stalemate
-
కరోనా: రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు
సాక్షి, నూఢిల్లీ : భారత దేశ పౌరులు దేశవ్యాప్తంగా సంచరించే స్వేచ్ఛను దేశ రాజ్యాంగం కల్పించింది. అయితే మనదీ సమాఖ్య దేశం అవడం వల్ల రాష్ట్రాలకన్నా కేంద్రానికి ఎక్కువ హక్కులు ఉంటాయి. ప్రాణాంతకమైన కరోనా వైరస్ దేశంలోకి కూడా వచ్చిందన్న వార్తలతో మొట్టమొదటగా స్పందించిన సిక్కిం రాష్ట్రం మార్చి 16వ తేదీన తన రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. మార్చి 20వ తేదీన తమిళనాడు మూసివేసింది. మార్చి 21న ప్రకటించిన కర్ఫ్యూను తెలంగాణ కొనసాగించి తన సరిహద్దులను మూసివేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో మార్చి 24వ తేదీ నుంచి దేశంలోని రాష్ట్రాలన్నీ తమ సరిహద్దులను మూసివేశాయి. అంతర్జాతీయ సరిహద్దుల్లాగా దేశ అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేయడం స్వాతంత్య్ర భారత దేశంలో ఇదే తొలిసారి. (దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేత!) సరిహద్దుల మూసివేత కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో మానవుల అక్రమ రవాణా మొదలయింది. హర్యానా–ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో వలస కార్మికులు యమునా నది దాటేందుకు ప్రమాదకరమైన రబ్బర్ ట్యూబ్‌లను వినియోగించారు. మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దుల్లో పెన్‌గంగను దాటేందుకు వలస కార్మికులు ఇలాంటి దుస్సాహసాలకే పాల్పడ్డారు. మహారాష్ట్ర–గుజరాత్ సరిహద్దుల్లో వలస కార్మికులు బారీ ఖాళీ పాల క్యాన్లలో దాక్కొని వెళుతూ పట్టుపడ్డారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను ‘కానిఫ్లిక్ట్ జోన్స్’గా మీడియా అభివర్ణించడం కేరళ–కర్ణాటక సరిహద్దు విషయంలో నిజమైంది. కేరళలోని కాసర్గాడ్ జిల్లాను కర్ణాటకలోని మంగళూరుకు కలిపి జాతీయ రహదారిని కర్ణాటక మూసివేసింది. కాసర్గాడ్ ఉత్తర కేరళలోని కేవలం 13 లక్షల జనాభా కలిగిన చిన్న జిల్లా అయినప్పటికే అప్పటికే అక్కడ 20 కోవిడ్ కేసులు నమోదు కావడంతో కర్ణాటక అక్కడి నుంచి ఎవరిని అనుమతించకుండా ఈ చర్య తీసుకుంది. సార్వభౌమాధికార దేశాల్లోలాగా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూయడం భారత్‌లో చెల్లదని, పైగా కేరళ, కర్ణాటక రాష్ట్రాలు భారత్, పాకిస్థాన్ దేశాల్లో విడి విడిగా లేవని కేరళ విమర్శించింది. రోడ్డుపై ఎర్రమట్టి కుప్పలను పోయడం తమ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నంగా కూడా ఆరోపిస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ‘దేశ సార్వభౌమాధికారం లేదా సమగ్రత కోసం ప్రజల కదలికలపై ఆంక్షలు విధించవచ్చుగానీ ఈ రీతిగా బ్యారికేడ్లు పెట్టి ప్రజా కదలికలను నియంత్రించడానికి వీల్లేదు. భారత రాజ్యాంగంలోకి 19 (1)(డీ) సెక్షన్ ప్రకారం ప్రజలు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లవచ్చు, తిరగవచ్చు. ఈ రాజ్యాంగ స్ఫూర్తిని కర్ణాటక ప్రభుత్వం గౌరవించాల్సిందే. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కర్ణాటక చేత సరిహద్దులు తెరిపించాలి’ అంటూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. సరిహద్దులను అలా మూసి ఉంచాల్సిందేనంటూ ఆ మరుసటి రోజు కర్ణాటక సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి వ్యాఖ్యానించగా సోషల్ మీడియాలో ఆయనకు తెగ మద్దతురావడం గమనార్హం. ఇలాంటి గొడవలు రాష్ట్రాల మధ్య కొత్త వివాదాలకు దారి తీసే ప్రమాదం ఉంది. (కరోనా: బయటికొస్తే బండి సీజే!) -
ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించలేదు
న్యూఢిల్లీ/ముంబై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 26 రోజులు గడుస్తున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న శివసేన ఆశలు నెరవేరడం లేదు. తాజాగా, ఢిల్లీలో ప్రెస్మీట్లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఈ మూడు పార్టీల మధ్య పొత్తు దిశగా అడుగులు పడటం లేదనే సంకేతాలిస్తున్నాయి. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఢిల్లీలో సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సమావేశమయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుపై ఆమెతో చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితిని సోనియాకు వివరించానన్నారు. ‘మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వివరంగా చర్చించాం. మహారాష్ట్రలో పరిస్థితులను నిశితంగా గమనిస్తుంటాం. భవిష్యత్ కార్యాచరణపై ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు చర్చలు కొనసాగిస్తారు’ అని పవార్ వివరించారు. