బావిలో పడి ఎలుగుబంట్లు మృతి
కరీంనగర్ : ప్రమాదవశాత్తు మూడు ఎలుగు బంట్లు వ్యవసాయ బావిలో పడి మరణించాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఆ విషయాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని... ఎలుగు బంట్లను బావిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.