Star wrestler Sushil Kumar
-
Wrestler Sushil Kumar: ‘సుశీల్‌పై కుట్ర జరిగింది’
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను హత్య కేసులో కొందరు కావాలనే ఇరికించారని, దీని వెనక పెద్ద కుట్ర ఉందని అతని తరఫు లాయర్ బీఎస్ జాఖడ్ అన్నారు. పోలీసు దర్యాప్తు జరుగుతున్న తీరును ప్రశ్నించిన ఆయన, సుశీల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, తాము చెప్పదల్చుకున్న అన్ని విషయాలను ఇప్పటికే కోర్టు ముందు ఉంచినట్లు స్పష్టం చేశారు. ‘పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోనే తప్పులు ఉన్నాయి. ఘటన గురించి తెలిశాక ఛత్రశాల్ స్టేడియానికి వెళ్లి గాయపడిన ముగ్గురి స్టేట్మెంట్ రికార్డు చేయగా వారెవరూ సుశీల్ దాడి చేసినట్లుగా చెప్పలేదు. కానీ సాగర్ చనిపోయాక మాత్రమే కిడ్నాపింగ్, మర్డర్ కేసు పెట్టారు. సుశీల్ కొట్టినట్లుగా చెబుతున్న వీడియోను అందరి ముందు బహిర్గతపర్చవచ్చు కదా. విచారణకు హాజరయ్యేందుకు నోటీసు కూడా సుశీల్ పేరిట కాకుండా అతని భార్య పేరిట పంపించడం నిబంధనలకు విరుద్ధం. ఇదంతా చూస్తుంటే సుశీల్‌పై కావాలనే కుట్ర చేసినట్లు అర్థమవుతోంది’ అని జాఖడ్ వివరించారు. -
నర్సింగ్ యాదవే అర్హుడు
ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన రెజ్లింగ్ సమాఖ్య న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్‌ల విషయంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదానికి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) ముగింపు పలికేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 74 కేజీ ఫ్రీస్టయిల్ విభాగంలో రియో ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు సుశీల్కన్నా నర్సింగ్ యాదవే అర్హుడని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. గత రెండేళ్లుగా నర్సింగ్‌ను ట్రయల్స్‌లో ఎదుర్కొనేందుకు సుశీల్ కావాలనే తప్పించుకుంటున్నట్టు పేర్కొంది. గతేడాది జరిగిన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన నర్సింగ్ యాదవ్ భారత్‌కు ఒలింపిక్ బెర్త్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇదే విభాగం నుంచి తాను ఒలింపిక్స్‌కు వెళతానని, గతంలో పతకం సాధించిన సుశీల్ కుమార్ వాదిస్తున్నాడు. ట్రయల్స్ నిర్వహించాలంటూ కోర్టుకెక్కాడు. ‘భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు నర్సింగ్‌ను ఉత్తమ రెజ్లర్‌గా మేం భావిస్తున్నాం. ఈ నిర్ణయం పూర్తి పారదర్శకంగా జరిగింది. ఈ విషయంలో ఎవరికీ అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. 2006 నుంచే నర్సింగ్ యాదవ్ 74కేజీ విభాగంలో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే 18 మంది రెజ్లర్లలో నర్సింగ్ ఇప్పటికే ఆరుగురిని ఓడించాడు. సుశీల్ 2014 వరకు కూడా 66కేజీ విభాగంలోనే పోటీపడ్డాడు’ అని కోర్టుకు సమర్పించిన తమ అఫిడవిట్లో డబ్ల్యుఎఫ్ఐ పేర్కొంది. మరోవైపు ఈ సమయంలో వీరి మధ్య ట్రయల్స్ నిర్వహిస్తే క్వాలిఫికేషన్ ఈవెంట్ అర్థంలేనిదవుతుందని నర్సింగ్ యాదవ్ తరపు న్యాయవాది నిదేష్ గుప్తా తెలిపారు. మరోవైపు సుశీల్ కుమార్ దేశంలో అత్యుత్తమ రెజ్లర్ అని, తను ఒలింపిక్స్‌లో పాల్గొంటేనే పతకంపై ఆశలు పెట్టుకోవచ్చని అతడి తరపు న్యాయవాది అమిత్ సిబల్ వాదించారు. అందుకే ఎలాంటి అనుమానాలకు తావీయకుండా ఇద్దరి మధ్య ట్రయల్స్ నిర్వహించాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం కోర్టు విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది -
‘రియో’ శిబిరం జాబితాలో లేని సుశీల్ పేరు
రియో ఒలింపిక్స్ సన్నాహాల కోసం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో 74 కేజీల విభాగంలో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఎంపిక చేయలేదు. ఈ విభాగంలో రియో బెర్త్ సాధించిన నర్సింగ్ యాదవ్‌ను మాత్రమే ఎంపిక చేశారు. హరియాణాలో బుధవారం ఈ శిబిరం ప్రారంభమవుతుంది. అయితే ఈ శిబిరానికి సుశీల్ హాజరు కావాలనుకుంటే అభ్యంతరం లేదని డబ్ల్యూఎఫ్ఐ అధికారి తెలిపారు. ఈ శిబిరంలో రియోకు అర్హత పొందిన 8 మంది రెజ్లర్లు పాల్గొంటారు -
నేటి నుంచి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్
లాస్ వెగాస్: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. నేటి (మంగళవారం) నుంచి జరిగే ఈ పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో తమ ఒలింపిక్ బెర్త్‌లను ఖాయం చేసుకునేందుకు భారత రెజ్లర్లు సిద్ధమవుతున్నారు. గాయంతో బాధపడుతున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఈ పోటీలకు దూరమవుతుండగా.. యోగేశ్వర్ దత్, నర్సింగ్ యాదవ్, అమిత్, మౌసమ్ తదితరులు ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగుతున్నారు. పురుషుల 74కేజీ ఫ్రీస్టయిల్ విభాగంలో తలపడుతున్న 26 ఏళ్ల నర్సింగ్ యాదవ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఏడాది కాలంగా ఈ విభాగంలో సుశీల్ కుమార్ గాయంతో పాల్గొనకున్నా నర్సింగ్ పలు విజయాలు సాధించాడు. ప్రతీ కేటగిరీలో టాప్-6 స్థానాల్లో వచ్చిన వారు ఒలింపిక్ బెర్త్ దక్కించుకుంటారు. లండన్ గేమ్స్‌లో కాంస్యం సాధించిన యోగేశ్వర్ (65కేజీ ఫ్రీస్టయిల్ ), అమిత్ కుమార్ (57కేజీ), మౌసమ్ ఖత్రి (97కేజీ).. మహిళల ఫ్రీస్టయిల్లో వెటరన్ గీతా ఫోగట్, బబిత, వినేశ్‌లపై పతకంతో పాటు బెర్త్ ఆశలున్నాయి.