పసుపు పంటను పరిశీలించిన వైఎస్ జగన్
కర్నూలు : రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగళవారం మహానంది జిల్లా శ్రీనగరంలో పసుపు, అరటి పంటలను పరిశీలించారు. మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కాగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పసుపు, అరటి పంటకు గిట్టుబాటు ధర లభించిందని, ఇప్పుడు మాత్రం కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఈ సందర్భంగా తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ మహానంది చేరుకుంటారు. అక్కడ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరుడి దర్శనాంతరం రోడ్ షో గాజులపల్లె వరకూ కొనసాగుతుంది.