కేంద్రం దృష్టికి కాంటూరు సమస్య
తాడేపల్లిగూడెం : జిల్లాలో నెలకొన్న కొల్లేరు కాంటూరు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని, పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌పామ్ మద్దతు ధర పడిపోయిన సమయంలో ధరను పెంచి రైతులకు ఊరట ఇచ్చామన్నారు. రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొనే క్రమంలో కేంద్రం భూసారపరీక్షలు చేసి శాయిల్ హెల్త్‌కార్డులు ఇచ్చిందన్నారు. ప్రధాన మంత్రి ఫసలీ బీమా యోజన ద్వారా రైతులను ఆదుకుంటున్నామన్నారు. పంట రుణాలు ఆరుశాతం అతితక్కువ వడ్డీకే బ్యాంకులద్వారా అందించడం, రైతులకు వ్యవసాయ ఆదాయం రెట్టింపు కోసం చర్యలను కేంద్రం చేపడుతోందన్నారు. పప్పుధాన్యాల కొరత నివారణకుగాను వాటి కనీస మద్దతు ధర పెంచడం ద్వారా ధరల పెరుగుదలకు కేంద్రం కళ్లెం వేసిందని హరిబాబు చెప్పారు.
నోట్ల రద్దు నిర్ణయం సంచలనాత్మకం
లంచగొండితనం, అవినీతి, నల్లధనం కట్టడి చేయడం కోసం మోడీ పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశంలో చలామణిలో ఉన్న 17 లక్షల 50 వేల కోట్ల రూపాయల్లో 85 శాతం పెద్దనోట్లే అన్నారు. పెద్దనోట్లు రద్దు తర్వాత ఐదు లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లుగా వచ్చాయన్నారు. దేశంలో నల్లధన ం వెలికితీయడం, పాకిస్తా¯ŒS నుంచి దేశంలోకి వచ్చే నకిలీ కరెన్సీని అడ్డుకోవడం ద్వారా పారదర్శక లావాదేవీలకు అవకాశం కలిగిందని చెప్పారు. ఈ నెల 26న తాడేపల్లిగూడెంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరయ్యే సభను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అ««దl్యక్షురాలు శరణాల మాలతీరాణి, ఎస్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య, మైనార్టీ అధ్యక్షుడు షేక్ బాజీ, కార్యదర్శి వేమా, ఐటీ సెల్ ఇ¯ŒSచార్జి సత్యమూర్తి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ తదితరులు పాల్గొన్నారు.