ఉత్తుత్తి ప్రచారం ఎస్సీ, ఎస్టీకి నో ఎలక్ట్రిసిటీ
సాక్షి, సంగారెడ్డి: ‘ఇందిరమ్మ కలలు’ పథకం కింద ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు కేటాయిస్తున్న బడ్జెట్ నుంచి పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాల విద్యుత్ బిల్లులు చెల్లించి నేరుగా ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి 31 నాటి వరకు గల పాత బకాయిలతో పాటు ఆ తర్వాత కాలానికి సంబంధించిన బిల్లులు చెల్లించడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, అర్హులైన లబ్ధిదారులను గుర్తించకుండా ఆ బాధ్యతను విద్యుత్ శాఖపై నెట్టేసింది. కులాల ప్రాతిపదికన వినియోగదారుల సమాచారం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఏఈ, ఏడీఈల ద్వారా విద్యుత్ శాఖ సర్వే జరిపించి జాబితాలను రూపొందించింది. కేవలం తహశీల్దార్లు, వీఆర్వోలు జారీ చేసిన ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలను పరిగణలోకి తీసుకుని జాబితాను తయారు చేశారు.