తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సెగ్గెం రాజేశ్
మల్హర్: మండలంలో బుధవారం కురిసిన వర్షానికి తడిసిన ధాన్యా న్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సెగ్గెం రాజేశ్ కోరారు. మండలంలోని రుద్రారం కొనుగోలు కేం ద్రంతోపాటు నేలవాలిన పంటను పరి శీలించి, రైతులను పరామర్శించారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న మద్దతు ధర ఏ మాత్రం సరిపోదని.. మరింత పెంచాలని డిమాండ్ చేశారు.
ఎరువుల ధరలకనుగూనంగా మద్దతు ధర పెం చాలని కోరారు. అకాల వర్షంతో నష్టపోరుున రైతులకు పరిహారం అందించాలని కోరారు. అంతేకాకుం డా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. అకాలవర్షంతో పంట నష్టపోరుున రైతులకు పరిహారం చెల్లించకుంటే ఆందోళన చేయనున్నట్లు హెచ్చరించారు.