మోగిన రైల్వే సమ్మె సైరన్
చెన్నై: దేశ వ్యాప్త రైల్వే సమ్మెకు సైరన్ మోగింది. ఏప్రిల్ 11 నుంచి దేశ వ్యాప్తంగా రైల్వే సమ్మె చేయనున్నట్లు సదరన్ రైల్వే మజ్దూర్ యూనియన్(ఎస్ఆర్ఎంయూ) స్పష్టం చేసింది.
ఈ మేరకు రైల్వే కార్మికులంతా సిద్ధంగా ఉండాలని యూనియన్ పిలుపునిచ్చింది. దీంతో సమ్మెకు 45లక్షల మంది రైల్వే ఉద్యోగులు వెంటనే మద్దతు పలికారు.మొత్తం 36 అంశాల డిమాండ్లతో ఎస్ఆర్ఎంయూ సమ్మెకు దిగుతోంది.