SRM college
-
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హ్యాకథాన్ పోటీలు.. పోస్టర్ ఆవిష్కరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తోంది. దేశ నలుమూలల నుంచి కోడింగ్ పట్ల ఆసక్తిగల విద్యార్థులు ఎవరైనా ఈ కాంపిటిషన్లో పాల్గొనవచ్చు. ఈ పోటీలో టాప్ స్కోర్ సాధించిన వారికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అడ్మిషన్ లభిస్తుంది. వారికి నచ్చిన కోర్సు ఎంచుకోవచ్చు. ట్యూషన్ ఫీజుపై 100 శాతం వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. అలాగే రూ.లక్ష విలువ చేసే బహుమతులు అందుకోవచ్చు. నేషనల్ టాలెంట్ హంట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఏపీ సచివాలయంలో ఆవిష్కరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హ్యాకథాన్‌ను రెండు భాగాలుగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు మొదట మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ (ఎంసీక్యూ) పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో కోడింగ్ నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండు టెస్టులు ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. హ్యాకథాన్ పోటీ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 13న ప్రారంభమైంది. జనవరి 31 వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. చదవండి: అస్వస్థతతో వైఎస్సార్సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్ -
ఏపీ విద్యార్థుల ప్రతిభ.. 15 రూపాయలకే.. 45 కిలోమీటర్ల ప్రయాణం
సాక్షి, అమరావతి: తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్ఆర్ఎం విద్యార్థులు రెట్రోఫిట్ ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించారు. పాత బైక్‌కు లిథియమ్ అయాన్ బ్యాటరీని అమర్చి, వెనుక చక్రానికి మోటార్ బిగించడం ద్వారా వాహనం ముందుకు నడిచేలా తయారు చేశారు. 2 నెలల పాటు శ్రమించి వాయు, శబ్ధ కాలుష్యం లేని ఎలక్ట్రిక్ బైక్‌ను తయారుచేసినట్టు మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు రవితేజరెడ్డి, ఎ.చైతన్య, పాబోలు మోహన్ ఆదిత్య, కె.ప్రవీణ్, కె.యశస్విని, శ్రావ్య, వాసు, ప్రియాంక తెలిపారు. రెండు దశల పరీక్షల అనంతరం గురువారం వర్సిటీలో దీనిని ప్రదర్శించారు. పోర్టబుల్ బ్యాటరీ మెకానిజమ్ డిజైన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్టు తెలిపారు. ఈ–బైక్ ప్రత్యేకతలు ఇలా.. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడిచే రెట్రోఫిట్ ఎలక్ట్రిక్ బైక్.. పూర్తిగా చార్జింగ్ అవడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. ఇందుకు రూ.15 మాత్రమే ఖర్చవుతుంది. ఒకసారి చార్జింగ్‌తో సుమారు 45 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తే 35 కిలోమీటర్లు మేర చార్జింగ్ వస్తుంది. రివర్స్ సదుపాయంతో పాటు ఎలక్ట్రిక్ బ్రేక్‌ను అమర్చారు. బైక్‌ను తయారుచేసిన విద్యార్థులను వైస్ చాన్సలర్ డి.నారాయణరావు, ఆచార్య వజ్జా సాంబశివరావు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట్ నోరి అభినందించారు. -
కత్తులు, తుపాకీతో దాడికి దిగారు..
-
వైరల్ : కాలేజ్‌లో కత్తులతో వీరంగం
సాక్షి, చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని కాట్టాన్కులత్తూర్ ఎస్ఆర్ఎం కళాశాలలో మంగళవారం సాయంత్రం రెండు వర్గాల విద్యార్థులు ఘర్షణపడ్డారు. కత్తులు, తుపాకీతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. కాలేజ్ హాస్టల్స్‌లో బస చేస్తున్న విద్యార్థుల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఎంబీఏ రెండో ఏడాది చదివే విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి వీది రౌడీల్లా ప్రవర్తించారు. క్యాంపస్‌లో భయానక వాతావరణం సృష్టించారు. ఒక వర్గం విద్యార్థుల చేతిలో తుపాకీ కనిపించగా.. మరో వర్గం చేతిలో వేట కొడవలి కనిపించింది. దీంతో మిగతా విద్యార్థులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని సమీపంలోని ప్రైవేటు ఆప్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కాలేజ్‌కు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల చేతిలోకి మరణాయుధాలు ఎలా వచ్చాయనేదానిపై కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కొందరు విద్యార్థులు ఈ గొడవను తమ సెల్ఫోన్లలో రికార్డు చేశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతేడాది ఇదే కళాశాలకు చెందిన ముఖేష్ అనే విద్యార్థిని వండలూర్ సమీపంలో అతని స్నేహితుడు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. -
మదన్‌పై మరో ఫిర్యాదు
తమిళసినిమా: వేందర్ మూవీస్ నిర్మాత మదన్‌పై ఎస్ఆర్ఎం అధినేత పచ్చముత్తు తరఫున పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. మదన్ గత నెల 27న ఐదు పేజీల లేఖ రాసి మీడియాకు విడుదల చేసి కాశీలో ప్రాణాలు వదులుతానని చెప్పి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. ఎస్ఆర్ఎం కళాశాలలో విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తానంటూ వారి తల్లిదండ్రుల వద్ద ఫీజులు వసూలు చేసి ఆ డబ్బు అంతా కళాళాల నిర్వాహకానికి అప్పజెప్పినట్లు మదన్ లేఖలో పేర్కొన్న విషయం, తమకు ఎలాంటి డబ్బు అప్పగించలేదని కళాశాల అధినేత పచ్చముత్తు ఒక ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పచ్చముత్తు ఇంటి ముందు ఆందోళనకు దిగారు.అదే సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదన్ ఇద్దరు భార్యలు,తల్లి కూడా పోలీస్ కమిషనర్‌కు పిర్యాదు చేశారు. మదన్ కేసు ప్రస్తుతం మద్రాసు హైకోర్టులో ఉంది.హైకోర్టు ఆదేశాల మేరకు మదన్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసుల బృందం ఆయన కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. మదన్‌ను పోలీసులు పట్టుకున్నారని, రహస్యంగా విచారిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే మదన్ ఆచూకీ ఇంకా లభించలేదన్నది పోలీసులు అధికారికంగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్ఆర్ఎం కళాశాల అధినేత పచ్చముత్తు తరఫున బాలు అనే న్యాయవాది మంగళవారం పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో మదన్‌పై మరో ఫిర్యాదు చేశారు. అందులో చిత్ర నిర్మాత మదన్ ఎస్ఆర్ఎం కళాశాలలో సీటు ఇప్పిస్తానని చెప్పి 102 మంది వద్ద డబ్బు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు,పలు కోట్ల రూపాయలతో పరారయినట్లు పేర్కొన్నారు. అయితే అతని మోసానికి తమకు ఎలాంటి సంబంధం లేదని,తమ సంస్థ పేరును వాడుకుని మదన్ మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.