srushty
-
రైతు శాస్త్రవేత్త విజయకుమార్‌కు ‘సృష్టి సమ్మాన్’ పురస్కారం!
చిరుధాన్య పంటల జీవవైవిధ్యానికి విశేష కృషి చేస్తున్న వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రముఖ సేంద్రియ రైతు శాస్త్రవేత్త కొమ్మూరి విజయకుమార్(60)కు ప్రతిష్టాత్మక ‘సృష్టి సమ్మాన్’ పురస్కారం లభించింది. అహ్మదాబాద్‌లోని భగవత్ విద్యాపీఠంలో ఈ నెల 23 నుంచి 26 వరకు జరుగుతున్న సాత్విక్ సంప్రదాయక ఆహారోత్సవంలో సోమవారం విజయకుమార్‌కు గుజరాత్ మాజీ ప్రధాన కార్యదర్శి పి.కె. లహరి, ఐఐఎం అహ్మదాబాద్ డైరెక్టర్ భరత్ భాస్కర్, అహ్మదాబాద్ ఐఐఎం మాజీ ఆచార్యులు ప్రొ. అనిల్ కె గుప్తా జీవవైవిధ్యం విభాగంలో సృష్టి సమ్మాన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రొ.అనిల్ కె గుప్తా నెలకొల్పిన సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇనీషియేటివ్స్ ఫర్ సస్టయినబుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ (సృష్టి) సంస్థ 1995 నుంచి ప్రతి ఏటా గ్రామీణ రైతు శాస్త్రవేత్తలు, జీవవైవిధ్యం పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు జాతీయ స్థాయిలో సృష్టి సమ్మాన్ పురస్కారాలు ప్రదానం చేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలోని ఈవీ పల్లె గ్రామంలో పుట్టిన కొమ్మూరి విజయకుమార్ వర్షాధార భూముల్లో సేంద్రియ పద్ధతుల్లో చిరుధాన్యాల సాగును పునరుద్ధరించటానికి విశేష కృషి చేస్తున్నారు. చిరుధాన్యాల విత్తనాలను అనేక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులకు ఉచితంగా పంపిణీ చేయటం ద్వారా తిరిగి చిరుధాన్యాల సంప్రదాయ సేంద్రియ సాగు వ్యాప్తికి కృషి చేశారు. స్థానికంగా లభించే అనేక మొక్కల వినూత్న కషాయాలను రూపొందించి రైతులకు అందిస్తూ సేంద్రియ వ్యవసాయంలో అనేక పంటలను ఆశించే చీడపీడల నియంత్రణకు విజయకుమార్ కృషి చేస్తున్నారు. ఆయన కృషిపై గత దశాబ్దకాలంగా అనేక కథనాలు ‘సాక్షి సాగుబడి’ పాఠకులకు సుపరిచితమే. ఆయనకు గతంలో బళ్లారికి చెందిన సఖి ట్రస్ట్, రైతునేస్తం ఫౌండేషన్ పురస్కారాలు లభించాయి. గతంలో ‘సృష్టి సమ్మాన్’ పురస్కారం అందుకున్న వారిలో ఖమ్మంకు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత దరిపల్లి రామయ్య కూడా ఉన్నారు. (చదవండి: అరుదుగా కనిపించే భారీ నిమ్మకాయలు.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!) -
అందరూ కనెక్ట్ అవుతారు
‘‘నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్గార్ల యాక్టింగ్ అంటే ఇష్టం. ముఖ్యంగా నాగార్జున మేనరిజానికి అభిమానిని నేను’’ అని నూతన హీరో భరత్ మార్గాని అన్నారు. సత్య చల్లకోటి దర్శకత్వంలో భరత్ మార్గాని, సృష్టి జంటగా వంశీకష్ణ శ్రీనివాస్ నిర్మించిన సినిమా ‘ఓయ్.. నిన్నే’. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. భరత్ మాట్లాడుతూ – ‘‘వైజాగ్ సత్యానంద్ మాస్టర్ దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాను. కాలేజ్ డేస్‌లో మోడలింగ్ చేసేవాణ్ణి. అలా హీరోగా ఛాన్స్ వచ్చింది. బిజినెస్ ఉండటం వల్ల నేను ఇండస్ట్రీలోకి రావడానికి ముందు మా అమ్మా నాన్న ఒప్పుకోకపోయినా ఇప్పుడు హీరో అయినందుకు హ్యాపీగా ఉన్నారు. ‘ఓయ్.. నిన్నే’ బావామరదళ్ల కథ. సినిమాలో తండ్రికీ కొడుక్కీ మధ్య అభిప్రాయభేదాలుంటాయి. కానీ తండ్రంటే గౌరవం. ఆ గౌరవం వల్ల ప్రేమను వదులుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. బావ తన మరదలి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది తెరపైనే చూడాలి. అవుట్‌పుట్ బాగా వచ్చింది. అందరూ కనెక్ట్ అవుతారు’’ అన్నారు. -
బొమ్మరిల్లు, సోలో చిత్రాలను మించిన విజయం!
