The state cabinet
-
ర్యాగింగ్ ఫ్రీ స్టేట్‌గా తీర్చిదిద్దుతాం
వీసీలతో సమీక్షలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడ సెంట్రల్: ఆంధ్రప్రదేశ్‌ను ర్యాగింగ్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడలో శనివారం ఆయన వీసీలు, రిజిస్ట్రార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడితే గతంలో టీసీ ఇచ్చి పంపేసేవారని, ఇప్పుడైతే శాశ్వతంగా విద్యకు దూరం చేస్తారని చెప్పారు. విద్యాసంస్థల అధిపతుల్ని బాధ్యుల్ని చేస్తామన్నారు. వైస్చాన్స్లరే యూనివర్సిటీకి కింగ్ అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో యూనివర్సిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీల్లో విద్యావిధానాన్ని అధ్యయనం చేయడం కోసం త్వరలోనే సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఫిన్‌ల్యాండ్ దేశాలతో పాటు దేశంలోని తమిళనాడు, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు వివరించారు. తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్ యూనివర్సిటీల విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మంత్రి గంటా అన్నారు. నారాయణను టార్గెట్ చేస్తారు : నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి, కడపలో నారాయణ విద్యాసంస్థలో విద్యార్థిని మృతిపై అసెంబ్లీలో ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలకు అన్ని రకాలుగా సమాధానం చెప్పేలా రికార్డులు సిద్ధం చేయాలని ఆయన వీసీలకు సూచించారు. నారాయణ క్యాబినెట్లో మంత్రిగా ఉండటంతో పాటు తన బంధువు కూడా కావడంతో అసెంబ్లీలో ప్రతిపక్షం టార్గెట్ చేస్తోందన్నారు. -
6న రాజధానికి శంకుస్థాపన
-
6న రాజధానికి శంకుస్థాపన
రాష్ట్ర కేబినెట్ నిర్ణయం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి జూన్ 6న శంకుస్థాపన చేయాలని, దసరా నుంచి నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ కాలం హైదరాబాద్ నుంచి పరిపాలన చేయడం మంచిది కాదని, వీలైనంత త్వరగా కొత్త రాజధానికి తరలడానికి చర్యలు చేపట్టాలని తీర్మానించింది. తొలుత ఏ శాఖలను తరలించాలి? విజయవాడలో అందుబాటులో ఉన్న భవనాలు ఎన్ని?.. తదితర అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అన్ని శాఖలను ఒకేసారి తరలించడం సాధ్యం కాదు కనుక తొలుత క్షేత్రస్థాయి అధికారులను కొత్త రాజధానికి పంపించాలని, తర్వాత దశల వారీగా కార్యాలయాల తరలింపును చేపట్టాలని భావించింది. రాష్ట్ర మంత్రివర్గం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సుదీర్ఘంగా సమావేశమైంది. మత్స్య, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పర్యాటకం, ఈ-గవర్నెన్స్ విధానాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావులు మీడియాకు వెల్లడించారు. ముఖ్యాంశాలు ఇవీ.. సమీకరణకు ముందుకు రాని రైతులపై భూ సేకరణ అస్త్రం ప్రయోగించాలి. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి.ఈనెల 15 నుంచి 30 వరకు ఉద్యోగుల సాధారణ బదిలీలను పాలనా అవసరాల మేరకు చేయడానికి అనుమతించాలి.జూన్ 2కు రాష్ట్రం ఏర్పాటై ఏడాది పూర్తవుతుంది. ఆరోజు నవ నిర్మాణ దీక్ష చేపట్టాలి. ప్రభుత్వం చేపట్టిన మిషన్లు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి 2 నుంచి 7 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. 8న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. గిరిజన ప్రాంతాల్లో అదనంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటల పెంపకానికి చర్యలు చేపట్టాలి. డ్వాక్రా మహిళలకు మూలధన వ్యయాన్ని వచ్చేనెల 2 నుంచి 8వ తేదీ వరకు చెక్కుల రూపంలో అందించాలి.రైతులకు రుణమాఫీ చేసినా.. ఇంకా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. గ్రామాల వారీగా రుణమాఫీ పొందిన రైతుల వివరాలు, వారి ఖాతాల్లో ఎంత జమయిందో పేర్కొంటూ అన్ని గ్రామాల్లో జాబితాలు ప్రదర్శించాలి. 2020 నాటికి అగ్రగామిగా ఏపీ పర్యాటక రంగంలో దేశంలో 2020 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో రూపొందించిన నూతన పర్యాటక విధానానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ రంగానికి పారిశ్రామిక హోదాను కల్పించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో 10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి.. ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది.{పస్తుతం ఏడాదికి 9 కోట్ల మంది దేశీయ పర్యాటకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. నాలుగేళ్లలో 18 కోట్ల మంది దేశీయ పర్యాటకులను ఆకర్షించాలి. {తీస్టార్ కన్నా ఎక్కువ స్థాయి హోటళ్లు, రిసార్ట్స్, హెరిటేజ్ హోటళ్లు, ఎమ్యూజ్మెంట్ పార్కులు, గోల్ఫ్ కోర్సులు, బొటానికల్ గార్డెన్లు, ఆధ్యాత్మిక కేంద్రాలు, పురావస్తు ప్రదర్శన శాలలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తారు. టూరిజం ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని బట్టి కనిష్టంగా 5 శాతం గరిష్టంగా 20 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు. భూ మార్పిడి ఫీజు, స్టాంప్ డ్యూటీలను వంద శాతం రీయింబర్స్ చేస్తారు. పలు రకాల పన్ను మినహాయింపులు ఉంటాయి.ఈ-గవర్నెన్స్ పాలసీకి ఆమోదం రాష్ట్రంలో ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య, వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నూతన ఈ-గవర్నెన్స్ ప్రొక్యూర్మెంట్ విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 3.50 లక్షల మందికి ఉపాధి రాష్ట్రంలో రూ.15 వేల కోట్లతో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేయించి.. 3.5 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నూతన విధానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మూతపడిన సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.పారిశ్రామిక వాడల్లో 15% భూమిని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేటాయిస్తారు. భూ కేటాయింపులో రిజ ర్వేషన్ పాటించాలి. 5% మైనార్టీలు, 20% బీసీలు, 10% మహిళలకు కేటాయించాలి.వ్యాట్, సీఎస్టీ పదేళ్ల పాటు 100 శాతం రీయింబర్స్మెంట్. 15 శాతం వడ్డీ రాయితీ.. గరిష్టంగా రూ.20 లక్షలు ఇవ్వాలి. స్టాంప్ డ్యూటీ, ల్యాండ్ కన్వర్షన్ చార్జీల నుంచి 100 % మినహాయింపు. -
చందూలాల్‌కు క్లియర్
గిరిజన సంక్షేమ శాఖ దక్కే అవకాశం పార్లమెంటరీ సెక్రటరీగా వినయభాస్కర్ తుది ప్రయత్నాల్లో సురేఖ వరంగల్ : రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు మరో పదవి ఖాయమైంది. ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్‌కు కేబినెట్లో చోటు ఖరారైందని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. సీఎం కేసీఆర్.. ఈ నెల 11న జరిగిన గిరిజన భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖను గిరిజనుడికి అప్పగిస్తామని ప్రకటించారు. దీని ప్రకారం చందూలాల్‌కు గిరిజన సంక్షేమ శాఖ దక్కనుంది. మంత్రి పదవి విషయంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు వినిపిస్తోంది. కేబినెట్లో మహిళలకు చోటు కల్పించే విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి ఆధారంగా సురేఖకు మంత్రి పదవిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆమెకు మంత్రి పదవి బదులు.. ఆమె భర్త కొండా మురళీధర్‌రావుకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇవ్వవచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు రెండుకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సురేఖకు మంత్రి పదవి దక్కకపోతే మురళీధర్‌రావుకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని గులాబీ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. మంత్రి పదవి ఆశించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్కు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ సెక్రెటరీ పదవి ఖాయమైందని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. మంగళవారం జరగునున్న మంత్రివర్గ విస్తరణ, ఆ తర్వాత వెలువడే ఉత్తర్వులతో జిల్లా ఎమ్మెల్యేలకు దక్కే పదవులపై పూర్తి స్పష్టత రానుంది. పార్లమెంటరీ సెక్రటరీ.. పార్లమెంటరీ సెక్రటరీకి రాష్ట్ర సహాయ మంత్రి హోదా ఉంటుంది. ముఖ్యమంత్రి