Stained grain
-
ధాన్యం తడిసిందని.. మహిళా రైతు బలవన్మరణం
ఆత్మకూర్/నేలకొండపల్లి: కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకోగా.. నెలరోజులైనా కాంటా వేయలేదని మనస్తాపానికి గురైన మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వనపర్తి, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం జూరాలకు చెందిన పద్మ (36) మూడెకరాల పొలంలో వరి సాగుచేశారు. వారం రోజులు ధాన్యం ఆరబెట్టి గ్రామంలో ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రంలో 15 రోజుల క్రితం తూకం వేయించారు. కొనుగోలు చేసి న ధాన్యం తరలించే వరకు రైతులదే బాధ్య త అని చెప్పడంతో రేయింబవళ్లు ధాన్యం బస్తాల వద్దే ఆమె కాపలా కాసింది. ఈనెల 16, 17 తేదీల్లో కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయింది. ఇంకెన్ని రోజులు ఇలా కాపలా కాయా లంటూ ఐకేపీ నిర్వాహ కులతో సోమవారం సాయంత్రం వాగ్వాదానికి దిగింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. మంగళవారం తెల్లవారుజామున ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం చెందింది. నెలరోజులైనా కాంటా వేయలేదని.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కౌలు రైతు గడ్డం లింగయ్య నెల రోజుల క్రితం మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని తీసుకొచ్చా డు. ధాన్యాన్ని ఆరబెట్టి ప్రతిరోజు కాపలా కాస్తూ తనకిచ్చిన సీరియల్ నంబరు ప్రకా రం కాంటా వేయించుకునేందుకు ఎదురుచూస్తున్నాడు. అయితే తనకంటే వెనుక తీసుకొచ్చిన దళారుల ధాన్యాన్ని మాత్రం కాంటా వేస్తున్నారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేని లింగయ్య తీవ్ర మనస్తాపంతో మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి రైతులు అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇలా రోజుల తరబడి తిప్పించుకోవడం ఏమిటని ఆగ్రహించిన రైతులు తహసీల్దార్ కార్యాల యం ఎదుట ధర్నా చేశారు. ఇకపై వేగంగా కాంటాల ప్రక్రియ పూర్తి చేయిస్తామని తహసీల్దార్ హామీనివ్వడంతో వారు ఆందోళన విరమించారు. చదవండి: స్ఫూర్తిమంతంగా నిలిచిన మహిళా సర్పంచ్ -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి సెగ్గెం రాజేశ్ మల్హర్: మండలంలో బుధవారం కురిసిన వర్షానికి తడిసిన ధాన్యా న్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి సెగ్గెం రాజేశ్ కోరారు. మండలంలోని రుద్రారం కొనుగోలు కేం ద్రంతోపాటు నేలవాలిన పంటను పరి శీలించి, రైతులను పరామర్శించారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న మద్దతు ధర ఏ మాత్రం సరిపోదని.. మరింత పెంచాలని డిమాండ్ చేశారు. ఎరువుల ధరలకనుగూనంగా మద్దతు ధర పెం చాలని కోరారు. అకాల వర్షంతో నష్టపోరుున రైతులకు పరిహారం అందించాలని కోరారు. అంతేకాకుం డా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. అకాలవర్షంతో పంట నష్టపోరుున రైతులకు పరిహారం చెల్లించకుంటే ఆందోళన చేయనున్నట్లు హెచ్చరించారు. -
తడిసిన ధాన్యమూ కొనుగోలు
కలెక్టరేట్,న్యూస్‌లైన్: తడిసిన ధాన్యంపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం క్వింటాలుకు రూ. 1,345 చెల్లించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడా రు. జిల్లాలో కురిసిన అకా ల వర్షాల వల్ల కొన్ని ప్రాం తాల్లో రబీ ధాన్యం తడిసి ముద్దయ్యిందన్నారు. అదేవిధంగా వారం రోజులుగా రైస్‌మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయక పోవడంపై వారిని పిలిపించి మాట్లాడినట్లు తెలిపారు. ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతులు టోల్‌ఫ్రీ 18004256644, ల్యాండ్ 08462-221801 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 28,990 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మరో వంద కొనుగోలు కేంద్రాలు మోర్తాడ్ : వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా మరో వంద కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి కొండల్ రావు తెలిపారు. ఆదివారం మోర్తాడ్, దోన్పాల్లలో తడిసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఇందిర క్రాంతి పథం ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్న కొనుగోలు కేంద్రాలకు అదనంగా మరో వంద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ అంగీకరించారని ఆయన తెలిపారు. అవసరం ఉన్న చోట ఆయా గ్రామాల మిహ ళా సమాఖ్యలు ప్రతిపాదనలు పంపితే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు నష్టపోకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడైనా లారీల కొరత, గన్నీ సంచుల కొరత ఉన్నా జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ సెల్ నంబర్ 7702003545కు ఫోన్ చేయాలన్నారు. 17 శాతం తేమ ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులు దళారులకు ధాన్యం అమ్మి నష్టపోవద్దని ఆయన కోరారు.