సినీరచయిత శ్రీనివాస చక్రవర్తి కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినీ రచయిత శ్రీనివాస చక్రవర్తి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆస్పత్రిలో చేరారు. సోమవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
సినీరచయితగా ఆయన ఎన్నో చిత్రాలకు రచనలను అందించారు. తెలుగు ప్రేక్షకుల అధారణ పొందిన జగదేకవీరుడు, అతిలోక సుందరి, పెళ్లి, అన్నదమ్ముల సవాల్, పట్నం వచ్చిన పతివ్రతలు వంటి పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు.