srimannarayana
-
చినజీయర్ ఆశ్రమానికి కేసీఆర్
శంషాబాద్ రూరల్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామనగరంలోని జీవా ప్రాంగణంలో ఉన్న ఆశ్రమంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని కలిశారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎం దంపతులను జీయర్‌స్వామి శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆశ్రమంలోని నిత్యాన్నదాన సత్రంలో సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేశారు. ఆ తర్వాత యాద్రాది ప్రారంభోత్సవంపై జీయర్ స్వామితో సీఎం కేసీఆర్ చర్చించారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌కుమార్ పిలుపు మేరకు ఆశ్రమ ఆవరణలో జీయర్‌స్వామితో కలసి సీఎం కేసీఆర్ ఐదు జమ్మి మొక్కలను నాటారు. ‘ఊరు ఊరుకు జమ్మి–గుడి గుడికి జమ్మి’పేరిట ఎంపీ సంతోశ్ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని చినజీయర్ స్వామి కొనియాడారు. హైందవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న జమ్మి చెట్టును జాతీయ స్థాయిలో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్న ఆయనకు శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండాలని జీయర్‌స్వామి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూప్ అధినేత, టీటీడీ బోర్డు సభ్యుడు జూపల్లి రామేశ్వర్రావు, కావేరి సీడ్స్ అధిపతి భాస్కర్‌రావు, కలెక్టర్ అమెయ్ కుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆర్డీఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. యాద్రాది పర్యటన రద్దు.. ముచ్చింతల్ నుంచి చినజీయర్ స్వామితో కలసి సీఎం కేసీఆర్ యాద్రాది వెళ్లాలని నిర్ణయించుకోగా.. జీయర్‌స్వామి చాతుర్మాస దీక్షలో ఉన్నందును సాధ్యపడలేదు. నవంబర్ 19 నాటికి స్వామి దీక్ష పూర్తికానుంది. ఆ తర్వాతనే జీయర్ స్వామి యాద్రాదిని సందర్శించే అవకాశాలున్నాయి. కార్యక్రమం వాయిదా పడటంతో సీఎం తిరిగి గజ్వేల్‌లోని ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. జమ్మి మొక్క నాటుతున్న చినజీయర్‌స్వామి, సీఎం కేసీఆర్. చిత్రంలో ఎంపీ సంతోష్‌కుమార్ -
‘అతడే శ్రీమన్నారాయణ’ ట్రైలర్ లాంచ్
-
పోలీసులా.. చింతమనేని ఏజెంట్లా?
పశ్చిమగోదావరి, ఏలూరు (టూటౌన్): లా అండ్ ఆర్డర్ అమలులో తప్పు చేసిన చింతమనేని ప్రభాకర్‌ను వదిలేసి వెలుగులోకి తీసుకు వచ్చిన కత్తుల రవికుమార్‌జైన్‌ను అరెస్ట్ చేయడం ఏమిటని? పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఇది పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేయటమే అన్నారు. పోలీసులు కత్తుల రవిపై పెట్టిన కేసును తక్షణం ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులను, వెనుకబడిన వర్గాల వారిని దూషించడం, అవమానించడం, కొట్టడం పరిపాటిగా మారిపోతోందని పేర్కొన్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుంటే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం మానేసి బాధితులపైన, వెలుగులోకి తీసుకు వచ్చిన వారిపైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయటం అప్రజాస్వామికం, చట్ట వ్యతిరేకం అని వివరించారు. ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయటమేనని, చట్టం తనపని తాను చేసుకు పోతుంది అంటే అధికారానికి దాసోహామనటమేనా? అని ఆయన ప్రశ్నించారు. ఇక సామాన్యుడికి న్యాయం ఎక్కడ లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల ఆర్థిక వెనుకబాటు తనం, నిస్సహాయతలను ఆసరా చేసుకుని ప్రభుత్వ విప్‌గా ఉన్న వ్యక్తి దళితులను చులకనగా, అవమానకరంగా మాట్లాడటం, ప్రవర్తించటం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కటమేనన్నారు. ఎమ్మెల్యే చింతమనేనిని అన్ని విధాలుగా కాపాడుతున్న ప్రభుత్వాధినేత చంద్రబాబు కూడా దోషే అవుతారన్నారు. తక్షణం చింతమనేనిని అరెస్టు చేయాలని, లేకపోతే రాష్ట్ర స్థాయిలో అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, న్యాయవాదులు, మేధావులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. దళితులను అవమానించే ఇలాంటి వారందరికీ తగిన గుణపాఠం ప్రజలు చెబుతారన్నారు. -
