‘కలిసి పనిచేస్తారు.. సీఎం ఆయనకింద కాదు’
పనాజీ: గోవా ముఖ్యమంత్రి ప్రస్తుత రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్తో కలిసి పనిచేస్తారే తప్ప.. ఆయన కింద ఉండి పనిచేయరని ఉత్తర గోవాకు చెందిన ఎంపీ శ్రీపాద్ నాయుడు చెప్పారు. అయితే, ముఖ్యమంత్రిగా ఎవరొస్తారనే విషయం ఇంకా బీజేపీ నిర్ణయించలేదని అన్నారు. గోవా రాజకీయాల్లోకి తనకు వెళ్లాలని ఉందని పారికర్ చెప్పడంతోపాటు, ఎన్నికల తర్వాతే గోవాకు రాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని పార్టీ హైకమాండ్ చెబుతోందని తొలుత నితిన్ గడ్కరీ, అనంతరం అమిత్షా చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర మండలిలో సభ్యుడిగా ఉన్న శ్రీపాద్ యాదవ్ తాజాగా స్పందించారు. ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై నిర్ణయం ఇంకా జరగలేదు. దానిని ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. ఇందులో ఎలాంటి అయోమయం లేదు. పారికర్ ప్రభుత్వ పెద్దగా వస్తారు. ఆయన అనుభవాన్ని గోవా ప్రభుత్వానికి అందించి ప్రజలకు అనుకూలన పాలన అందించేందుకు సూచనలు ఇస్తారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఆయనతో కలిసి పనిచేస్తారే తప్ప ఆయన కింద మాత్రం కాదు’ అని శ్రీపాద్ స్పష్టం చేశారు.