప్రాణాలు పోయిన వారి గురించి కాని, ప్రాణాలతో ఉండి సమస్య లతో సతమతమయ్యే వారిని గురించి కాని దుఃఖిం చరు అని శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి చేసిన ఉప దేశం అర్జునుడి వలె ప్రతినిత్యం పలు సందర్భాలలో దీనులై, బలహీనులై కర్తవ్య నిర్వహణ చేయలేక సంభ్ర మకు, మోహానికి గురైన వారందరికీ మార్గ నిర్దే శకంగా నిలుస్తుంది. వాలి మరణాన్ని సహించలేక దుఃఖిస్తున్న తార కు, హనుమంతుడు కర్తవ్యోపదేశం చేస్తూ ‘‘ప్రాణుల జనన మరణాలు అనిశ్చితాలు. ఈ విషయం బుద్ధి మంతురాలవు అయిన నీకు తెలియనిది కాదు. నీవం టి బుద్ధిమంతులు అనిశ్చితాలైన విషయాలను గురించి విచారించకుండా శుభకార్యాలను ఎంపిక చేసుకొని, అట్టి వాటిని నెరవేర్చుటకై ప్రయత్నించాలి.’’ ‘‘జానాస్యనియతామేవం భూతానామాగతింగతిమ్ తస్మాచ్ఛుభంహి కర్తవ్యం పండితేనైవ లౌకికమ్॥ అని హనుమంతుడు తారకు చేసిన ఉపదేశం సకల మానవాళికి శిరోధార్యమై నిలుస్తుంది. ప్రతి జీవుడి శరీరంలో బాల్యం, యౌవనం, ముసలితనం అనేవి ఎట్లా సహజమైనవో అట్లే ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని పొందడం కూడా సహజకృత్యమే. సర్వ సహజాలైన ఈ జనన మరణాల విషయంలో మోహా నికి గురికాకుండా ఉండేది ధీరుడొక్కడే. అట్లాంటి ధీరస్వభావాన్ని మానవులందరూ అల వరచుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. పుట్టిన ప్రతివారికి అనివార్యమైన మరణం గురించి పరితపిం చడం, దుఃఖంతో చిక్కిశల్యం కావటం తగదనే తత్త్వా న్ని గుర్తించగలగాలి. ఈ అశాశ్వతమైన దేహాన్ని శాశ్వ తమైన, పునరావృత్తి రహితమైన పరమానందభరి తమైన మోక్షసాధనకై వినియోగించాలి ‘‘అశాశ్వతేన దేహేన సాధనీయంహి శాశ్వతమ్’’ కాబట్టి, అశాశ్వత మైన ఈ మానవ దేహం సహకారంతో శాశ్వతమైన మోక్షాన్ని పొందాలి. అప్పుడే పూర్వపుణ్యం వల్ల లభిం చిన ఈ మానవ జన్మకు సార్థకత చేకూరుతుందనే పరమ సత్యాన్ని మన మనస్సులో బలంగా నాటుకునే ప్రయత్నం చేద్దాం. సముద్రాల శఠగోపాచార్యులు -
ప్రేమోపాసన
జ్యోతిర్మయం నంద వ్రజంలో ఒక గోపిక కొత్త ఇల్లు కట్టుకుంది. గృహ ప్రవేశానికి ఎందరో బంధువులు, ఆత్మీయులు వచ్చారు. వీళ్లేకాక ఆ గోపికకు ఎంతో ప్రియమైన ఒక ఇష్టసఖి కూడా బహుదూరం నుండి వచ్చింది. గృహ ప్రవేశానంతరం వాళ్లిద్దరూ యమునా నదీ స్నానానికి వెళ్లారు. జలకాలాడుతూ ఇష్టసఖి గోపికతో ‘చెలీ! నంద వ్రజంలో నివసించే మీరంతా ఎంతో అదృష్టవం తులు. శ్రీకృష్ణునితో రాసలీలలో పాల్గొనే మహద వకాశం మీకు ప్రాప్తించింది. అవునా!’ అని అన్నది. ‘నిజమే నేమో’ అన్నది గోపిక. ‘చెలీ రాసలీల జరిగిన ఆ ఒక్క రాత్రి ఆరు నెలల సాధా రణ రాత్రులతో సమానం అని అంటారు కదా! అంత సుదీర్ఘ కాలంలో శ్రీకృష్ణుడు ఎన్నిమార్లు తన బాహువల్లరిలో నిన్ను లాలించాడో చెప్పవా?’ అని అడిగింది కుతూహలంగా ఇష్టసఖి. గోపిక విలాసంగా నవ్వుతూ ‘సఖీ! రాసలీల తరగతి కాదు కదా, లెక్కల్నీ ఎక్కాల్నీ వల్లించటానికి! అది ఒక దుకాణం కాదు కదా, లెక్కలు సరిచూసుకోవ టానికి! శ్రీకృష్ణ ప్రేమ గణాంకాలకు అందేది కాదు. అది ఒక అలౌకికమైన దివ్య రసానుభూతి. స్వామి సన్నిధికి చేరగానే నాకు శరీర సృ్పహ నశించింది. అంతరంగం అంతరించిపోయింది. నా అహంభావం లీనమైపోయింది. నేను నేనుగా మిగలలేదు. ఇంక మిగిలింది పరమానందస్ఫూర్తియే! సత్చిత్ ఆనంద స్వరూపమే!’ అని అన్నది పరవశంగా. ‘అదృష్టవంతురాలివే చెలీ! ఆ దశకు చేరటానికి నువ్వు ఎంత జపాన్ని చేశావో? ఎన్ని వ్రతాల్ని అనుష్టిం చావో? ఎన్ని సత్కర్మల్ని చేశావో కదా!’ అని అన్నది ఇష్టసఖి. ‘సఖీ! నేనింత జపించాను, అంత ధ్యానిం చాను, ఇన్ని వ్రతాల్ని చేశాను అన్న లెక్కల్లో అహం ఉం టుంది. అహం ఉన్నంత కాలం స్వామి దక్కడు. స్వామి విరహంలో ఎంత జ్వలించిపోయావు? సన్నిధికై ఎంతగా తపించావన్నదే ప్రధానం!’ అన్నది గోపిక. యమునా నదీ తీరంలోని చెట్ల పొదల్లో కూర్చొని ఒక సాధకుడు ఎంతో కాలంగా కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నాడు. జప సంఖ్య కొన్ని కోట్లు దాటింది. శరీరం శుష్కించిందే కానీ, కృష్ణ దర్శనం కాలేదు. ఆ సాధకునికి ఆ కాంతల సంభాషణ వినిపించింది. వెంటనే ఆ సాధకుడు తన తప్పు తెలుసుకొని, జపమాలను యమునలోకి విసిరివేశాడు. ప్రేమోపాస నకు ఉద్యుక్తుడైనాడు. చేతిలో మాల ప్రధానం కాదు. చిత్తంలో ప్రేమ జ్వాల ప్రధానం. భగవంతుణ్ణి ప్రేమించాలి. విరహంలో జ్వలించాలి. హృదయం ద్రవించాలి. అశ్రువులు స్రవించాలి. ఈ సంసార క్లేశం నుండి జన్మ మృత్యు పరంపర నుండి ముక్తి పొందాలని పరితపించాలి. మహదానంద స్వరూపులం కావాలని, ప్రేమ స్వరూపులం కావాలని ధ్యానించాలి. అదే వినిర్మల భక్తి. కనుక మనం కూడా వినిర్మల భక్తులమై ప్రేమోపాసకులమై సాధనను కొనసాగిద్దాం. ప్రేమ స్వరూపుడైన స్వామి దర్శనాన్ని పొందుదాం. ప్రేమ స్వరూపులమై నిలిచిపోదాం! పరమాత్ముని