starts today
-
పొగమంచులో...పొట్టి పోరు!
భారత జట్టు బంగ్లాదేశ్‌తో ఇప్పటి వరకు ఎనిమిది టి20 మ్యాచ్‌లు ఆడితే అన్నింటా విజయం మనదే. వరల్డ్ కప్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరు మినహా అన్నీ ఏకపక్షంగా సాగినవే. దుర్బేధ్యమైన టీమిండియా ఇప్పుడు స్వదేశంలో తొలిసారిగా బంగ్లాతో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమైంది. కోహ్లి లేకున్నా భారత్ బలం ఏమాత్రం తగ్గలేదు. కానీ షకీబ్, తమీమ్‌లాంటి ఇద్దరు స్టార్ ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగుతున్న బంగ్లా ఎంత వరకు పోటీనిస్తుందో చూడాలి. అయితే అన్నింటికి మించి ఢిల్లీ కాలుష్యం నీడలో ఈ మ్యాచ్ జరగడంపైనే అందరి దృష్టి నెలకొంది. పొగమంచుతో కమ్మేసిన నగరంలో మూడు గంటలకుపైగా ఆటగాళ్లు ప్రత్యర్థితో పాటు వాతావరణంతో కూడా పోటీ పడాల్సి ఉంటుంది. న్యూఢిల్లీ: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను సునాయాసంగా ఓడించిన తర్వాత భారత జట్టు టి20 ఫార్మాట్‌తో కొత్త సిరీస్‌ను మొదలు పెడుతోంది. కోహ్లి గైర్హాజరులో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడుతోంది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య నేడు తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. సీనియర్లతో పాటు పలువురు కుర్రాళ్లు భారత్ తరఫున తమ సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. ఫిక్సింగ్ వివాదంతో ఐసీసీ నిషేధానికి గురైన షకీబ్ లేకపోవడంతో డీలా పడిన బంగ్లాదేశ్ టీమ్‌లో కూడా పలువురు యువ ఆటగాళ్లు తొలి విజయం అందుకోవాలని పట్టుదలగా ఉన్నారు. శివమ్ దూబేకు చాన్స్.. గత సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆఖరి సారిగా బెంగళూరులో టి20 మ్యాచ్‌లో ఆడింది. అందులో ఆడిన వారిలో దాదాపు అందరికీ ఇక్కడ తుది జట్టులో స్థానం లభించే అవకాశం ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ చెలరేగిపోతే మనకు తిరుగుండదు. మరో ఓపెనర్‌గా శిఖర్ ధావన్ రాణించడం కీలకం. బెంగళూరు మ్యాచ్ తర్వాత విజయ్ హజారేలో వన్డేలు ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక అర్ధ సెంచరీ చేశాడు. ఇక్కడ అతను ఎంత దూకుడుగా ఆడతాడనేది ఆసక్తికరం. కోహ్లికి బదులుగా రాహుల్‌కు అవకాశం లభించవచ్చు. అయితే సంజు సామ్సన్ నుంచి అతనికి పోటీ ఎదురవుతోంది. తర్వాతి స్థానాల్లో పంత్, అయ్యర్లు చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. రోహిత్ శర్మ మీడియా సమావేశాన్ని బట్టి చూస్తే ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబే అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైంది. హార్దిక్‌కు బదులుగా జట్టులోకి వచ్చిన శివమ్ అదే తరహాలో విధ్వంసకర బ్యాటింగ్ చేయగల సమర్థుడు. కొంత విరామం తర్వాత టీమ్‌లోకి వచ్చిన లెగ్ స్పిన్నర్ చహల్‌ను కూడా ఆడించాలనే ఆలోచనతో మేనేజ్మెంట్ ఉంది. దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్‌లలో ఇద్దరు పేసర్లు బరిలోకి దిగుతారు. బెంగళూరులో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన అనూహ్య ఓటమిని పక్కన పెడితే స్వదేశంలో ఐపీఎల్‌తో అపార అనుభవం ఉన్న మన జట్టును నిలువరించడం దాదాపు అసాధ్యం. ముగ్గురే కీలకం... మహ్ముదుల్లా, ముష్ఫికర్, ముస్తఫిజుర్... బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్‌లో ఏమైనా విజయావకాశాలు ఉండాలంటే ఈ ముగ్గురిపైనే ఆధారపడి ఉంది. పైకి ఎన్ని మాటలు చెప్పినా... టాప్ ఆల్‌రౌండర్ షకీబ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. పైగా వ్యక్తిగత కారణాలతో స్టార్ ఓపెనర్ తమీమ్ కూడా లేకపోవడంతో ఆ జట్టు బ్యాటింగ్ బలహీనపడింది. కెప్టెన్‌గా