staff suspended
-
‘గాంధీ’లో ఇద్దరు ఉద్యోగుల తొలగింపు
⇔ ‘బొమ్మ సైకిల్’ ఘటనకుగానూ సస్పెన్షన్ వేటు హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఓ పేషెంట్ ను ఇబ్బందులకు గురిచేసినందుకుగానూ ఇద్దరు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పేషెంట్ రాజుకు వీల్ చైర్ ఇవ్వడానికి డబ్బు డిమాండ్ చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనలో ఇద్దరు సిబ్బందిని ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ విధుల నుంచి తొలగించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులైన పి.వెంకటరత్నం, ఎస్.మహేంద్రబాయిలను సూపరింటెండెంట్ తొలగించి... వెంటనే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. గురువారం వీల్ చైర్ ఇవ్వక పోవడంతోపాటు రూ. 150 లంచం డిమాండ్ చేయడంతో పేషెంట్ రాజుని ‘బొమ్మ సైకిల్’ పై డాక్టర్ వార్డుకు తీసుకెళ్లారు. ఈ సంఘటనను ఈనెల 17న ‘హేరాం..ఎంతటి దైన్యం’శీర్షికన ‘సాక్షి’ ప్రచురించింది. దీన్ని చదివిన గవర్నర్ వివరణ ఇవ్వాలని వైద్యశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు మంత్రి కేటీఆర్ ఆ పేషెంట్ వివరాలను తెలపితే తమకు తోచిన సాయం అందిస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండ్ తో చర్చించిన అనంతరం ట్వీట్ చేశారు. మరోవైపు వీల్‌చైర్ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమణి ఇదివరకే తెలిపారు. -
ఖైదీల పరారీ: జైలు సిబ్బందిపై వేటు
వరంగల్: సంచలన రీతిలో వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఖైదీలు పరారైన సంఘటనలో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సైనిక సింగ్, బీహార్‌కు చెందిన రాజేష్ యాదవ్ అనే ఇద్దరు ఖైదీలు శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జైలు గోడ దూకి పరారుకాగా, జైలు సిబ్బందే ఖైదీలకు సహకరిచారనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం ఇద్దరు సిబ్బందిపై సస్సెన్షన్ వేటు వేశారు. ఘనట వెలుగు చూసిననాడే జైల్ సూపరింటెండెంట్ న్యూటన్ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దుప్పట్ల సహాయంతో జైలు గోడ దూకి పరారైన ఖైదీల కోసం వరంగల్ అర్బన్ పోలీస్‌లు గాలిస్తున్నారు. కాగా, జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు అనారోగ్యం పేరుతో పెరోల్ మీద బయటకు వెళ్లేందుకు సహకరిస్తోన్న ఇద్దరు నర్సింగ్ సిబ్బందితోపాటు ఎంజీఎం, కేఎంసీకి చెందిన ఇద్దరు డాక్టర్లపై జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు వైద్యులపై మట్టెవాడ పోలీసులు కేసులు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.