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మద్దతిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేసిన పవార్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తమ ప్రధాన ప్రత్యర్థి అన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘బీజేపీ, శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదో ఆ పార్టీలనే అడగండి’ అన్నారు. పవార్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేవని, ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నామనేదే పవార్ వ్యాఖ్యల అర్థం అని పలువురు విశ్లేషిస్తున్నారు. మరోవైపు, రాజకీయాల్లో ఆరితేరిన పవార్.. పొత్తు చర్చల్లో శివసేనపై ఒత్తిడి తెచ్చి, కొత్త ప్రభుత్వంలో పై చేయి సాధించేందుకే ఇలా వ్యాఖ్యానించారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పవార్ తాజా వ్యాఖ్యలపై శివసేన స్పందించలేదు. కానీ, పవార్ నివాసంలో ఆయనతో శివసేన నేత సంజయ్‌రౌత్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘త్వరలో శివసేన నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది’ అని అన్నారు. మహారాష్ట్ర రైతుల సమస్యలపై ప్రధాని మోదీని కలిసే అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహించాలని కోరేందుకు పవార్‌ను కలిశానన్నారు. ఇదిలా ఉండగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభలో వ్యవహరించే తీరుపై ఎన్సీపీపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. పార్లమెంట్లో శివసేన సభ్యులకు విపక్ష సభ్యుల వైపు స్థానాలు కేటాయించడంపై సేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ‘ఎన్డీఏ ప్రభుత్వం ఏ ఒక్క పార్టీ సొత్తో కాదు. కానీ, కొందరు తమను తాము దేవుళ్లుగా భావిస్తుంటారు’ అని వ్యాఖ్యానించారు. నవంబర్ 24న అయోధ్య వెళ్లాలనుకున్న శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే.. తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. -
‘శివ’సైనికుడే సీఎం
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి వారం గడిచినా.. మెజారిటీ సాధించిన మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య అధికారం పంపిణీపై అవగాహన కుదరకపోవడంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. నవంబర్ 7వ తేదీలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడనట్టయితే రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందని బీజేపీ నేత, ఆర్థికమంత్రి ముంగంతివార్ పేర్కొన్నారు. ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి నవంబర్ 8వ తేదీతో ముగుస్తుంది. దీపావళి పండుగ కారణంగా శివసేన, బీజేపీల మధ్య చర్చలు ప్రారంభం కాలేదని, ఒకట్రెండు రోజుల్లో అవి ప్రారంభమవుతాయని ముంగంటివార్ తెలిపారు. ఏ ఒక్క పార్టీకో అనుకూలంగా ప్రజలు తీర్పునివ్వలేదని, బీజేపీ, సేన కూటమికి వారు మద్దతిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ‘మా కూటమి ఫెవికాల్ కన్నా, అంబుజా సిమెంట్ కన్నా దృఢమైనది’అని వ్యాఖ్యానించారు. మరోవైపు, శివసేన వ్యక్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడంటూ సేన నేత సంజయ్ రౌత్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ‘సేన కోరుకుంటే.. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సభ్యుల మద్దతు కూడగట్టుకోగలదు’అన్నారు. అధికారాన్ని సమంగా పంచుకోవాలనే ప్రతిపాదనకే మహారాష్ట్ర ప్రజలు ఓటేశారన్నారు. అతివృష్టితో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందాల్సి ఉందని శివసేన పత్రిక సామ్నా పేర్కొంది. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తాం ఒకవేళ బీజేపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైతే.. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు తాముప్రయత్నిస్తామని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. మరోవైపు, అదే పార్టీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మాత్రం.. ప్రతిపక్షంలో కూర్చోమనే ప్రజలు తీర్పిచ్చారని, తాము అదే పాటిస్తామని వక్కాణించారు. గురువారం రాత్రి శరద్‌పవార్ నివాసంలో ఎన్సీపీ నేతల భేటీ అనంతరం అజిత్ పవార్ పై వ్యాఖ్యలు చేశారు. అది బీజేపీ, శివసేన డ్రామా బీజేపీ, శివసేన డ్రామాలో పావు కావద్దొని కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేత సంజయ నిరుపమ్ సూచించారు. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతివ్వాలన్న కాంగ్రెస్ ఆలోచనను ఆయన తప్పుబట్టారు. బీజేపీ, శివసేనల మధ్య విభేదాలను ‘అధికారంలో ఎక్కువ వాటా కోసం ఆడుతున్న తాత్కాలిక డ్రామా’అని ఆయన అభివర్ణించారు. ‘బీజేపీ నీడ నుంచి శివసేన ఎన్నటికీ బయటకు రాదు’అని కాంగ్రెస్‌లో చేరకముందు శివసేనలో కీలక నేతగా వ్యవహరించిన సంజయ్ వ్యాఖ్యానించారు. పొత్తు తేలే దాకా నేనే సీఎం! ఔరంగాబాద్: రాజకీయ అనిశ్చితి కొనసా గుతున్న మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బీజేపీ, శివసేనల మధ్య ఒప్పందం కుదిరేవరకూ తనను ముఖ్యమంత్రిగా చేయాలని ఓ రైతు అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఇరుపార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో బీడ్ జిల్లాకు చెందిన రైతు శ్రీకాంత్ విష్ణూ గడాలే గురువారం కలెక్టర్‌ను కలిసి సీఎం పీఠంపై అస్పష్టత తొలిగే వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించి, రైతుల సమస్యలు పరిష్కరిస్తానంటూ వినతి పత్రం అందించారు. లేదంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనకు దిగుతా నంటూ ఆ రైతు హెచ్చరించడం కొసమెరుపు! -
సీఎం పీఠమూ 50:50నే!
ముంబై: ‘మహా’ సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి వారం రోజులు దాటుతున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారాన్ని సమంగా పంచుకునే తమ డిమాండ్ విషయంలో వెనక్కు తగ్గబోమని శివసేన గురువారం మరోసారి స్పష్టం చేసింది. సమ అధికార పంపిణీ అంటే.. ముఖ్యమంత్రి పదవిని సమానంగా పంచుకోవడమేనని తేల్చిచెప్పింది. దాంతో, డిమాండ్ల విషయంలో సేన మెత్తబడిందని, త్వరలో శివసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని వచ్చిన వార్తలకు తెరపడింది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కాగా, మహారాష్ట్ర రాజకీయాల్లో గురువారం పలు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిండే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కొడుకు, తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఠాక్రే వంశాంకురం ఆదిత్య ఠాక్రే పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కాకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదిత్య ఠాక్రేనే షిండే పేరును ప్రతిపాదించారు. ఉద్ధవ్ సూచన మేరకే ఎల్పీ నేతగా షిండే తెరపైకి వచ్చారని సమాచారం. పలువురు పార్టీ నేతలతో కలిసి ఉద్ధవ్ రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ కోషియారీని కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు పంటలను దారుణంగా దెబ్బతీశాయని, అందువల్ల రాష్ట్రంలో అతివృష్టి వల్ల ఏర్పడిన కరువు నెలకొన్నట్లుగా ప్రకటించాలని గవర్నర్‌ను కోరారు. కాగా, శివసేన కార్యాలయం ముందు ‘ఆదిత్య ఠాక్రేనే మహారాష్ట్ర సీఎం’ అని రాసి ఉన్న భారీ హోర్డింగ్‌ను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. మరోవైపు, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నేత మల్లిఖార్జున్ ఖర్గే ముంబైలో సమావేశమయ్యారు. త్వరలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. వాడుకుని వదిలేసే విధానం వద్దు బీజేపీ వాడుకుని వదిలేసే విధానాన్ని అవలంబిస్తోందని శివసేన ఆరోపించింది. పొత్తు సమయంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయం పేర్కొంది. అధికార పంపిణీ విషయంలో సేన మెత్తబడిందన్న వార్తలు వదంతులేనని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆదిత్య ఠాక్రే విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి తుది నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రేదేనని స్పష్టం చేశారు. ఢిల్లీ ముందు తలొంచం ఎన్సీపీ కార్యాలయం ముందు ఆ పార్టీ కార్యకర్తలు ఒక భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. ‘ఢిల్లీ సింహాసనానికి మహారాష్ట్ర ఏ నాటికి తలొంచదని చరిత్ర చెబుతోంది’ అని ఆ హోర్డింగ్‌పై రాసి ఉంది. మనీ లాండరింగ్‌కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనపై కేసు పెట్టినప్పుడు ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ చేసిన వ్యాఖ్య అది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ బాగా పుంజుకున్న విషయం తెలిసిందే. 