‘గాంధీ’లో ఇద్దరు ఉద్యోగుల తొలగింపు | Gandhi Hospital staff two members suspended | Sakshi
Sakshi News home page

‘గాంధీ’లో ఇద్దరు ఉద్యోగుల తొలగింపు

Published Sat, Mar 18 2017 7:24 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM

‘గాంధీ’లో ఇద్దరు ఉద్యోగుల తొలగింపు

‘గాంధీ’లో ఇద్దరు ఉద్యోగుల తొలగింపు

‘బొమ్మ సైకిల్’  ఘటనకుగానూ సస్పెన్షన్ వేటు
హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో ఓ పేషెంట్‍ ను ఇబ్బందులకు గురిచేసినందుకుగానూ ఇద్దరు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పేషెంట్ రాజుకు వీల్ చైర్ ఇవ్వడానికి డబ్బు డిమాండ్ చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనలో ఇద్దరు సిబ్బందిని ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ విధుల నుంచి తొలగించారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులైన పి.వెంకటరత్నం, ఎస్‌.మహేంద్రబాయిలను సూపరింటెండెంట్‌ తొలగించి... వెంటనే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించారు.

గురువారం వీల్ చైర్ ఇవ్వక పోవడంతోపాటు రూ. 150 లంచం డిమాండ్ చేయడంతో పేషెంట్ రాజుని ‘బొమ్మ సైకిల్’ పై డాక్టర్ వార్డుకు తీసుకెళ్లారు. ఈ సంఘటనను ఈనెల 17న ‘హేరాం..ఎంతటి దైన్యం’శీర్షికన ‘సాక్షి’ ప్రచురించింది. దీన్ని చదివిన గవర్నర్‌ వివరణ ఇవ్వాలని వైద్యశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు మంత్రి కేటీఆర్ ఆ పేషెంట్ వివరాలను తెలపితే తమకు తోచిన సాయం అందిస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండ్ తో చర్చించిన అనంతరం ట్వీట్ చేశారు. మరోవైపు వీల్‌చైర్‌ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించామని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమణి ఇదివరకే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement