State Bank of Mysore
-
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ లో భారీ కుంభకోణం
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ చైతన్యపురి శాఖ మేనేజర్ మురళినాయక్ ఇందుకు సూత్రధారిగా భావిస్తున్నారు. అనర్హులకు రుణాలు మంజూరు చేసి రూ. 3 కోట్ల మేర ధనాన్ని దుర్వినియోగం చేసిన మేనేజర్ తన తప్పు బయట పడేసరికి ఓ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే, బ్యాంకు లీగల్ సెల్ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టి మురళినాయక్‌ను దోషిగా తేల్చారు. ఈ మేరకు అతడినిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్నారు. -
బ్యాంక్ స్ట్రీట్... క్యూ1పై మొండి బకాయిల భారం!
దాదాపు ఆరు బ్యాంకులు గురువారం తమ క్యూ1 ఫలితాలను ప్రకటించగా, ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ మాత్రమే నికర లాభంలో వృద్ధి నమోదు చేసింది. దీని నికర లాభం రూ.74 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.94 కోట్లకు పెరిగింది. మిగిలిన బ్యాంకులపై మొండిబకా యిల భారం పడింది. వివరాలివీ... బ్యాంక్ ఆఫ్ బరోడా... ‘జన’ ఖాతాలకు కొత్త సంస్థ న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,052 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం నికర లాభం(రూ.1,362 కోట్లు)తో పోలిస్తే 23 శాతం క్షీణిత నమోదైందని బ్యాంక్ తెలిపింది. వేతన సవరింపు, మొండి బకాయిలకు అధిక కేటాయింపులు, ట్రెజరీ ఆదాయం పడిపోవడం వంటి కారణాల వల్ల నికర లాభం క్షీణించిందని బ్యాంక్ సీఈఓ రంజన్ ధావన్ చెప్పారు. గత క్యూ1లో రూ.11,683 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.12,244 కోట్లకు పెరిగిందని వివరించారు. స్థూల మొండి బకాయిలు 3.11 శాతం నుంచి 4.13 శాతానికి, నికర మొండి బకాయిలు 1.58 శాతం నుంచి 2.07 శాతానికి పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది టైర్ వన్, టైర్ టూ బాండ్ల ద్వారా రూ4,000-5,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నామని చెప్పారు. జనధన యోజన కింద ప్రారంభించిన బ్యాంక్ ఖాతాల నిర్వహణ కోసం అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం పొందామని, ఈ సంస్థ చెల్లింపు, సూక్ష్మ రుణ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు.ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ బ్యాంక్ షేర్ 10 శాతం వృద్ధితో రూ.169కి ఎగసింది. విజయ బ్యాంక్... కేటాయింపులతో కుదేల్ న్యూఢిల్లీ: విజయ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 12 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.161 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.143 కోట్లకు తగ్గిందని విజయ బ్యాంక్ పేర్కొంది. మొండి బకాయిలకు అధిక కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.3,190 కోట్ల నుంచి రూ.3,289 కోట్లకు పెరిగిందని వివరించింది. స్థూల మొండి బకాయిలు 2.68 శాతం నుంచి 3.39 శాతానికి, అలాగే నికర మొండి బకాయిలు 1.77% నుంచి 2.45 శాతానికి పెరిగాయని పేర్కొంది. ఫలితాల నేపధ్యంలో బ్యాంక్ షేర్ బీఎస్ఈలో 2% వృద్ధితో రూ.40కు పెరిగింది. ఓబీసీ.. ఆదాయమూ తగ్గింది ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 29 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.365 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.258 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.5,576 కోట్ల నుంచి రూ.5,569 కోట్లకు పడిపోయింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.478 కోట్ల నుంచి రూ.596 కోట్లకు పెరిగాయి. స్థూల మొండి బకాయిలు 4.33 శాతం (రూ.5,983 కోట్ల)నుంచి 5.85(రూ.8,577 కోట్లు), నికర మొండి బకాయిలు 3.11 శాతం నుంచి 3.76 శాతానికి (4,228 కోట్ల నుంచి 5,358 కోట్లకు) పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం రూ.1,243 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.1,329 కోట్లకు వృద్ధి చెందింది. ఫలితాల నేపథ్యలో ఈ బ్యాంక్ షేర్లు బీఎస్ఈలో 4 శాతం వృద్ధితో రూ.164 వద్ద ముగిశాయి. 81 శాతం పడిన దేనా బ్యాంక్ లాభం గత క్యూ1లో రూ.82 కోట్లుగా ఉన్న దేనా బ్యాంక్ నికర లాభం ఈ క్యూ1లో 81 శాతం తగ్గి, రూ.15 కోట్లకు పడిపోయింది. మొండి బకాయిలు బాగా పెరగడమే దీనికి కారణమని బ్యాంక్ తెలిపింది. ఆదాయం రూ.2,825 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.2,915 కోట్లకు, స్థూ మొండి బకాయిలు 4.21 శాతం నుంచి 6.2 శాతానికి, నికర మొండి బకాయిలు 2.94 శాతం నుంచి 4.24 శాతానికి, మొండి బకాయిలకు కేటాయింపులు రూ.228 కోట్ల నుంచి రూ.325 కోట్లకు పెరిగాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ బ్యాం షేర్ 4 శాతం లాభపడి రూ.44 వద్ద ముగిసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్... ఐఎన్జీ వైశ్యా ఎఫెక్ట్ ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 26 శాతం క్షీణించి రూ.517 కోట్లకు తగ్గింది. ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ విలీనం తర్వాత కోటక్ బ్యాంక్ వెలువరించిన తొలి ఆర్థిక ఫలితాలు ఇవి. ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ నిరర్థక ఆస్తులు, ఆ బ్యాంక్ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. స్డాండోలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.429 కోట్ల నుంచి రూ.190 కోట్లకు పడిపోయిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్-చైర్మన్, ఎండీ, ఉదయ్ కోటక్ వెల్లడించారు. -