2014లో కన్నా 13 స్థానాలు ఎక్కువగా, మొత్తం 54 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ(105), శివసేన(56)కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్‌కు 44 సీట్లు వచ్చాయి. పవార్‌తో సంజయ్ రౌత్ భేటీ బీజేపీ, శివసేనల మధ్య విభేదాలతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గురువారం భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి పదవిని శివసేనతో సమంగా పంచుకునేందుకు బీజేపీ వ్యతిరేకత చూపుతున్న పరిస్థితుల్లో.. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా సమీకరణాలు మారుతున్నాయని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను ఎన్సీపీ ఖండించింది. సేన, బీజేపీల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం సంజయ్ రౌత్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసానికి వెళ్లడంతో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాట్లపై ఊహాగానాలకు మరోసారి తెరలేచింది. -
నర్సరీ అడ్మిషన్లపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. అడ్మిషన్ల ప్రక్రియలోభాగంగా తాజా డ్రాపై హైకోర్టు ఇదివరకే స్టే విధించిన నేపథ్యంలో స్టేను ఎప్పుడు ఎత్తివేస్తారా? అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఇటువంటి సమయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులను మరింత నిరాశపర్చింది. గతంలో తాను విధించిన స్టే శుక్రవారం వరకు కొనసాగుతుందని హైకోర్టు బుధవారం స్పష్టంచేసింది. నర్సరీ అడ్మిషన్ల విధివిధానాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలల్లో నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఢిల్లీ ప్రభుత్వం సమర్పించిన వివరాలను కోర్టు తిరస్కరించింది. ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? అందులో సీట్ల సంఖ్య ఎంత? ఏయే వర్గాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే విధివిధానాలున్నాయి? తదితర పూర్తి వివరాలతో తాజా నివేదికను అందజేయాలని డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఢిల్లీ ప్రభుత్వాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్, న్యాయమూర్తి సిద్ధార్థ్ మృదుల్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ న్యాయవాది సవివరంగా ఇచ్చిన వివరణతో కోర్టు సంతృప్తి చెందలేదు. ‘సమీప ప్రాంతాల’వారికి ప్రాధాన్యం ఇచ్చిన విషయం సరైనదే అయినప్పటికీ నర్సరీ అడ్మిషన్లలో ఎదురవుతున్న పెద్ద పెద్ద విషయాలపై మార్గదర్శకాల్లో స్పష్టత లోపించిందనే అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింది. మరి వీటి మాటేంటి? అని ప్రశ్నించింది. ఇక్కడ డిమాండ్-సప్లయి సమస్య ప్రధానమైనదని, సీట్లు తక్కువగా ఉండడం, ఆశిస్తున్నవారు ఎక్కువగా ఉండడం ప్రధాన సమస్యగా కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. దీనిని పరిష్కరించేందుకు ఏం చేస్తారంటూ ప్రశ్నించింది. ఏటా ఈ విషయమై దాఖలవుతున్న పిటిషన్ల సంఖ్య పెరుగుతోందని, కోర్టుకు వస్తున్నవారి సంఖ్యతో హాలు కిక్కిరిసిపోతోందని అసహనం వ్యక్తం చేసింది. అడ్మిషన్ కోసం అవసరమైన 100 మార్కులకుగాను 70 మార్కులను ‘సమీప ప్రాంతాల’వారికి (0 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ఉంటున్నవారికి) ఇస్తుండగా అడ్మిషన్ కోరుతున్నవారి తోబుట్టువులెవరైనా అదే పాఠశాలలో చదివితే మరో 20 మార్కులు ఇస్తున్నారు. వారి తల్లిదండ్రులు అదే పాఠశాలకు చెందిన పూర్వవిద్యార్థులైతే మరో ఐదు మార్కులు కలుపుతున్నారు. ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ నిబంధనకు సంబంధించి ఇస్తున్న ఐదు మార్కులను ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే తొలగించింది. ఈ విధివిధానాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ కొందరు తల్లిదండ్రులు, అన్ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. తోబుట్టువులు అదే పాఠశాలలో చదివితే ఇస్తున్న 20 మార్కులను, తల్లిదండ్రులు పూర విద్యార్థులైతే ఇస్తున్న 5 మార్కులను తొలగించాలని పలువురు పిటిషన్లు వేశారు. వీటిపై కోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. -
టీ బిల్లు పై చర్చ వాయిదాకే