చిరంజీవి.. ఈ శ్రీమన్నారాయణుడు
♦ తాను మరణించి మరో నలుగురికి జీవితాన్నిచ్చి.. ♦ బ్రేయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె, కిడ్నీ, లివర్, కళ్లు సేకరణ సాక్షి, బెంగళూరు: మరణంలోనూ మరో నలుగురికి జీవం పోసి జీవితాన్ని సార్థకం చేసుకున్నారు మైసూరుకు చెందిన శ్రీమన్నారాయణ. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీమన్నారయణ బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించడంతో ఆయన అవయవాలను బెంగళూరుకు తరలించి, అవసరమైన రోగులకు అమర్చారు. దీంతో మరణం తర్వాత కూడా మరో నలుగురికి శ్రీమన్నారాయణ జీవం పోసినట్లైంది. వివరాలు.....మైసూరుకు చెందిన శ్రీమన్నారయణ(38) కోళ్ల ఫారమ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 3న కోళ్లు ఉన్న వ్యాన్‌లో మైసూరు ప్రధాన రహదారిపై వెళుతుండగా, వాహనం ఆగిపోవడంతో డ్రైవర్ మరమ్మత్తు చేస్తున్నారు. దీంతో శ్రీమన్నారాయణ కూడా కిందకు దిగాడు. ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన బైక్ ఢీకొంది. ప్రమాదంలో శ్రీమన్నారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను మైసూరులోని జేఎస్ఎస్ ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. అయితే శనివారం ఉదయం శ్రీమన్నారాయణ బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధరించారు. శ్రీమన్నారాయణ అవయవాలను దానం చేయాల్సిందిగా ఆయన కుటుంబ సభ్యులను వైద్యులు కోరారు. ఇందుకు వారు అంగీకరించడంతో శ్రీమన్నారాయణ గుండె, కిడ్నీ, లివర్, రెండు కళ్లను సేకరించారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు..... ఇక మైసూరు నుంచి అత్యంత వేగంగా బెంగళూరులోని ఆస్పత్రులకు ఈ అవయవాలను చేర్చేందుకు మైసూరు, బెంగళూరు పోలీసులు మైసూరు నుంచి బెంగళూరు వరకు జీరో ట్రాఫిక్(గ్రీన్ కారిడార్) మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో సాధారణంగా నాలుగు గంటల సమయం పడుతుండగా గ్రీన్ కారిడార్ ఏర్పాటుతో గంటన్నర వ్యవధిలోనే ఆంబులెన్స్ బెంగళూరుకు చేరుకోగలిగింది. అనంతరం బెంగళూరులో ఆవశ్యకత ఉన్న వివిధ ఆస్పత్రులకు ఆయా అవయవాలను తరలించారు. -
శ్రీమన్నారాయణ అమరత్వానికి రెండు దశాబ్దాలు
విప్లవ వీరుడి యాదిలో జనగామ పోరు గడ్డ ఎర్రగొల్లపహాడ్‌లో 2005లో ఎత్తరుున స్థూప నిర్మాణం, ఆవిష్కరణ విద్యార్థి దశలోనే పీపుల్స్‌వార్‌లో చేరిక అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర స్థాయిలో బాధ్యతల నిర్వహణ జనగామ రూరల్ : ఓ విప్లవ వీరుడి చరిత్రను తరతరాలపాటు ప్రజలు గుర్తుంచుకోవాలంటే ఆయన వందేళ్లు జీవించాల్సిన పనిలేదు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అతను ఎంచుకున్న లక్ష్యం, నిర్ధేశించుకున్న మార్గంలో పయనిం చేందుకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన వారు చరిత్ర పుటల్లో ప్రజల హృదయాల్లో చిరకాలం చెరగని ముద్ర వేసుకుం టారు. ఆ స్థానాన్ని పదిలం చేసుకున్న వారిలో జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్ గ్రామానికి చెందిన కామ్రేడ్ బైరగోని శ్రీమన్నారాయణ అలియాస్ అంజన్న ఒకరు. మాములు రైతు కుటుంబంలో పుట్టి, ఉన్నత విద్య చదివి, భూస్వాముల, పెత్తందార్ల ఆగడాలకు వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సమసమాజ స్థాపనే లక్ష్యంగా స్థాపించిన పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరి అతితక్కువ కాలంలో జిల్లా నాయకుడిగా, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ అమరుడై నేటికి(మార్చి 2 నాటికి) సరిగ్గా 20 ఏళ్లు పూర్తయ్యాయి. నూనుగు మీసాల వయస్సులోనే పీపుల్స్‌వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన శ్రీమన్నారాయణ అలియాస్ అంజన్నది కీలక పాత్ర. ఆయన ఉద్యమంలో పని చేసిన కాలం లో భూస్వాముల గుండెల్లో రైళ్లు పరుగెత్తించా రు. పేదలకు భూపంపిణీ చేసేందుకు ఆయన చేసిన కృషిని జిల్లా ప్రజలు నేటికి మరిచి పోరు. 