srsp canaal
-
ఫీల్డ్ అసిస్టెంట్లపై అధికారుల కొరడా
సాక్షి, శంకరపట్నం: చెరువులు, కుంటల్లో ఫిష్‌పాండ్ పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. మండలం లోని 24 గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో ఫిష్ పాండ్, ఎస్సారెస్పీ కాలువ పూడితక తీత, హరిత హారంలో మొక్కల పెంపకం, పంట కాలువల త వ్వకం, కిచెన్షెడ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు పనులుచేశారు. మండలంలో11వేల పైచిలుకు జాబ్‌కార్డులు ఉన్నాయి. జాబ్‌కార్డులలో 26 వేలవరకు కూలీలు ఈ పథకంలో పనులు చేస్తున్నారు. 2017 ఆగస్టు నుంచి ఏడాదిలో చేపట్టిన పనులపై సోషల్ఆడిట్ నిర్వహించారు. ఫిబ్రవరి 18న సామాజిక తనిఖీ ప్రజావేదిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ ప్రజావేదికలో మండలంలో ఎక్కువ మొత్తంలో కూలీల కు అదనపు వేతనాలు చెల్లింపులు చేశారని నివేది క ఇచ్చారు. వెలుగులోకి అక్రమాలు.. ఫిష్‌పాండ్ నిర్మాణాల్లో కూలీలు చేసిన పనికి అద నంగా వేతనాలు చెల్లించేటట్లు కొలతలు తీశారని తేలింది. మండలంలోని కరీంపేట, కొత్తగట్టు, లింగాపూర్,రాజాపూర్, చింతలపల్లె, ధర్మారం, మెట్‌పెల్లి గ్రామల ఫీల్డ్‌అసిస్టెంట్లపై ఆరోపణలు రావడంతో సస్పెన్సన్ చేసినట్లు డీఆర్డీవో వెంకటేశ్వర్రావు ఆదేశాలు జారీచేశారు. మండలవ్యాప్తంగా రూ.15,95,844 చేసిన పనుల కంటే అత్యధికంగా కూలీలకు వేతనాలు చెల్లించినట్లు సోషల్ ఆడిట్లో వివరాలు వెల్లడయ్యాయి. కూలీల చేత పనులు చేయించాల్సిన ఫీల్డ్అసిస్టెంట్లు చేయని ప నులకు రూ. లక్షల్లో వేతనాలు చెల్లించడానికి కారుకులయ్యారని తేలింది. అత్యధికంగా కరీంపేటలో రూ.7.32 లక్షలు, చింతలపల్లెలో రూ.2.41 లక్షలు మెట్పల్లిలో రూ.1.13లక్షలు, కొత్తగట్టులో రూ.1. 10 లక్షలు, రాజాపూర్ రూ.32వేలు, లింగాపూర్ రూ.26వేలు అదనంగా కూలీలకు చెల్లించినట్లు తే లింది. మెట్పల్లి ఫీల్డ్అసిస్టెంట్ స్రవంతి భర్త మధు ఉపాధిహామీ పనులు చేయకున్నా పనులు చేసినట్లు రూ.19వేల వేతనం చెల్లింపులు చేసినందుకు గతనెల 18న సస్పెన్సన్ చేసిన విషయం విధిత మే. ఉపాధిహామీ పథకంలో అక్రమలు వెలుగు చూడడంతో కరీంపేట ఫీల్డ్అసిస్టెంట్ సల్మా, కొత్తగట్టు ఫీల్డ్అసిస్టెంట్ కలీషా, చింతలపల్లె చంద్రమౌళి, లింగాపూర్ ఫీల్డ్అసిస్టెంట్ రవి, ధర్మారం ఫీల్డ్అసిస్టెంట్ శంకర్, రాజాపూర్ ఫీల్డ్అసిస్టెంట్ ప్రభాకర్‌ను సస్పెన్సన్ చేస్తూ డీఆర్డీవో ఆదేశాలు జారీచేయడం సంచలనం కలిగించింది. రూ.15 లక్షల రికవరీ.. ఉపాధిహామీ పథకంలో కూలీలకు అదనంగా వేతనాలు చెల్లింపులు చేయడానికి కారణమైన ఫీల్డ్అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, జేఈల నుంచి రూ. 15,95,844 రికవరీ చేసేందుకు నోటీసులు జారీచేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే సస్పెన్సన్‌కు గురైన ఫీల్డ్అసిస్టెంట్లు 14 రోజుల్లో వివరణ ఇవ్వా లని డీఆర్డీవో జారీచేసిన మెమోలో సమాచారం అందించారు. -
కొంప ముంచిన కక్కుర్తి!