ఇష్టానుసారం వీరిని నియమించుకోవచ్చు. జీతభత్యాలు, వసతులు, ఇతర రవాణా సౌకర్యాల వంటివన్నీ మంత్రులతో సమానంగానే ఉంటాయి. ప్రస్తుతం పంజాబ్, రాజస్థాన్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, గోవా తదితర రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ ఉంది. ముఖ్యమంత్రికి, మంత్రులకు వీరు సహకరిస్తారు. వీరికి కేటాయించిన శాఖలకు రాజకీయ అధిపతులుగా వ్యవహరిస్తారు. సమీక్షలు నిర్వహించి ఆదేశాలిస్తారు. ఫైల్స్‌పై సంతకాలు చేస్తారు. కార్యాలయాల కేటాయింపుతోపాటు బుగ్గ కార్లు, జీతభత్యాలు గౌరవమర్యాదలు, ఇతర వసతులు వర్తిస్తాయి. సీఎం అనుమతిస్తే కేబినెట్ సమావేశాల్లో పాల్గొంటారు. పార్లమెంటరీ కార్యదర్శులుగా వీరితో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వీరికి శాఖల కేటాయింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటన జారీ చేస్తారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం తెలంగాణలో ఇదే మొదటిసారి. మర్రిచెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న 1978-80లో పార్లమెంటరీ సెక్రెటరీ పదవులు ఉన్నాయి. పేరు : అజ్మీరా చందూలాల్ పుట్టిన తేదీ : 08-07-1954 విద్యార్హతలు : ఇంటర్మీడియెట్ తల్లిదండ్రులు : మీటూనాయక్, మీరాబాయి భార్య : శారద పిల్లలు : పద్మాదేవి, ధరంసింగ్, ప్రహ్లాద్, ప్రవీణ్ సామాజిక వర్గం: ఎస్టీ(లంబాడా) స్వస్థలం : సారంగపల్లి, జగ్గన్నపేట గ్రామపంచాయతీ, ములుగు మండలం. రాజకీయ నేపథ్యం.. 1981లో జగ్గంపేట సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1983లో టీడీపీలో చేరారు. 1985, 1994లో టీడీపీ అభ్యర్థిగా ములుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన సంక్షేమ శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 1994,1996 టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 1996,1998లో వరంగల్ ఎంపీగా ఎన్నికయ్యారు.(అప్పుడు జనరల్ స్థానం) 2001లో ట్రైకార్ చైర్మన్‌గా మూడేళ్లు చేశారు. 1983, 1989, 1999 ఎన్నికల్లో ములుగు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేసి ఓటమిపాలయ్యారు. 2005లో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వ్యవహరిస్తున్నారు. 2009లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మహబూబాబాద్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ములుగు నుంచి 16,399 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
సోమశిల హైలెవల్ కెనాల్‌కు కేబినెట్ అనుమతి
ఆత్మకూరు : జిల్లాలోని మెట్ట నియోజకవర్గాలైన ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు అందించేందుకు ఏర్పాటు కానున్న సోమశిల హైలెవల్ కెనాల్‌కు రాష్ట్ర కేబినెట్ అనుమతి ఇచ్చిందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ నేత నాగులపాటి శ్రీనివాసులురెడ్డి నివాసంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ కాలువ ద్వారా ప్రధానంగా రెండు నియోజకవర్గాల్లో బీడు భూములు సాగు భూములుగా మరే అవకాశం ఉందన్నారు. ఎంతో కాలంగా మెట్ట రైతులు ఈ హైలెవల్ కాలువ కోసం నిరీక్షిస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్ల పాటు కొనసాగితే జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి, రాపూరు, కావలి ప్రాంతాలు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం పారిశ్రామిక వేత్తలు ఉత్తరాంచల్ రాష్ట్రానికి వెళ్లి పెట్టుబడులు పెడుతున్నారని, అదే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్ల పాటు కొనసాగితే ఎందరో పారిశ్రామిక వేత్తలు ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామికరణ అభివృద్ధికి ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇటీవల పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే మౌలిక వసతులపై కూడా ఈ ప్రాంతంలో కొంత పరిశీలన జరిగిందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు సోమశిల అధికారులతో మాట్లాడి ఐఏబీ సమావేశంలో తీర్మాణించేలా కృషి చేస్తామన్నారు. ఎంపీ నిధులు అధిక శాతం రూ.5 కోట్ల మేర తాగునీటి అవసరాలకే