అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు కొనసాగుతాయి. జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. మొత్తం 66 కేంద్రాల్లో 16,297 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. తొలివిడత ఈ నెల 3 నుంచి 7 వరకు, రెండో విడత 8 నుంచి 12 వరకు, మూడో విడత 13 నుంచి 17 వరకు, నాల్గో విడత 18 నుంచి 22 వరకు జరుగుతాయని ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్‌ఐఓ) వెంకటేశులు తెలిపారు. ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా చూడాలని, తేడావస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని పరీక్షా సిబ్బందిని ఆయన హెచ్చరించారు. తనతో పాటు డీవీఈఓ, డీఈసీ మెంబర్లు, హైçపవర్ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు పరీక్షలను పర్యవేక్షిస్తారన్నారు.