ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని బాలుడి మృతి
హైదరాబాద్: ప్లాస్టిక్ కవర్ తో ఆట.. ఓ పసివాడి ప్రాణం తీసింది. ప్లాస్టిక్ కవర్ ను తలకు చుట్టుకుని నాలుగేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. కూకట్‌పల్లిలోని నిజాంపేట్‌కు చెందిన శ్రీయాన్ బుధవారం ఇంట్లో ప్లాస్టిక్ కవర్‌ను తలకు చుట్టుకుని ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఆ కవర్ అతడి తలకు చుట్టుకుంది. అయితే తల్లి గమనించకపోవడంతో శ్రీయాన్ ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీయాన్ మృతి చెందాడు.