అందుకే చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నాం
హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా హామీని పక్కదారి పట్టించేందుకు అధికార టీడీపీ, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్. శైలజానాథ్ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో శైలజానాథ్ విలేకర్లతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా అంశాన్ని ఆ పార్టీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నాయని విమర్శించారు.
అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఆయా పార్టీల నాయకులపై చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నాయని... అందువల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. విభజన చట్టం ప్రకారం వెనకబడిన జిల్లా అభివృద్ధి కోసం ప్యాకేజీ కింద రూ. 24 వేల విడుదల చేయాలని శైలజానాథ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.