తెలంగాణ ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఎప్పటి నుంచి అంటే..? | Telangana Inter Second Year Particles Will Be Held March 23 To April 8 | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఎప్పటి నుంచి అంటే..?

Published Tue, Mar 22 2022 2:06 AM | Last Updated on Tue, Mar 22 2022 3:45 PM

Telangana Inter Second Year Particles Will Be Held March 23 To April 8 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రేపట్నుంచి ఏప్రిల్‌ 8 వరకు ఇంటర్‌ సెకండియర్‌ ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. దాదాపు 3 లక్షల మంది సైన్స్‌ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజ రవనున్నారు. ఈ ఏడాది కూడా జంబ్లింగ్‌ విధానాన్ని ఎత్తేయడంతో విద్యార్థులు వారు చదువుతున్న కాలేజీల్లోనే ప్రయోగ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంసెట్‌ పరీక్షకు ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ ఉండదని అధికారులు ఇప్పటికే తెలిపారు.

దీంతో ప్రాక్టికల్స్‌పై పెద్దగా ఆసక్తి కన్పించడం లేదని అధ్యాకులు చెబుతున్నారు. అదీగాక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటివరకు లేబొరేటరీల్లో ప్రాక్టికల్స్‌ ఏవీ జరగలేదని తెలుస్తోంది.  కాగా, ప్రాక్టికల్స్‌కు సంబంధించి ఏమైనా సందేహా లుంటే నివృత్తి చేసేందుకు 040–24600110 నంబర్‌తో  కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement