srinivasa chakravarthi
-
'ఇద్దరూ ఒకేరోజు చనిపోవడం బాధాకరం'
సినీ రచయితలు సత్యమూర్తి, శ్రీనివాస చక్రవర్తి ఒకే రోజు మరణించడం బాధాకరమని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు విచారం వ్యక్తం చేశారు. సత్యమూర్తి, శ్రీనివాస చక్రవర్తి కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలియజేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ తండ్రి, ప్రముఖ సినీ రచయిత గొర్తి సత్యమూర్తి (61) చెన్నైలోని తన నివాసంలో సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. మరో రచయిత శ్రీనివాస చక్రవర్తి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. -
సినీరచయిత శ్రీనివాస చక్రవర్తి కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినీ రచయిత శ్రీనివాస చక్రవర్తి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆస్పత్రిలో చేరారు. సోమవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సినీరచయితగా ఆయన ఎన్నో చిత్రాలకు రచనలను అందించారు. తెలుగు ప్రేక్షకుల అధారణ పొందిన జగదేకవీరుడు, అతిలోక సుందరి, పెళ్లి, అన్నదమ్ముల సవాల్, పట్నం వచ్చిన పతివ్రతలు వంటి పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు. -
శ్రీ మృతి పై జగన్ సంతాపం
హైదరాబాద్: సంగీత దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస చక్రవర్తి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంగీత దర్శకుడు శ్రీ శనివారం సాయంత్రం కొండాపూర్లోని స్వగృహంలో కన్నుమూశారు. శ్రీనివాస చక్రవర్తి, ప్రముఖ సంగీత దర్శకుడు దివంగత చక్రవర్తి కుమారుడు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన శ్రీ గత కొద్ది కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీ పోలీస్ బ్రదర్స్, గాయం, సింధూరం, అనగనగా ఒక రోజు, ఆడుమగాడ్రా బుజ్జీ, అమ్మోరు, మనీ, నీకే మనసిచ్చా, ఆవిడా మా ఆవిడే, లిటిల్ సోల్జర్స్, కాశీ, సాహసం తదితర 20 చిత్రాలకు సంగీతం అందించారు.