‘‘మా సంస్థ నుంచి వచ్చిన సోలో, నువ్వా నేనా, రారా.. కృష్ణయ్య’ తరహాలో చక్కని కుటుంబ కథాచిత్రమిది. సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది’’ అని వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. భరత్ మార్గాని, సృష్టి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో ఎస్వీకె సినిమా పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘ఓయ్.. నిన్నే’. వచ్చే నెల 6న ఈ చిత్రం విడుదల కానుంది. వంశీకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఇందులో హీరోది ముక్కుసూటి మనస్తత్వం. అది కొన్నిసార్లు ప్లస్, ఇంకొన్నిసార్లు మైనస్ అవుతుంటుంది. అటువంటి మనస్తత్వం వల్ల తండ్రితో ఎలాంటి అభిప్రాయభేదాలు వచ్చాయి? మరదలికి, అతనికి మధ్య ఎవరు అడ్డు వచ్చారు? అనేది చిత్రకథ. కొందరు సినీ ప్రముఖులకు సినిమాని చూపిస్తే ‘బొమ్మరిల్లు’, ‘సోలో’ సినిమాలకు మించిన విజయం సాధిస్తుందన్నారు’’ అని చెప్పారు. -
బొమ్మరిల్లులా...
భరత్ మార్గాని, సృష్టి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో ఎస్.వి.కె. సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘ఓయ్.. నిన్నే’. ఈ నెల 15న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘మా సంస్థ గతంలో నిర్మించిన ‘సోలో, నువ్వా నేనా, రారా కృష్ణయ్య’ తరహాలో చక్కటి కుటుంబ కథా చిత్రమిది. తండ్రీకొడుకుల అనుబంధం, బావామరదళ్ల మధ్య ప్రేమకథతో దర్శకుడు చిత్రాన్ని బాగా తీర్చిదిద్దారు’’ అన్నారు నిర్మాత. ‘‘ముక్కుసూటి మనస్తత్వం వల్ల ఓ కుర్రాడికి అతని తండ్రితో ఎలాంటి అభిప్రాయ బేధాలొచ్చాయి? మరదలికి, అతనికి మధ్య విలన్లా అడ్డొచ్చింది ఎవరు? అనేది చిత్రకథ. ‘బొమ్మరిల్లు’లా క్లీన్ ఫ్యామిలీ ఫిల్మ్’’ అన్నారు దర్శకుడు. తనికెళ్ల భరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, ‘తాగుబోతు’ రమేశ్, తులసి, ప్రగతి, ధనరాజ్ నటించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి. -
ఆ సినిమాల్లా ‘ఓయ్.. నిన్నే’ కూడా హిట్టవ్వాలి
– మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ‘తెలుగు చిత్రపరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్, దాసరి సహా ఎందరో వేసిన దారి ఇప్పుడు ఎంతో బాగుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న చిత్రపరిశ్రమకు కొత్త నటీనటులు రావాల్సిన అవసరం ఉంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. భరత్, సృష్టి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా ‘ఓయ్.. నిన్నే’. శేఖర్‌చంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తలసాని మాట్లాడుతూ– ‘‘బాహుబలి, శ్రీమంతుడు’ నుంచి ఈ మధ్య విడుదలైన ‘ఫిదా’వరకు మంచి సినిమాలు వస్తూ, ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అదే కోవలో ‘ఓయ్.. నిన్నే’ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో వచ్చిన సినిమాల్లో ‘సోలో’ నాకు బాగా నచ్చింది. ‘ఓయ్ నిన్నే’ చిత్రం ‘సోలో’ సినిమా కంటే బాగుంటుంది’’ అన్నారు నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్. చిత్రదర్శకుడు సత్య చల్లకోటి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శేఖర్‌చంద్ర, సృష్టి, దర్శకులు అనిల్ రావిపూడి, చంద్రసిద్ధార్థ్, రచయిత కోన వెంకట్, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, కృష్ణచైతన్య పాల్గొన్నారు.