అదనపు బాధ్యత మోస్తున్న మహ్ముదుల్లా ధాటిగా ఆడగల సమర్థుడు. ముష్ఫికర్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. ముస్తఫిజుర్ బౌలింగ్‌లో గతంలో ఉన్నంత పదును కనిపించకపోయినా ఇప్పటికీ బంగ్లాకు అతను పెద్ద బలం. పైగా ఐపీఎల్లో ఆడుతున్న అనుభవం కూడా ఉంది. బంగ్లా రికార్డు చూస్తే ఈ ముగ్గురు కాకుండా మిగతావారి ఆట గాలిలో దీపంలాంటిదే. సీపీఎల్‌లో అనుభవం తర్వాత లిటన్ దాస్ బ్యాటింగ్ కొంత మెరుగుపడింది. కొత్త ఆటగాడు నయీమ్‌కు అవకాశం దక్కవచ్చు. అల్ అమీన్, అబూ హైదర్‌లాంటి బౌలర్లు భారత్‌ను ఎంత మేరకు నిలువరిస్తారనేది సందేహమే. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాహుల్/సామ్సన్, పంత్, అయ్యర్, శివమ్ దూబే, కృనాల్, వాషింగ్టన్, చహల్, దీపక్ చహర్, శార్దుల్/ఖలీల్. బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), దాస్, సర్కార్, నయీమ్, ముష్ఫికర్, మొసద్దిక్, అఫీఫ్, అరాఫత్, ముస్తఫిజుర్, అల్ అమీన్, అబూ హైదర్/తైజుల్. పిచ్, వాతావరణం టి20 ఫార్మాట్‌కు తగినట్లుగా బ్యాటింగ్‌కు అనుకూలం. కొంత వరకు స్పిన్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీపావళి తర్వాత ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ ప్రకటించిన సమయంలో పూర్తి కాలుష్యభరిత వాతావరణంలో మ్యాచ్ జరుగుతోంది. ఆటకు అంతరాయం కలగకపోయినా క్రికెటర్లకు ఇబ్బంది మాత్రం తప్పకపోవచ్చు. -
అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తాం
- ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలకృష్ణ - అనంతలో నేటి నుంచి సబ్-జూనియర్ టోర్నీ ప్రారంభం అనంతపురం సప్తగిరిసర్కిల్: రానున్న కాలంలో రాష్ట్రంలో అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే సబ్–జూనియర్ ఫుట్‌బాల్ క్రీడా పోటీల నిర్వహణపై శనివారం స్థానిక అనంత క్రీడా గ్రామంలోని ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రోత్సాహంతోనే నేడు ఇంత పెద్ద టోర్నీ నిర్వహిస్తున్నామన్నారు. ఏషియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్ అందించిన సూచనలను ప్రణాళిక బద్ధంగా రూపొందించి టోర్నీ విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొనగా ఆదివారం జరిగే మొదటి మ్యాచ్‌లో తమిళనాడు–తెలంగాణ జట్లు తలపడతాయి. 6న ఆంధ్ర–పాండిచ్చేరి జట్ల మధ్య మొదటి మ్యాచ్ సాగుతుంది. టోర్నీ నుంచి రెండు జట్లు జాతీయస్థాయి టోర్నీకి అర్హత సాధిస్తాయి. చివరి లీగ్ మ్యాచ్ 8న ఆంధ్ర–కేరళ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. కాగా పోటీలను జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభిస్తారు. జాతీయస్థాయి టోర్నీలో తలపడే ఆంధ్ర జట్టుకు అనంత ఆర్డీటీ ఫుట్‌బాల్ అకాడమీకి చెందిన దాదాఖలందర్, మనురావు కోచ్‌లుగా ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ పాల్గొన్నారు. ఆంధ్ర జట్టు మహబూబ్‌బాషా, దిలీప్‌రెడ్డి, మధుబాబు, శ్రీహరి, సుహేల్ (అనంతపురం), లక్ష్మణ్బోహర, నిశ్చయ్ఆనంద్, శివశంకర్, రాజు, ధ్రువ్ (విశాఖపట్టణం), దీపక్చందు, ప్రిన్స్కంగ్జాం (కృష్ణా), ప్రకాష్, షేక్ అల్తాఫ్ (నెల్లూరు), మోహన్ (కర్నూలు), పూజిత్, బన్ని (కడప), జోయెల్ఫిలిప్ (ప్రకాశం), జాకోబ్ హెరాల్డ్ హర్షిత్ (చిత్తూరు), భరత్ (విజయనగరం). -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు కొనసాగుతాయి. జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. మొత్తం 66 కేంద్రాల్లో 16,297 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. తొలివిడత ఈ నెల 3 నుంచి 7 వరకు, రెండో విడత 8 నుంచి 12 వరకు, మూడో విడత 13 నుంచి 17 వరకు, నాల్గో విడత 18 నుంచి 22 వరకు జరుగుతాయని ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్ఐఓ) వెంకటేశులు తెలిపారు. ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా చూడాలని, తేడావస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని పరీక్షా సిబ్బందిని ఆయన హెచ్చరించారు. తనతో పాటు డీవీఈఓ, డీఈసీ మెంబర్లు, హైçపవర్ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు పరీక్షలను పర్యవేక్షిస్తారన్నారు. -
