- ఆర్టీసీ సమ్మెతో అభ్యర్థుల్లో ఉత్కంఠ
హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలకోసం ఉద్దేశించిన డీఎస్సీ-2014 (టెట్ కమ్ టెర్ట్) పరీక్షలు శనివారం నుంచి మొదలవనున్నాయి. వరుసగా మూడు రోజులపాటు జరిగే ఈ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ సకల ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో శుక్రవారం నాటి ఎంసెట్‌కు మాదిరిగానే ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేపట్టింది.
10,313 పోస్టులకోసం నిర్వహించే ఈ పరీక్షకు మొత్తం 4,20,702 మంది దరఖాస్తు చేయగా అందులో 3,97,294 మందికి హాల్‌టికెట్లు జారీ చేశారు. ఆన్‌లైన్ ద్వారా జారీచేసిన ఈ హాల్‌టికెట్లను 3,75,164 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 2,560 కేంద్రాల్ని ఏర్పాటుచేశారు. అయితే ఆర్టీసీ సమ్మెతో ఈ పరీక్షలకు ఎలా హాజరు కావాలని అభ్యర్థులు ఆవేదన చెం దుతున్నారు.
జూన్ ఒకటికల్లా ఫలితాలు :డీఎస్సీ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం యధాతథంగా నిర్వహిస్తామని, ఫలితాల్ని జూన్ ఒకటి నాటికి విడుదల చేస్తామని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.