రైలు ఢీకొని మహిళ మృతి
వెల్దుర్తి: రైలు పట్టాలు దాటుతున్న ఓ మహిళను ప్రమాదవశాత్తు రైలు ఢీకొన్న సంఘటన వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట- శ్రీనివాస్‌నగర్ రైల్వే స్టేషన్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. మాసాయిపేట గ్రామం ఎస్సీ వాడకు చెందిన బ్యాగరి నాగమ్మ, యాదయ్యలు రైల్వే పట్టాలు దాటుతుండగా సికింద్రాబాద్ నుండి నాందేడ్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ రైలు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది.
దీంతో ఆ మహిళ తలబాగం రైతు పట్టాల మధ్యలో పడి ఉండగా కాళ్ళు, చేతులు విరిగిపోయి రైలు పట్టాల అవతలి భాగంలో పడిపోయాయి. ఈ సంఘటనను గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారాన్ని తెలియజేసినట్టు తెలిసింది.