నేటి నుంచి అండర్–19 హాకీ పోటీలు
– అనంత వేదికగా బాల,నేటి నుంచి అండర్–19 హాకీ పోటీలు – బాలికల రాష్ట్రస్థాయి టోర్నీ అనంతపురం సప్తగిరి సర్కిల్ : 62వ రాష్ట్రస్థాయి అండర్–19 హాకీ పోటీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయని స్కూల్‌గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఆర్ట్స్ కళాశాల మైదానం, కొత్తూరు బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో 17వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, జాయింట్ కలెక్టర్–2 ఖాజామోహిద్దీన్, ఆర్జేడీ వెంకటరమణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ టోర్నీలో 11 జిల్లాల బాలుర, 6 జిల్లాల బాలికల జట్లు పాల్గొంటాయన్నారు. -
నేటి నుంచి ఇన్స్ఫైర్ కార్యక్రమాలు
ఎస్కేయూ: ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్ రీసెర్చ్ (ఇన్స్పైర్–2016) కార్యక్రమాలను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పదవ తరగతిలో 92 శాతం పైగా వచ్చిన విద్యార్థులకు ఫిజిక్స్, మేథమెటిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో నాలుగు రోజులు ఎస్కేయూలోని ఫిజిక్స్ విభాగంలో శిక్షణ ఇస్తారు. ఇన్స్పైర్ కార్యక్రమాలు బుధవారం ప్రారంభమవుతున్నట్లు కోఆర్డినేటర్ డాక్టర్ కే.రాంగోపాల్ తెలిపారు. -
'నిట్' తాత్కాలిక తరగతులు ప్రారంభం
తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి): పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ తాత్కాలిక తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, తాడేపల్లిగూడెంలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలోని విమానాశ్రయ భూముల్లో నిట్ శాశ్వత భవనం నిర్మించేందుకు కేంద్రం అనుమతి తెలిపింది. దీంతో అక్కడ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే. -
నేటి నుంచే డీఎస్సీ
- ఆర్టీసీ సమ్మెతో అభ్యర్థుల్లో ఉత్కంఠ హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలకోసం ఉద్దేశించిన డీఎస్సీ-2014 (టెట్ కమ్ టెర్ట్) పరీక్షలు శనివారం నుంచి మొదలవనున్నాయి. వరుసగా మూడు రోజులపాటు జరిగే ఈ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ సకల ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో శుక్రవారం నాటి ఎంసెట్‌కు మాదిరిగానే ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేపట్టింది. 10,313 పోస్టులకోసం నిర్వహించే ఈ పరీక్షకు మొత్తం 4,20,702 మంది దరఖాస్తు చేయగా అందులో 3,97,294 మందికి హాల్‌టికెట్లు జారీ చేశారు. ఆన్లైన్ ద్వారా జారీచేసిన ఈ హాల్‌టికెట్లను 3,75,164 మంది డౌన్లోడ్ చేసుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 2,560 కేంద్రాల్ని ఏర్పాటుచేశారు. అయితే ఆర్టీసీ సమ్మెతో ఈ పరీక్షలకు ఎలా హాజరు కావాలని అభ్యర్థులు ఆవేదన చెం దుతున్నారు. జూన్ ఒకటికల్లా ఫలితాలు :డీఎస్సీ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం యధాతథంగా నిర్వహిస్తామని, ఫలితాల్ని జూన్ ఒకటి నాటికి విడుదల చేస్తామని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. -
నేటి నుంచి మేడారంలో మినీ జాతర
-
నేటి నుంచి చాంపియన్స్ లీగ్ యాక్షన్
-
'టెన్త్'కు..రెడీ