ఘరానా మోసం
43 బినామీ ఖాతాలతో రూ. కోట్లు కాజేసిన బ్యాంక్ మేనేజర్ ఆలస్యం వెలుగు చూసిన వైనం దర్యాప్తు చేపట్టిన పోలీసులు శివమొగ్గ:బ్యాంక్‌లో బినామీ ఖాతాలు సృష్టించి రూ. కోట్లు కాజేసిన బ్యాంక్ మేనేజర్ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... శివమొగ్గలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరులో మేనేజర్‌గా పనిచేస్తున్న గణపతి ముంగ్రి తన బంధువుల పేరుతో 43 బినామీ ఖాతాలు తెరిచి వీటి ద్వారా రూ. 2.16 కోట్లను స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నగదు మొత్తం బయటి వ్యక్తులకు రుణాలుగా ఇచ్చారని, వాటిని ఇప్పటి వరకు కట్టలేదని ఆడిట్ అధికారుల వద్ద బ్యాంక్ మేనేజర్ బుకాయించాడు. దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలిస్తే అసలు విషయం వెలుగు చూసింది. దీనికి సంబంధించి బ్యాంక్ ఏజీఎం ఇటీవల జయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని జిల్లా ఎస్పీ రవి.డి.చెణ్ణన్నవర్ సీరియస్‌గా పరిగణించి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందుకోసం జిల్లా ఏసీపీ ఎస్.విష్ణువర్ధన్‌ను ఆయన నియమించారు. కాగా, ఈ కుంభకోణంలో బ్యాంక్ సిబ్బంది హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
శివమొగ్గ ఎస్బీఎంలో భారీ చోరీ
వెనుకవైపు కన్నం వేసి లోనికి ప్రవేశించిన దుండగులు సేఫ్టీ లాకర్, ట్రంక్ పెట్టెల తరలింపు గ్యాస్ కట్టర్‌తో తెరచి రూ. రెండు కోట్ల బంగారు నగలు, భారీ మొత్తంతో పరారీ శివమొగ్గ : జిల్లా కేంద్రమైన శివమొగ్గ తుంగానగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాచేనహళ్లి బీహెచ్.రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు శాఖలో ఆదివారం అర్ధరాత్రి దొంగలుపడి భారీ మొత్తంలో నగదు, న గలతో ఉడాయించారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటన పోలీసు అధికారుల్లో తీవ్ర సంచలనం రేపింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ కౌశలేంద్రకుమార్, అదనపు ఎస్పీ బీ.దయాళుతో పాటు సీనియర్ పోలీసు అధికారులు బ్యాంకు వద్దకు చేరుకుని పరిశీలించారు. అనంతరం జాగిలాలు, వేలి ముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. అందిన సమాచారం మేరకు ... అర్ధరాత్రి బ్యాంకు వెనుక వైపున కన్నం వేసి బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం బంగారు నగలు, నగదు ఉన్న సేఫ్టీ లాకర్, ట్రంక్ పెట్టెలను దుండగులు అక్కడి నుంచి ఒక నిర్జన ప్రదేశంలోకి తరలించారు. గ్యాస్ కట్టర్ సాయంలో వాటిని తెరచి అందులో ఉన్న ఏడు కిలోల బంగారు నగలు, రూ. లక్షల నగదుతో పారిపోయారు. జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ జాతీయ బ్యాంకులో భారీ చోరీ జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. దుండగులు ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు ఎస్పీ చెప్పారు. -
ద్వితీయార్థంలో ఎకానమీ రికవరీ
సాక్షి, బెంగళూరు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఎకానమీ ఒత్తిళ్ల నుంచి మళ్లీ కోలుకోగలదని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కరెంటు ఖాతా లోటును (క్యాడ్) 70 బిలియన్ డాలర్ల లోపే కట్టడి చేసి.. ఆర్థికవేత్తలు, విశ్లేషకుల అంచనాలను తప్పని నిరూపిస్తామని స్పష్టం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు అయిన ఒక కార్యక్రమంలో చిదంబరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా 101 శాఖలను ఏకకాలంలో ప్రారంభించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. మన పేదలు నిజాయితీపరులు .. భారత్‌లో సంపన్నులతో పోలిస్తే పేదలు విశ్వసనీయమైన వారని, నిజాయితీగా రుణాలు తిరిగి చెల్లించేవారని ఆయన కితాబిచ్చారు. ఆధార్ కార్డులు తప్పనిసరి కాదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ.. తాము వీటి ప్రయోజనాన్ని అత్యున్నత న్యాయస్థానానికి నివేదిస్తున్నామని చిదంబరం వివరించారు. ఎన్ఎస్ఈఎల్ చెల్లింపుల కుంభకోణంలో ఎంసీఎక్స్, ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌లతో పాటు ప్రమోటర్ ఎఫ్‌టీఐఎల్‌పై కూడా నియంత్రణ సంస్థలు సెబీ, ఎఫ్ఎంసీ నిఘా ఉంచాయని చెప్పారు. కొత్తగా రాబోయే ప్రైవేట్ బ్యాంకులు ఇప్పుడున్న బ్యాంకులకు నకళ్లుగా ఉండరాదని, పేదలకు సైతం సేవలు విస్తరించగలగాలని సూచించారు.