వెచ్చించామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి రూ.1.04 కోట్లు, ఉదయగిరి నియోజవర్గానికి రూ.1.05 కోట్లు, కావలికి రూ.78 లక్షలు, మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాగునీటి అవసరాల కోసం ఈ నిధులు వెచ్చించామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ ద్వారా తాగునీటి అవసరాలు తీర్చేందుకు జెడ్పీ ద్వారా కూడా కృషి చేస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మెట్ట ప్రాంతంలోనే గాక డెల్టా ప్రాంతాల్లో కూడా బోర్లు కోసం ప్రతిపాదనలు వస్తున్నాయని తెలిపారు. బోగోలు మండలంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు కూడా కలెక్టరు ఆదేశించారన్నారు. ప్రధానమైన సమస్యలు, ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీ నిధులతో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం వారు జిల్లాలో అమలు అవుతున్న పింఛన్ల పరిశీలనపై ఆరా తీశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇందూరు నారసింహారెడ్డి, ఎంపీపీ సిద్ధం సుష్మ, మాజీ ఎంపీపీ డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు నాగులపాటి శ్రీనివాసులురెడ్డి, అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, తూమాటి దయాకర్‌రెడ్డి, అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సలర్ నాగులపాటి విజయలక్ష్మి పాల్గొన్నారు. -
త్వరలో విస్తరణ
సాక్షి, ముంబై: త్వరలో రాష్ట్ర మంత్రిమండలిని విస్తరించనున్నట్లు ముఖ్యంత్రి చవాన్ పరోక్షంగా వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రాష్ట్రమంత్రులు గెలుపొందినట్లయితే ఖాళీ అయిన వారి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం ఢిల్లీ వెళ్లాలని యోచిస్తున్నట్లు చెప్పారు. దీంతో రాష్ట్ర మంత్రిమండలి విస్తరణ త్వరలో ఉండడం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉన్నా కాంగ్రె స్, ఎన్సీపీ నేతల్లో మంత్రిపదవులను దక్కించుకునే పోటీ తీవ్రంగానే కనిపిస్తోంది. కొత్తవారికి అవకాశం దక్కడంతోపాటు ఉన్నవారి శాఖలు కూడా మార్చే అవకాశముందని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఎన్సీపీ నుంచి ముగ్గురు రాష్ట్ర మంత్రులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. కాంగ్రెస్‌లో.... లోకసభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో అయిదుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా తమ కోటాలోని మూడు మంత్రి పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన సామాజిక న్యాయశాఖ మంత్రి శివాజీరావ్ మోఘే, పర్యావరణశాఖ మంత్రి సంజయ్ దేవ్తలేలు లోకసభ ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిద్దరు విజయం సాధించి నట్టయితే మరో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఈ ఐదు స్థానాల్లో కొత్తవారికి అవకాశాలు దక్కనున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మంత్రిపదవుల రేసులో ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు వసంత్ పురకే తదితర నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరితోపాటు మరికొందరు కూడా మంత్రి పదవిని దక్కించుకునేందుకు ఇప్పటినుంచే ఢిల్లీలో ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఎన్సీపీలో... లోక్‌సభ ఫలితాల అనంతరం మంత్రి మండలి విస్తరించనున్నట్టు సంకేతాలు వెలువడంతో ఎన్సీపీ నేతల్లో ఆశలో చిగురించాయి. ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్, జలవనరులశాఖ మంత్రి సునీల్ తట్కరేలతోపాటు సురేష్ దస్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వీరంతా విజయం సాధించినట్టయితే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఖాళీ కానున్న వీరి స్థానాలను కొత్తవారితో భర్తీ చేస్తే మరికొందరికి అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నాయకులలో జితేంద్ర అవాడ్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆయనతోపాటు ప్రకాశ్ సోలంకే, ధనంజయ్ ముండే, సమీర్ భుజ్‌బల్, పంకజ్ భుజ్‌బల్ తదితరులు కూడా మంత్రిపదవుల రేసులో ఉన్నారని చెబుతున్నారు.