ఎస్సారెస్పీ కాలువకు గండి వానకు కొట్టుకుపోయిన మట్టి నాణ్యత లోపాలే కారణం కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం పనులు పర్యవేక్షించని అధికార యంత్రాంగం సాక్షిప్రతినిధి, వరంగల్ : ఆధునీకరణలో భాగంగా ఎస్సారెస్పీ కాలువను పటిష్టం చేసే పనులు చేపట్టారు. గతంలో ఉన్న కాలువల మట్టి కొంత తీసి నాణ్యమైన మట్టిని పోయాల్సి ఉంది. కాంట్రాక్టర్ బయటి నుంచి మట్టిని తెచ్చి ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో ఆ మట్టి కొట్టుకుపోయి గండి పడిందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. భారీ వర్షాలు.. కొన్నిసార్లు అభివృద్ధి పనుల నాణ్యత లోపాలను కనిపించకుండా చేస్తాయి. ఇటీవల కురిసిన వర్షాలు మాత్రం పనుల్లో అక్రమాలను బహిర్గతం చేశాయి. దశాబ్దాలుగా భారీ వరదలను తట్టుకుని నిలిచిన కాలువ తాజా భారీ వర్షాలకు గండిపడడం... అదీ మరమ్మతులు చేసిన తర్వాత జరగడం నాణ్యత లోపాలను వెల్లడిస్తోంది. నాణ్యత లోపాల కారణంగా కాలువకు గండి పడిందని సాగునీటి శాఖ ఇంజనీర్లే చెబుతున్నారు. గండి పడిన ప్రాంతంలో చేపట్టిన పనులను ఇంజనీర్లు పర్యవేక్షించలేదని తెలుస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని జిల్లా వరకు సరఫరా చేసే ప్రధాన కాలువల్లో నిర్దేశిత సామర్థ్యం మేరకు నీటి సరఫరా జరగడం లేదు. కాలువలు పటిష్టంగా లేకపోవడం, నిర్మించి 15 ఏళ్లు పూర్తి కావడంతో సరిపడా నీటిని సరఫరా చేయలేక పోతున్నామని ఇంజనీర్ల చెప్పడంతో ప్రభుత్వం కోట్ల రుపాయలతో అధునీకరణ పనులను చేపట్టింది. ఈ పనులు పూర్తి చేశాక కూడా కాలువకు గండి పడడం అనేక విమర్శలకు తావిస్తోంది. పనులు జరిగిన సమయంలో ఇంజనీరింగ్ అధికారులు నాణ్యత ప్రమాణాలు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలువకు కుడివైపు 5 మీటర్లు, ఎడమ వైపు 7మీటర్ల వెడల్పుతో పటిష్టం చేసే పనులు చేపట్టారు. గతంలో ఉన్న కాలువల మట్టి కొంత మేరకు తీసి ప్రమాణాలు కలిగిన మట్టిని పోయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా బయటి నుంచి మట్టిని తెచ్చి పటిష్టానికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో మట్టి కొట్టుకుపోయి గండి పడిందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాలువ పటిష్టత కోసం మట్టిని లేయర్లుగా పోస్తూ, నీటిని చల్లుతూ, రోలింగ్ చేయాల్సి ఉండగా... నిధులు కొంత మిగిల్చికోవాలన్న ఉద్దేశంతో మొత్తం మట్టిని ఒకేసారి పోసి రోలింగ్ చేసినట్లు తెలిసింది. దీని వల్ల అడుగు భాగంలో గట్టిగా లేక మట్టి గుళ్లగా మారి భారీ వర్షాలకు కొట్టుకుపోయిందని తెలుస్తోంది. అధికారులు మాత్రం నాణ్యత లోపాలపై దృష్టి పడకుండా వ్యవహరిస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువై సీపేజీ(ఊట) రావడంతోనే ఇలా గండి పడిందని అంటున్నారు. ‘మూడో ప్యాకేజీ’లో గండి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) ప్రధాన కాలువను పటిష్ట పరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్దేశిత సామర్థ్యం మేరకు ఎస్సారెస్పీ నీటి సరఫరా జరిగేలా కాకతీయ ప్రధాన కాల్వను మరమ్మతు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించారు. కాలువలోని 191 కిలోమీటరు నుంచి 234 కిలోమీటరు వరకు పటిష్ట పరిచేందుకు రూ.60 కోట్లు అవవసరమని రూపొందించిన అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పనులను నాలుగు ప్యాకేజీలుగా చేపట్టేందుకు అధికారులు టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. కాకతీయ కాలువ 191 కిలో మీటరు నుంచి 201 కిలో మీటరు, 201 కిలో మీటరు నుంచి 209 కిలో మీటరు, 209 కిలో మీటరు నుంచి 226 కిలో మీటరు, 226 కిలో మీటరు నుంచి 234 కిలో మీటరు ప్యాకేజీలు విభజించి టెండర్లు పూర్తి చేశారు. ఎండా కాలంలో నాలుగు ప్యాకేజీల్లో పనులు పూర్తి చేశారు. మూడో ప్యాకేజీగా పేర్కొన్న 209 కిలో మీటరు నుంచి 226 కిలో మీటరు కాలువకు బుధవారం గండి పడింది. ఎస్సారెస్పీ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుధాకర్‌రెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గండిని మట్టితో పూడ్చినప్పటికీ ప్రవాహం ఎక్కువ అవుతుండడంతో కాలువ కట్ట తెగే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఇసుక బస్తాలతో కట్ట ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.