1986లో విద్యార్థి దశలోనే ఉద్యమబాట పట్టిన శ్రీమన్నారాయణ అంచెలంచెలుగా ఎదిగారు. పీపుల్స్‌వార్‌లో జిల్లా నాయకుడిగా, విప్లవ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేగాక నెక్కొండ, చేర్యాల, పాలకుర్తి దళ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించారు. దివంగత ఎన్డీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తి వేయగా జనగామలోని ప్రెస్టన్ కళాశాలలో 1994లో శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సుకు లక్షలాదిగా ప్రజలు హాజరవడం అప్పటికీ ఇప్పటికీ ఓ పెద్ద సంచలనం. 1995 మే 2న జనగామ మండలం యశ్వాంతాపూర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో శ్రీమాన్నారాయణ అసువులు బాసారు. స్థూపం నిర్మాణం.. ఆవిష్కరణ 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మావోయిస్టులపై నిషేధం సడలించిన క్రమంలో శ్రీమన్నారాయణ తల్లి రామక్క(ప్రస్తుతం ఆమె లేరు) తన సొంత ఖర్చులతో స్థూపం నిర్మించింది. ఈ స్థూపం ఆవిష్కరణకు విప్లవ కవులు, రచయితలు వరవరరావు, కళ్యాణరావు, మా భూమి సంధ్య హాజరయ్యూరు. -
'బాబు, కేసీఆర్ నియంతల్లా వ్యవహారిస్తున్నారు'
తిరుపతి: ఏపీ, తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీమన్నారాయణ ఆరోపించారు. ఆ రెండు రాష్ట్రాల సీఎంలు నియంతల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. ఆదివారం తిరుపతి నగరంలో శ్రీమన్నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ... తిరుపతిలో గ్రీన్‌హంట్ సదస్సును భగ్నం చేయడం దారణమన్నారు. గృహనిర్బంధం చేసిన పౌరహక్కుల సంఘం నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో జరగనున్న గ్రీన్‌హంట్ సదస్సుకు హాజరుకావాల్సిన పలువురు ఏపీసీఎల్సీ నేతలను ఈ రోజు అనంతపురంలో గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. వారిలో ఏపీసీఎల్సీ రాష్ట్ర అధ్యక్షుడు శేషయ్య, హరినాథరెడ్డి, విజయకుమార్‌లు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల అడవులను నాశనం చేసేందుకు చేపట్టిన ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను తక్షణం ఆపివేయాలని ఏపీసీఎల్సీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో గ్రీన్‌హంట్ సదస్సును ఏర్పాటు చేసింది. దీంతో పలువురు నాయకులు అరెస్ట్‌తో ఆ సదస్సు వాయిదా పడింది. -
హరిలో రంగ హరి
హరిదాసు అంటే హరి భక్తుడని అర్థం. సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపమే తానుగా ధరించిన హరిదాసు ఆబాల గోపాలుని తన్మయులను చేస్తూ, ఆనందపరుస్తూ తిరుగుతుంటారు. హరిదాసు తలపై ఉన్న నామాలు కలిగిన అక్షయ పాత్ర తరగని సంపదలకు గుర్తుగా భావిస్తారు. త్రిలోక సంచారి అయిన విష్ణుమూర్తి భక్తుడైన నారదులవారే నేటి మన ఈ హరిదాసులుగా గ్రామాలలో ప్రజలు భావిస్తారు. వేకువ జామునుంచే వీధుల్లో శ్రీమద్రమారమణ గోవిందో హరి... హరిలో రంగ హరి... అంటూ వీరు ఆలపించే గీతాలు మన సంస్కృతిని వివరిస్తాయి. రైతుల లోగిళ్లు ధాన్యరాశులతో నిండాలని, రైతులు సుఖసంతోషాలతో వర్ధిలాలని, ఇలాగే ప్రతిఒక్కరూ దానధర్మాలు చేస్తూ చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. మహిళలు. పిల్లలు ఆనందంగా ఎవరికి తోచిన విధంగా వారు విష్ణుమూర్తి అవతారమైన హరిదాసుకు దానధర్మాలు చేస్తుంటారు. రానురాను తగ్గుతున్న ఆదరణ.. మండలంలో రాజుపాలెం గ్రామంలో సుమారు 60 కుటుంబాలకు చెందిన హరిదాసులు జీవనం సాగిస్తున్నారు. గతంలో వీరి కుటుంబాల్లో ఒకటి నుంచి ఐదుగురు చొప్పున సంక్రాంతి నెలలో తిరుగుతుంటారు. రానురాను హరిదాసులకు పల్లెల్లో ఆదరణ తగ్గిపోవడంతో నేడు ఒకరిద్దరే తిరుగుతున్నారు. అందులో గ్రామానికి చెందిన తొట్టెంపూడి నరసింహాదాసు హరిదాసు వేషంలో రోజు చుట్టు ప్రక్కల గ్రామ వీధుల్లో తిరుగుతూ, దేవుని గీతాలు ఆలపిస్తూ సందడి చేస్తారు.